breaking news
Woman caught
-
బట్టల దుకాణంలో చోరీ: మహిళ పట్టివేత
బయ్యారం(ఖమ్మం): ఖమ్మం జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఓ దుకాణంలో గురువారం సాయంత్రం చీరల దొంగతనం జరిగింది. ఇందుకు పాల్పడ్డ ముఠాలో ఒక మహిళ పట్టుబడింది. వివరాలివీ.. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సరితా శారీ సెంటర్ ఉంది. ఇందులోకి గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఐదుగురు మహిళలు ప్రవేశించారు. వారిలో ఇద్దరు చీరలను బేరం చేస్తుండగా మిగతా ముగ్గురూ ఇరవై చీరలను తమ బ్యాగుల్లో దాచిపెట్టుకున్నారు. ఒక చీరను కొనుక్కుని వారు వెళ్లిపోయిన తర్వాత.. చీరలకు సంబంధించిన ఖాళీ పెట్టెలు మాత్రమే మిగిలి ఉండటం దుకాణం సిబ్బంది గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే వారు గాలించగా ఒక మహిళ పట్టుబడింది. ఆమె వద్ద నుంచి 5 చీరలను స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించారు. మిగతా వారు పరారయ్యారు. కాగా, వారంతా వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం ముంజమడుగు తండా వాసులని తేలింది. -
35 నక్షత్ర తాబేళ్ల పట్టివేత
వాల్మీకిపురం : చిత్తూరు జిల్లా వయల్పాడు మండల కేంద్రంలో.. ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న 35 నక్షత్ర తాబేళ్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు ఓ కేసు విచారణలో భాగంగా వెళుతుండగా వాయల్పాడులో గౌరమ్మ(28) అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. ఆమెను విచారించగా... సరైన వివరాలు చెప్పకపోవడంతో పోలీసులకు సందేహం వచ్చింది. ఆమె వద్దనున్న ఓ ప్లాస్టిక్ బుట్టను పరిశీలించగా అందులో 35 నక్షత్ర తాబేళ్లు కనిపించాయి. దీంతో పోలీసులు తాబేళ్లతోపాటు గౌరమ్మను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వారు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.