క్రీడలతో శారీరక దృఢత్వం
ఆదిలాబాద్: క్రీడలు శారీరక ధృఢత్వానికి దో హదపడతాయని డీటీఎస్‌వో పార్థసారథి అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మూడో ఖేలో ఆదిలాబాద్ పోటీలను డీవైఎస్‌వో శ్రీనివాస్‌తో కలిసి శని వారం ప్రారంభించి మాట్లాడారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీజీఎస్ డిఫెన్స్ అకాడమీ సహకారంతో ప్రైవేట్ పాఠశాలల వి ద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ జిల్లా ప్ర ధాన కార్యదర్శి రాజేశ్, రామేశ్వర్, కృష్ణ, వీజీ ఎస్‌జో, ప్రిన్సిపాళ్లు,క్రీడాకారులు పాల్గొన్నారు.
చాంపియన్‌షిప్‌గా లిటిల్‌స్టార్
ఖేలో ఆదిలాబాద్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌గా లిటిల్ స్టార్ హైస్కూల్ నిలిచింది. అన్ని క్రీడాంశాల్లో ఆ పాఠశాల విద్యార్థులు సత్తా చాటడంతో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. వరుసగా మూడోసారి విజేతగా నిలవడంపై నిర్వాహకులు అభినందనలు తెలిపారు.


