మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన కార్మికులు
కై లాస్‌నగర్: తమ వేతన బకాయిలు విడుదల చే యాలని డిమాండ్‌తో మున్సిపల్ కార్యాలయం ఎ దుట పారిశుధ్య కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఉదయం 5.30 గంటలకు విధులకు హా జరయ్యేందుకు వచ్చి.. విధులకు వెళ్లకుండా కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపా రు. ఉ దయం 10:30 గంటల వరకు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని వారి వద్దకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఏ.శైలజకు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ విన్నవించారు. ఆమె సానుకూలంగా స్పందించడంతో వారు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న తమ సమస్యలను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. 8 నెలలుగా పీఎఫ్ బకాయిలను కోత విధిస్తున్నప్పటికి వాటిని తమ ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వేతన, పీఎఫ్ బకాయిలను అధికారులు వెంటనే చెల్లించాలని లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కాగా, వీరి ఆందోళనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రారష్ట్‌ర కమిటీ సభ్యురాలు సుహాసినిరెడ్డి మద్దతు తెలిపారు.
సమస్యలను చెప్పుకునేందుకే వెళ్లాం
పీఆర్సీ, పీఎఫ్, వారాంతపు సెలవులు వంటి అంశాలపై మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తే వివిధ పార్టీలు, సంఘాల నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పేర్కొన్నారు. సోమవారం స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కార్మికులు నగేశ్, శంకర్, రాకేశ్, లక్ష్మి, ఉషన్న, సురేశ్ మాట్లాడారు. కార్మికులందరం కలిసి మున్సిపల్ కమిషనర్‌తో పలు అంశాలపై చర్చించేందుకు వెళ్లామన్నారు. తమకు రావాల్సిన పీఆర్సీ. పీఎఫ్, వారాంతపు సెలవులు, ఏరియర్స్ తదితర అంశాలపై మున్సిపల్ చైర్మన్‌తో పాటు కమిషనర్ స్పష్టమైన హామీలు ఇవ్వడంతో తిరిగి విధుల్లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. తాము ఎలాంటి సమ్మెలు, ధర్నాలు చేయలేదన్నారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం రెండుసార్లు మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచిందని, ప్రస్తుతం రూ. 15,600 వేతనం అందుతుందని తెలిపారు.


