
బీమాపై జీఎస్టీ ఎత్తివేత హర్షణీయం
ఈసారి పండుగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఇబ్బంది లేకుండా జీఎస్టీ స్లాబులు సవరించడం శుభ పరిణామం. మరింతగా సవరిస్తే బాగుండేది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జీఎస్టీ సంస్కరణల ద్వారా దిగి రావాలి. అప్పుడే సామాన్యుడికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా బీమా పాలసీలపై జీఎస్టీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. బీమా తీసుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరం.
– రాఘవేంద్ర దారవేణి, తాంసి, ఆదిలాబాద్