breaking news
Yamuna riverbed
-
యమున నది తీరాన భారీగా మంటలు
న్యూఢిల్లీ: యమున నది తీరాన.. మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకుని మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అటవీ ప్రాంతంలో మంటలు రావడంతో కార్చిచ్చుగా భావించారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక వాహనాలు తీవ్రంగా శ్రమించాయి. యమున నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ సమీపంలోనే మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ ఉంది. ఈ మంట వ్యాప్తితో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 12 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే దట్టమైన పొగలు రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ముందే కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీలో ఈ పొగ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నది ఒడ్డున మంటలు ఎలా వచ్చాయనేది ఇంకా తెలియడం లేదు. దీనిపై అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ మంటలు వ్యాపించిన ప్రాంతానికి సమీపంలోనే ఇందిరా గాంధీ స్టేడియం, రాజ్‌ఘాట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. @abpnewstv @DelhiPolice Fire at Raj ghat, police at the location but effort seem very poor. pic.twitter.com/TJ31jdGuQV — Bohraj Gupta (@RajCT) February 25, 2017 -
రవిశంకర్ గురూజీకి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ వల్ల యమునా నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని నిపుణుల కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదించింది. వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించిన యమునా నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన కమిటీ అక్కడి పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ 47 పేజీల నివేదికను సమర్పించింది. పర్యావరణాన్ని విధ్వంసం చేశారనే ఆరో్పణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కమిటీని వేసింది. నదీ తీరాన జీవవైవిద్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని కమిటీ తన నివేదికలో పేర్కొంది.