breaking news
V Magazine
-
ప్రతిభకు ‘వి’ అవార్డులు
కళా రంగంలో ప్రతిభావంతులకు కొదవలేదు. కళలలో వివిధ రంగాలకు చెందిన ప్రతి భావంతులను గుర్తించి తగిన విధంగా సత్కరిం చేందుకు వి మ్యాగజైన్ యాజమాన్యం వి మాగజైన్ అవార్డును నెలకొల్పింది. తొమ్మిదేళ్ళుగా ఈ ప్రోత్సాహక అవార్డులతో సత్కరిస్తోంది. ఈ క్రమంలో ఈ సంస్థ పదవ వార్షికోత్సవ అవార్డుల ప్రదానాన్ని ఆదివారం సాయంత్రం నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. సినిమా, మోడల్ రంగాల్లోని 20 మంది ప్రతిభావంతులకు అవార్డులందజేశారు. ఈ కార్యక్రమం లో జి. వెంకట్రామన్ హాక్ ఐ విజార్డ్, అభినకకు ఏమెరిన్ మెంటర్ అవార్డును, ఎన్ఎస్కె రమ్య లెగసీ రీఫినర్ అవార్డును, శ్యామ్‌పాల్ అరిస్టార్ట్ ఎంతోసైస్ట్ అవార్డును, శోభ చంద్రశేఖర్ సభ్యువి అర్పిగో అవార్డును, ప్రదాయినికి జార్జియాస్ కోరల్లా అవార్డును, సాసో సతీష్ సారథికి రేడియంట్ డయర్ అవార్డును, శరణ్య పొన్వన్నన్కు స్పెక్టలీ సిటడల్ అవార్డును, జైప్రకాష్ ఓసలిక్ ఆరీ అవార్డును, కరన్‌కు ఆఫ్‌స్ప్రింగ్ డిలైట్ అవార్డును, షరీఫ్‌కు చివిల్స్ ్రకొరియో కార్వర్ అవార్డును, నిఖిల్‌కు కమడేరి క్యాటలిస్ట్ అవార్డును, దివ్య బిటిఫిక్కు ఎలిజెన్స్ అవార్డును, కార్తీక్ సుబ్బరాజ్‌కు క్లైవోయంట్ ఆర్టిజంఅవార్డును, కనల్ కన్నన్‌కు ఫైర్‌బాల్ టొనాడో అవార్డును, బాబిసింహకు ఫ్యాషన్ టింగ్ ఎంట్రోంట్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమల సెల్వరాజ్, నటి లక్ష్మిరామకృష్ణన్, పూర్ణిమ త్యాగరాజ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
షూట్ ‘అవుట్’
కాంట్ర వర్సీలతో కాపురం చేసే పాప్ సింగర్ మిలే సిరస్ మళ్లీ ‘హాట్’ టాపిక్ అయింది. ఈ 21 ఏళ్ల స్వీట్ సింగర్... ‘వి మ్యాగజైన్’ కవర్ పేజీకి నగ్నంగా పోజిచ్చింది. ‘ది రెబల్ ఇష్యూ’ పేరిట తమ 91వ ఎడిషన్ మార్కెట్లోకి వదులుతున్న సదరు మ్యాగజైన్ ఫొటో షూట్లో వినూత్నంగా కనువిందు చేయనుందీ భామ. జంతువుల మధ్యలో కూర్చొని స్నానం చేస్తున్న పోజులో సిరస్ షాకివ్వబోతోందని ఓ వెబ్సైట్ కథనం. ‘రొటీన్‌తో విసిగి వేసారిన మనసులకు ఇలాంటివి కాసింత సంతోషాన్నిస్తాయి’ అంటూ క్యాజువల్‌గా చెప్పేసింది సిరస్.