
వ్యవసాయ కళాశాల డీన్‌గా ప్రవీణ్‌కుమార్
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ వ్యవసాయ కళా శాల అసోసియేట్ డీన్‌గా డాక్టర్ వై.ప్రవీణ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు కృషివిజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఆయన ఇక్కడికి బదిలీ అయ్యారు. ఇక్కడ డీన్‌గా పనిచేసిన శ్రీధర్ చౌహాన్ ఆది లాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా స్థానచలనం కల్పించారు. ఈ సందర్భంగా బదిలీపై వచ్చిన, బదిలీపై వెళ్తున్న శాస్త్రవేత్తలను కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది సోమవారం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.