
జీఎస్టీ 2.0 సంబురం
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. జిల్లావ్యాప్తంగా కిరాణ దుకాణాలు, మా ల్స్ సందడిగా మారాయి. అలాగే వాహన షోరూంలు వినియోగదారులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సామాన్యులకు సంబంధించిన నిత్యావసరాల ధరలు 18, 12 శాతం స్లాబ్‌లో నుంచి ఐదు శాతంలోకి వచ్చాయి. దీంతో పేద, మధ్యతరగతి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ మార్పుతో ఆదాయం మిగులుతుందనే ఆనందం వినియోగదారుల్లో వ్యక్తం అవుతుంది. అయితే వెంటనే ధరలు తగ్గుదల అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని, కొత్త స్టాకుపై ఈ ప్రభావం ఉండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.