ఆదిలాబాద్‌టౌన్: ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు అందజేస్తూ పరిష్కరించాలని సూచించారు. భూ సమస్యలపై వచ్చిన వినతులను ఆన్‌లైన్ ద్వారా సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ వారం మొత్తం 82 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.