breaking news
Vikram Seth
-
టాప్–100 రచయితల్లో మనవాళ్లు
లండన్: ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన మొదటి 100 మందిలో.. ప్రముఖ భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్లకు చోటు దక్కింది. బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లున్నాయి. బీబీసీ నియమించిన నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాలసాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఏడాది పాటు శ్రమించి కొన్ని పుస్తకాలను ఈ బృందం ఎంపిక చేసింది. ఇందులో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది. పాక్ రచయితలు మొహ్సీన్ హమీద్, కమిలా షమ్సీలు రాసిన ది రిలక్టాంట్ ఫండమెంటలిస్ట్, హోం ఫైర్, అఫ్గాన్–అమెరికన్ రచయిత ఖలేద్ హొస్సైనీ రాసిన ఎ థౌజెండ్ స్లె్పండిడ్ సన్స్ నవలకు చోటు దక్కింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తవడంతో ఈ జాబితా తెచ్చారు. -
అవార్డు వెనక్కి ఇవ్వనున్న మరో రచయిత?
ఢిల్లీ: రచయితలకు, భావప్రకటన స్వేచ్ఛకు అండగా నిలబడటంలో కేంద్ర ప్రభుత్వ ధోరణి మారకపోతే తాను కూడా అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్టు ప్రముఖ కవి, నవలా రచయిత విక్రమ్ సేథ్ వెల్లడించారు. 'వర్స్- ద గోల్డెన్ గేట్' నవలకు గానూ 1988లో విక్రమ్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఒక ప్రముఖ టీవీ చానల్ ఏర్పాటు చేసిన చర్చాగోష్టి లో ఆయన శనివారం మాట్లాడారు.'అవార్డులను వెనక్కి ఇచ్చినవారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. అవార్డులను వెనక్కి ఇవ్వాలంటే దైర్యం ఉండాలి' అని ఈ సందర్భంగా విక్రమ్ సేథ్ అన్నారు. మీరు కూడా అవార్డు వెనక్కి ఇస్తారా అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు.. కవులు, రచయితల భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభుత్వ తీరు మారకపోతే తన అవార్డును తప్పకుండా తిరిగి ఇచ్చేస్తానని సేథ్ స్పష్టం చేశారు.