
సరస్ మేళాకు జిల్లా ప్రతినిధులు
కై లాస్‌నగర్: రాష్ట్రంలోని గ్రామీణ స్వయం సహా యక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులతో ప్ర భుత్వం ప్రత్యేకంగా సరస్ మేళాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన ప్రదర్శనను తిలకించేందు కోసం జిల్లా సమాఖ్య కార్యవర్గంతో పాటు ఒక్కో మండల సమాఖ్య నుంచి ముగ్గురు ప్రతినిధుల చొప్పున ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు. వారి వెంట సెర్ప్ డీపీఎం రమాకాంత్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, ఏపీఎం సంతోష్ తదితరులు ఉన్నారు.
మేళాకు బయలుదేరుతున్న సమాఖ్య ప్రతినిధులు