breaking news
velai benefit pattadari
-
ధనుష్‌తో మళ్లీ మళ్లీ..
నటుడు ధనుష్‌తో నటి అమలాపాల్ మళ్లీ మళ్లీ నటించేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరిది హిట్ జంటనే చెప్పాలి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు వేల్ దర్శకత్వంలో ధనుష్, అమలాపాల్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి సూపర్‌హిట్ అరుున విషయం తెలిసిందే. ధనుష్ నిర్మించిన అమ్మా కణక్కు చిత్రంలో నాయకి అమలాపాల్‌నే. ఇక ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్‌కు నాయకీ అమలాపాలే. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ధనుష్, అమలాపాల్ మరో చిత్రంలో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. వేలై ఇల్లా పట్టాదారి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ధనుష్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ధనుష్ మరదలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోరుున్ల గురించి రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆ చిత్ర నారుుకలు ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది.అరుుతే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. వేల్లై ఇల్లా పట్టాదారి-2 చిత్రంలో ధనుష్‌కు జంటగా అమలాపాల్ నటించనున్నారు.ఆమెతో పాటు నటి కాజల్‌అగర్వాల్, మంజిమామోహన్ నటించనున్నట్లు తెలిసింది.ఈ క్రేజీ చిత్రాన్ని కబాలి నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారు. అమలాపాల్ ఇప్పటికే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వడ చెన్నై చిత్రంతో పాటు తిరుట్టు పయలే-2, మలయాళంలో ప్రకాశ్‌రాజ్, జయరాం, ఉన్ని ముకుందన్తో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు విజయ్ నుంచి విడిపోరుు నటనపై పూర్తి దృష్టి సారిస్తున్న అమలాపాల్ తన పక్కింటి అమ్మారుు ఇమేజ్ను బ్రేక్ చేసే విధంగా అందాలను ఆరబోస్తూ తీరుుంచుకున్న ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ పరిశ్రమ దృష్టి తన వైపునకు మరల్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. -
రఘువరన్ మళ్లీ వస్తున్నాడు!
మాస్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ హీరో ధనుష్ ‘రఘువరన్ బీటెక్’తో తెలుగువారిని కూడా ఆకట్టుకోగలిగారు. ‘వేలై ఇల్లా పట్టదారి’ (వీఐపి)కి అనువాద చిత్రం ఇది. అటు తమిళంలో, ఇటు తెలుగులోనూ ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ మొదలైంది. విశేషం ఏంటంటే... రజనీకాంత్ రెండో కుమార్తె, ధనుష్ మరదలు సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘విఐపి 2’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రఘువరన్ ఈజ్ బ్యాక్’ అన్నది ట్యాగ్‌లైన్. గురువారం ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి స్టోరీ, డైలాగ్స్ ధనుష్ రాయడం ఓ విశేషం. ‘కబాలి’ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు.