సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి
ఆదిలాబాద్‌టౌన్: కేసుల దర్యాప్తు, పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలోని 21 పోలీస్‌స్టేషన్లలో ఇటీవల విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు ఐదు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శనివారంతో ముగిసింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విధి నిర్వహణపై ఎస్పీ వారికి దిశానిర్దేశం చేశారు. నేరస్తులకు శిక్షలు పడినప్పుడే బాధితులకు న్యాయం లభిస్తుందన్నారు. తద్వారా పోలీసు వ్యవస్థపై గౌరవం, ప్రతిష్ట పెరుగుతుందన్నారు. ఇందులో మహిళా పోలీస్ స్టేషన్ సీఐప్రేంకుమార్, డీసీఆర్‌బీ ఎస్సైలు నరేశ్, హకీమ్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి
బోథ్: వార్షిక తనిఖీల్లో భాగంగా బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ శనివారం సందర్శించారు. ఆవరణను పరిశీలించి శుభ్రతపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆర్థిక నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్నందున గంజాయి, మదకద్రవ్యాల అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలని సూచించారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, ఎస్సైలు సాయికుమార్, జి.సంజయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చట్టాన్ని గౌరవించాలి
బజార్‌హత్నూర్: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శనివారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వీపీవో విధానం అమలు చేసి సమాచార వ్యవస్థ పటిష్ట పరుచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎస్సై సంజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.


