
ఓటు ప్రాధాన్యతపై ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులు
కై లాస్‌నగర్: ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిజేయాలని కలెక్టర్ రాహుల్ సూచించారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో స్వీప్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, ఉన్నత ఆశయాలతో ఎదగాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా తల్లిదండ్రులు, బంధువులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులు, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. స్వీప్ కార్యక్రమాలపై ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్న పలువురు విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. అనంతరం ఓటు వినియోగ బాధ్యతను తెలిపేలా చేపట్టిన సంతకాల సేకరణ, సెల్ఫీ పాయింట్ కార్యక్రమాల్లో కలెక్టర్, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మోహతోతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖల అధికారులు మిల్కా, రమేశ్‌రాథోడ్, డీఈవో ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాహుల్‌రాజ్