breaking news
VIP appearance
-
సిఫార్సు దర్శనం.. రాబడికి ఆటంకం
నూతన పాలకవర్గం.. అత్యుత్సాహం.. అయినవారికి.. కానివారికి సిఫార్సులతో వీఐపీ దర్శనం ఉచితం.. అడిగిన సిబ్బందికి బెదిరింపులు.. చేష్టలుడిగిన ఉద్యోగులు.. వెరసి ఆలయ ఖజానా రాబడికి గండి. ఫలితం ఆలయాభివృద్ధికి ఆటంకం. ఇదీ కాణిపాకంలో దర్శనాల పరిస్థితి. కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానంలో పాలక మండలి సభ్యులు ఉచిత దర్శన సిఫార్సులతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. ఒక్క రోజులోనే 189 మందిని శీఘ్రదర్శనానికి పంపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా పంపడం కుదరదన్న సిబ్బందికి ఫోనులోనే ఓ పాలక మండలి సభ్యుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. మరో వైపు ఆగమశాస్త్రం విరుద్ధంగా గర్భాలయంలోకి సైతం తమ అనుచరులను తీసుకు వెళ్లి, దర్శనాలు చేయిస్తున్నారు. కంచె చేను మేస్తే ... పాలకమండలి ముఖ్యఉద్దేశం ఆలయాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కావాలి. కానీ కంచె చేను మేసే చందాన తయారైంది కాణిపాకం దేవస్థానం పరిస్థితి. రద్దీ సమయాల్లో పాలకమండలి సభ్యులు వందల మందిని ఉచితంగా దర్శనాలకు పంపుతున్నారు. ప్రధానంగా చైర్మన్ కార్యాలయం నుంచి నలుగురు దేవస్థానం సిబ్బంది, నలుగురు హోంగార్డులను విధుల్లో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి 8 మంది పాలక మండలి సభ్యుల ప్రాంతాల నుంచి, వారి అనుచరులు ఎవరు వచ్చి నా ఉచితంగా వినాయకస్వామి దర్శనం చేస్తున్నారు. ♦ ఉదాహరణకు శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు కుప్పం నుంచి వివాహ బృందం 32 మంది రూ.వంద క్యూ ద్వారా శీఘ్ర దర్శనం కల్పించారు. తద్వారా రూ 3,200 దేవస్థానానికి నష్టం వాటిల్లింది. అలాగే చైర్మన్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వెం కటరమణ(పేరు మార్చడం జరిగింది) 89 మందిని విడతల వారీగా దర్శనానికి తీసుకువచ్చారు. వారిని వీఐపీ ద్వారం నుంచి దర్శనానికి పంపారు. దీంతో ఆలయ ఖజానాకు రూ.8,900 నష్టం. ♦ ఇక చైర్మన్ ముఖ్య అనుచరుడు (బొమ్మ సముద్రం ప్రాంతానికి చెందిన వ్యక్తి ) మూడు విడతలుగా 19 మందిని వీఐపీ ద్వారం నుంచి దర్శనం చేయించారు. తద్వారా ఖజానాకు రూ.1,900 నష్టం. ♦ ఇక పలువురి పాలక మండలి సభ్యుల పేరుతో సాయంత్రం వరకు 42 మందికి పైగా వీఐపీ దర్శనాలు చేసుకున్నారు. ఒక్కొక్క (రూ.500) ఆశీర్వాదం టికెట్‌తో ఇద్దరు దర్శనం చేసుకోవచ్చు. ఈ లెక్కన రూ.10,500 ఖజానాకు నష్టం. ఇలా ఒకరోజులోనే దాదాపు రూ.24, 500 ఖజానాకు నష్టం. ఆగమ శాస్త్రవిరుద్ధంగాగర్భాలయ దర్శనం కాణిపాకం దేవస్థానంలో వీవీఐపీలకు మాత్రమే అది కూడా సంప్రదాయ దుస్తులతోనే గర్భాలయ దర్శనానికి అనుమతిస్తారు. ప్రస్తుత పాలక మం డలి సభ్యులు తమ అనుచరులను ఆగమ శాస్త్రాల విరుద్ధంగా సంప్రదాయాలు పాటించకుండా ష ర్టు, జీన్సు, ప్యాంట్లతో గర్భాలయ దర్శనాలు చే యిస్తున్నారు. ఇటీవలా హైదరాబాద్‌కు చెందిన టైల్స్ వ్యాపారి, సినీ నిర్మాత వారి కుటుంబానికి గర్భాలయ దర్శనం పాలక మండలి సభ్యులు చే యించారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధి కారులు ఈఓ దృష్టికి తీసుకువెళుతున్నట్లు సమాచారం. ఆయన కూడా పాలకమండలి, అందులో అధికార పార్టీ నేతలతో ఎందుకులే? అని మిన్నకుండి పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉచిత దర్శనాలకు అడ్డుకట్ట వేస్తాం దేవస్థానంలో ఉచిత దర్శనాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాం. దేవస్థాన సిబ్బంది ఎవరి నైనా దర్శనానికి తీసుకు వెళితే కచ్చితంగా ఈఓ కార్యాలయం అనుమతి తీసుకోవాలి. అలా కా దని ఎవరైనా దర్శనాలకు తీసుకువెళితే కచ్చి తంగా చర్యలు తీసుకుంటాం. గర్భాలయ దర్శనాలు చేయించాలంటే తప్పకుండా ఆలయాధికారులు అనుమతి ఉండాలి.– పి.పూర్ణచంద్ర రావు, ఈఓ, కాణిపాకం -
ప్రత్యేక అలంకరణలో శ్రీవారి ఆలయం
నూతన సంవత్సరానికి భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ సాక్షి, తిరుమల: నూతన సంవత్సరానికి తిరుమల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలోనూ అదనపు క్యూలు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు వీఐపీ దర్శనం ప్రారంభించనున్నారు. అందరికీ లఘుదర్శనం అమలు చేయాలని నిర్ణయించారు. గంటలోపే వీఐపీలకు దర్శనం పూర్తిచేసి, తర్వాత సర్వదర్శనం, కాలిబాట భక్తులకు దర్శనం కల్పించనున్నారు. రూ.300 టికెట్ల భక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. దర్శనానికి అనుమతించలేదని భక్తుల ఆందోళన సాక్షి , తిరుమల: శ్రీవారి దర్శనానికి అనుమతించలేదని టీటీడీ ట్రస్టులకు విరాళాలిచ్చిన భక్తులు గురువారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆందోళనకు దిగారు. నూతన సంవత్సరం సంద ర్భంగా డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. ఈ సమాచారాన్ని టీటీడీ వెబ్సైట్, ఈ-మెయిల్ ద్వారా భక్తులకు చేరవేశారు. అయితే గురువారం 50 మందికిపైగా విరాళాలిచ్చిన భక్తులను దర్శనానికి అను మతించలేదు. తాము రూ.30 లక్షల వరకు టీటీడీకి విరాళాలిచ్చామని, ముందస్తు సమాచారం లేకుం డా దర్శనానికి అనుమతించకపోవడం సబబుకాదని ఆందోళనకు దిగారు. అనంతరం టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశాలతో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆ భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు.