breaking news
Zameer Ahmed
-
బాంబు ఇవ్వండి.. పాకిస్తాన్ వెళ్తా..
-
మణిపూర్ అమ్మాయిల బాధ్యత నాదే.. మంత్రి మంచి మనసు
బెంగళూరు: మణిపూర్ శరణార్థుల విషయంలో కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ మంచి మనసు చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 29 మంది మణిపూర్ అమ్మాయిల బాధ్యతలను తీసుకుంటున్నట్లు ప్రకటించారాయాన. మణిపూర్ అల్లర్ల కారణంగా.. మణిపూర్ నుంచి చాలామంది ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఆ రాష్ట్రం నుంచి కొందరు కర్ణాటక చామరాజ్‌పేట సెయింట్ థెరెస్సా విద్యాసంస్థల్లో ఆశ్రయం పొందుతున్నారు. వాళ్లలో 29 మంది చదువుకునే వయసున్న అమ్మాయిలు ఉన్నారు. ఆగష్టు 1వ తేదీన జమీర్ అహ్మద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఆ అమ్మాయిలతో మాటామంతీ కలిపిన ఆయన వాళ్ల పరిస్థితికి చలించిపోయారు. తక్షణ సాయంగా రూ.2 లక్షలను ప్రకటించారాయన. ‘‘వాళ్ల చదువులు పూర్తి కావాలంటే ఏడేళ్లు పూర్తి కావొచ్చు. ఈ ఏడేళ్ల కాలంలో వాళ్లకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా. వాళ్లు ఇక్కడ ఉన్నంత కాలం సురక్షితంగా ఉండొచ్చు’’ అని ప్రకటించారాయన. జమీర్ అహ్మద్ ‘నేషనల్ ట్రావెల్స్’ భాగస్వామ్య యాజమాని. చామరాజ్‌పేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారాయన. అందులో మూడుసార్లు జేడీఎస్ నుంచి.. రెండుసార్లు కాంగ్రెస్ తరపున నెగ్గారు. ప్రస్తుతం హౌజింగ్ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారాయన. -
హరీష్‌ది విశాల హృదయం
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కుటుంబ ఖర్చుల కోసం రూ.5లక్షల అందజేత అన్ని విధాల ఆదుకుంటానని హామీ తుమకూరు : తాను మరణిస్తూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపి మానవతాను చాటుకున్న హరీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ ఆహ్మద్ అన్నారు. తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా, కడబ సమీపంలోని కరెగౌడనహళ్లికి చెందిన హరిష్ (22) మంగళవారం సాయంత్రం జాతీయ రహదారిలో జరిగిన లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణం పోతుందని తెలుసుకొని కళ్లను సేకరించాల్సిందిగా వైద్యులకు తెలపాలని స్థానికులకు సూచిస్తూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మృతుడి కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ పరామర్శించి హరీష్ మానవతను శ్లాఘించారు. ప్రాణాలు పోతున్న చివరి క్షణంలో కూడా మంచి మనుసుతో మరొకరి జీవితంలో వెలుగు నింపి వెళ్లారని కొనియాడారు. ఈ ప్రమాదం విషయం టీవిలో చూసి బాధపడ్డానని, ఉప ఎన్నికల ఫలితాలు ఉన్నందున ఆ సమయంలో రాలేకపోయానన్నారు. ఇరుకైన ఇంటిలో నివాసం ఉంటున్న హరీష్‌కు దేవుడు విశాలమైన మనస్సు ఇచ్చారన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న హరీష్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఆదుకుంటానన్నారు. హరిష్ అన్న శ్రీధర్‌కు ఉద్యోగ అవకాశం కల్పించి దగ్గరుండి వివాహం చేయిస్తానని, తల్లికి ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం కుటుంబ ఖర్చుల కోసం రూ. 5 లక్షలు అందజేశారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చుమొత్తం సొంతంగా భరిస్తానన్నారు. -
కుమారస్వామికి ఉర్దూ అర్థం కాదనుకుంటా!
జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ సాక్షి, బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామికు, అదే పార్టీకి చెందిన శాసనసభ్యుడు జమీర్ అహమ్మద్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ‘ఆయనకు ఉర్దూ అర్థం కాదనుకుంటా’ అంటూ కుమారపై జమీర్ అహమ్మద్ వ్యంగాస్త్రాలు సంధించారు. చాలా సంవత్సరాలుగా బక్రీద్ సందర్భంగా చామరాజపేట ఈద్గామైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో జమీర్ అహమ్మద్‌తో కలిసి కుమారస్వామి పాల్గొనేవారు. అయితే సోమవారం నాడు నిర్వహించిన ప్రార్థనలకు కుమార స్వామి గైర్హాజరయ్యారు. ఈ విషయంపై మీడియాతో జమీర్ మాట్లాడుతూ... ‘సాముహిక ప్రార్థనల్లో పాల్గొనాల్సిందిగా నేను కుమారస్వామికి ఉర్థూలో లేఖ రాశాను. అయితే ఆయనకు ఉర్దూ అర్థం కాదనుకుంటా. అందుకే హాజరు కాలేదు.’ అని ఎద్దేవా చేశారు. గత నెల 3న బెంగళూరులో జరిగిన జేడీఎస్ శాసనసభ పక్షం సమావేశానికి జమీర్ అహమ్మద్ హాజరు కాకపోవడంతో ‘జమీర్ అహమ్మద్‌కు కన్నడ అర్థం కాదనుకుంటా. అందుకే కన్నడలో రాసిన ఆహ్వాన పత్రిక చదువలేకపోయారు. దీంతో శాసనసభ పక్షం సమావేశానికి హాజరుకాలేదు. అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇందుకు ప్రతీకారంగానే జమీర్ అహమ్మద్ తాజాగా వ్యంగాస్త్రాలు వదిలారని తెలుస్తోంది. -
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘోరం
= మృత్యుశకటం... = 45 మంది సజీవ దహనం = మృతుల్లో 28 మంది బెంగళూరు వాసులు? = ఆహుతైన ప్రైవేట్ బస్సు = బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘోరం = ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్, మరో ఐదుగురు ప్రయాణికులు ప్రయాణపు అలసటతో కాస్తంత సేపు అలా కునుకుతీశారు. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరిపోతాం అనుకుంటూ ఆదమరిచి రెప్పలువాల్చారు. కానీ వాళ్లకేం తెలుసు.. తాము ప్రయాణిస్తున్న బస్సే మృత్యుశకటమై వాళ్లను కాటేస్తుందని.. తమను గమ్యస్థానాలకు చేరుస్తుందనుకున్న బస్సే చితిమంటలను రగిల్చి తమ నిండు జీవితాలను బుగ్గిపాలు చేస్తుందని... తెలతెల వారకుండానే తమ బతుకులు తెల్లారిపోతాయని... బుధవారం తెల్లవారుఝామున ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలం గ్రామం వద్ద సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం 45 మంది జీవితాలను బలిగొని, వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కుటుంబాన్ని షోషించే పెద్దదిక్కును కోల్పోయిన వారు ఒకరైతే, అనురాగాన్ని పంచే తల్లిని దూరం చేసుకున్న వారు ఇంకొకరు. ఇలా ప్రమాదంలో మరణించిన ఒక్కో వ్యక్తికి, ఒక్కో కుటుంబానికి ఒక్కో కన్నీటి గాధ, తీరని వ్యధ... వెరసి వారి జీవితంతో అదో కాళరాత్రిగా మిగిలింది. సాక్షి, బెంగళూరు : బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో 45 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలంలో ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. వివరాలు... బెంగళూరుకు చెందిన షకీల్ జబ్బర్, జబ్బార్ ట్రావెల్స్ పేరుతో హైదరాబాద్, ముంబై,చెన్నై, కేరళాలోని తిరుచ్చి ప్రాంతాలకు 30 బస్సులను నడుపుతున్నారు. అందులో ఐదు బస్సులు ప్రతి రోజూ బెంగళూరు, హైదరాబాద్ మధ్య సంచరిస్తున్నాయి. రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు గంటకో బస్ చొప్పున జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు నగరం నుంచి బయలుదేరతాయి. ఇందులో భాగంగా ఈనెల 29 (మంగళవారం) రాత్రి 10 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కళాసిపాళ్య బస్టాండ్ నుంచి ఓల్వో బస్సు (ఏపీ 02టీఏ 0963) హైదరాబాద్‌కు బయలు దేరింది. ఈ బస్సు బెంగళూరులోని బీటీఎంలే అవుట్ వద్ద ప్రారంభమై కోరమంగళ, బెలందూర్, మారతహళ్లి, దొమ్మలూరు, కళాసిపాళ్య, ఆనందరావ్సర్కిల్, మైత్రివనం, హెబ్బాల్ వద్ద మొత్తం 44 మంది ప్రయాణికులను ఎక్కించుకుని సరిగ్గా రాత్రి 10:30 గంటలకు బెంగళూరు నగరాన్ని వీడింది. ఈ బస్సు హైదరాబాద్‌కు బుధవారం ఉదయం సుమారు 6:30 గంటలకు చేరాల్సి ఉంది. అయితే తెల్లవారుఝామున 5.25 గంటల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా పాలం గ్రామం వద్దకు చేరుకోగానే బస్సు ప్రమాదానికి గురైంది. క్షణాల్లో బస్సులో మంటలు వ్యాపించడంతో... అందులోని 45 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో దాదాపు 28 మంది వరకు బెంగళూరుకు చెందిన వారు కాగా, మిగతా వారు ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధికి నగరానికి వచ్చిన వారిగా తెలుస్తోంది. కాగా మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అజ్మతుల్ల, అతని భార్య జబీన్‌తాజ్ వీరి ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. కాగా ఈ దుర్ఘటన నుంచి బెంగళూరుకు చెందిన డ్రైవర్ ఫైరోజ్, కోలారుకు చెందిన క్లీనర్అయాజ్, ప్రయాణికులు శ్రీకర్, యోగేష్, మజర్ భాష, జై సింగ్, రాజేష్ ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలతో బయటపడిన వీరికి వైద్య సేవలు అందిస్తున్నట్లు ట్రావెల్స్ యజమాని షకీల్ జబ్బర్ సోదరుడు జమీల్ జబ్బర్ బెంగళూరులో మీడియాకు వెల్లడించారు. ప్రమాదఘటనపై భిన్న వాదనలు... ఘటన గురించి తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ బెంగళూరు కళాసిపాళ్య వద్ద ఉన్న జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. సంస్థ మేనేజర్ ఇంతియాజ్‌తో మాట్లాడి ఘటన వివరాలు తీసుకున్నారు. అనంతరం ప్రమాద కారణాలను మీడియాకు వివరించారు. ‘బస్సు మహబూబ్‌నగర్ పాలం వద్దకు చేరుకోగానే వాహనం ముందు టైర్ పేలిపోవడంతో డ్రైవర్ వాహనాన్ని పక్కగా ఆపి ఆ విషయాన్ని వాహనం యజమాని షకీల్ నవాజ్ జబ్బర్‌కు తెలియజేశాడు. వాహనం పక్కగా నిలబడి డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతుండగానే పేలిన టైర్ నుంచి అగ్గిరవ్వలు వెలువడి సమీపంలో ఉన్న డీజిల్ ట్యాంకర్‌పై పడ్డాయి. దీంతో బస్సు మొత్తం క్షణాల్లో తగలబడిపోయింది.’ అని వివరించారు. అయితే ప్రమాదానికి మరో కారణం కూడా వినిపిస్తోంది....ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు డ్రైవర్ చాలా వేగంగా బస్సును నడుపుతూ ముందు వెలుతున్న కారును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించి అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. వేగంగా బస్ డివైడర్‌ను ఢీ కొట్టిన తక్షణమే ముందు టైర్ వెనకనే ఉన్న డీజిల్ ట్యాంకర్ కూడా డివైడర్‌ను బలంగా తాకింది. దీంతో డీజిల్ ట్యాంకర్ పేలిపోయి క్షణాల్లో బస్సు మొత్తం మంటల్లో తగలబడిపోయింది. ఇక ప్రమాదం జరిగే సమయానికి ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్న కారణంగా అసలు ఏం జరుగుతోందనేది తెలిసేలోపే ప్రయాణికులందరూ మంటల్లో సజీవదహనమయ్యారు. ఇక డ్రైవర్ క్లీనర్ కాస్తంత మెలకువలోనే ఉంటారు కాబట్టి ప్రమాదాన్ని గ్రహించి తమ పక్కనే ఉన్న అద్దాలను బద్దలుకొట్టుకొని బయటకు దూకేసినట్లు తెలుస్తోంది. పరిహారం అందించలేమన్నకర్ణాటక ప్రభుత్వం బస్ ప్రమాదం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందించలేమని కర్ణాటక సర్కారు తెలిపింది. ఈ విషయమై ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాట్లాడుతూ... ఘనటకు సంబంధించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో మాట్లాడానని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందిగా కోరానని చెప్పారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేఎస్ఆర్టీసీలో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం తరఫున పరిహారం అందించడానికి వీలవుతుందని చెప్పారన్నారు. అయితే బస్సుకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మృతుల కుటుంబాలకు రూ.4 నుంచి రూ.5 లక్షల పరిహారం అందించడానికి అవకాశం ఉందన్నారు. కాగా కర్ణాటక శాసనసభ ప్రతిపక్షనాయకుడు కుమారస్వామి మాత్రం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఘటనకు సంబంధించి దర్యాప్తు జరపడానికి రాష్ట్ర రవాణా శాఖలో కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అమర్‌నారాయణ అనే సీనియర్ అధికారిని విచారణ అధికారిగా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్... ప్రమాదానికి గురైన వోల్వో బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 2010, అక్టోబర్ 6న దివాకర్ రోడ్లైన్, జేసీ ఉమారెడ్డి పేరున రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. అయితే ఈ బస్సును బెంగళూరుకు చెందిన దివంగత సీఏ జబ్బర్ భార్య షాహీన్జబ్బర్, ఆయన కుమారులు షకీల్జబ్బర్, జమీల్జబ్బర్కు లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి జబ్బర్ ట్రావెల్స్ పేరుతోనే బెంగళూరుకు, హైదరాబాద్‌కు మధ్య బస్సు నడుస్తోంది. కాగా బస్సు లీజుకు ఇచ్చినట్లు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తుంటే, జేసీ సోదరులు మాత్రం బస్‌ను తాము మూడేళ్ల క్రితమే అమ్మేశామని, బస్తో తమకేం సంబంధం లేదని అనడం గమనార్హం. అంతేకాకుండా దాదాపు రూ.1.70 కోట్లు విలువజేసే బస్సును లీజుకు ఇస్తే దానికి కనీసం సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లీజును రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలం నోటరీతో సరిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.