breaking news
US cricket
-
బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే
టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ సహా మరికొంత మంది స్టార్స్ మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. యూఎస్ మాస్టర్స్ టి10 లీగ్‌లో ఆడనున్నారు. ఈ లీగ్‌లో భారత్‌తో పాటు మరిన్ని దేశాల మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఆగస్టు 18వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. అట్లాంటా ఫైర్, కాలిఫోర్నియా నైట్స్, మారిస్విల్లే యూనిటీ, న్యూజెర్సీ లెజెండ్స్, న్యూయార్క్ వారియర్స్, టెక్సాస్ చార్జర్స్ ఉన్నాయి. కాగా నార్త్ కాలిఫోర్నియాలో తాజాగా ఈ టోర్నీ ప్లేయర్స్ డ్రాఫ్ట్ వెల్లడైంది. న్యూజెర్సీ లెజెండ్స్: న్యూజెర్సీ లెజెండ్స్ టీమ్‌లో భారత మాజీ స్టార్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, యుసూఫ్ పఠాన్ ఉన్నారు. వీరితో పాటు స్టువర్ట్ బిన్నీ, ఆర్పీ సింగ్, బిపుల్ శర్మ, లియామ్ ప్లంకెట్, అల్బీ మార్కెల్, నమన్ ఓజా, జెర్రీ రైడర్, క్రిస్ బ్రాన్వెల్, క్రెగ్ మెక్మిలాన్, టిమ్ ఆంబ్రోస్, అభిమన్యు మిథున్, మోంటీ పనేసర్ ఈ జట్టులో ఆడనున్నారు. కాలిఫోర్నియా నైట్స్: కాలిఫోర్నియా నైట్స్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్ ఆడనున్నారు. ఆరోన్ ఫించ్, పీటర్ సిడిల్, జాక్వెస్ కలీస్ సహా మరికొందరు ఈ జట్టులో ఉన్నారు. అంట్లాట ఫైర్: అంట్లాట ఫైర్ జట్టులో రాబిన్ ఊతప్ప ఉన్నాడు. ఆసీస్ మాజీ స్టార్ డేవిడ్ హస్సీ కూడా ఈ జట్టు తరఫున ఆడనున్నాడు. శ్రీశాంత్, లెండిల్ సిమండ్స్, డ్వేన్ స్మిత్ సహా మరికొందరు స్టార్ల్ ఉన్నారు. మోరిస్విల్లే యునిటీ: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో మోరిస్విల్లే యునిటీ టీమ్ తరఫున బరిలోకి దిగనున్నారు. పార్థివ్ పటేల్, కెవిన్ ఓబ్రెయిన్, కోరీ ఆండర్సన్, రాహుల్ శర్మ, కెల్విన్ సావేజ్.. మరికొంత మంది ప్లేయర్లు ఈ జట్టులో ఆడనున్నారు. న్యూయార్క్ వారియర్స్: న్యూయార్క్ వారియర్స్ టీమ్‌లో భారత మాజీలు మురళీ విజయ్, మునాఫ్ పటేల్ ఉన్నారు. పాకిస్థాన్ మాజీలు షాహిద్ ఆఫ్రిదీ, మిస్బా ఉల్ హక్, కమ్రాన్ అక్మల్ ఈ జట్టులోనే ఆడనున్నారు. జోహాన్ బోతా, టీఎం దిల్షాన్ సహా మరికొందరు ఉన్నారు. టెక్సాస్ చార్జర్: టెక్సాస్ చార్జర్ టీమ్‌లో ప్రజ్ఞాన్ ఓజా, ప్రవీణ్ కుమార్ ఉన్నారు. బెన్ డక్, హమ్మద్ హఫీజ్, రాస్ టేలర్, ఇసురు ఉదానా, తిషారా పెరీరా, నీల్ బ్రూమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, ఉపుల్ తరంగ, జీవన్ మెండిస్ సహా మరికొందరు ప్లేయర్లు ఈ జట్టు తరఫున యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో బరిలోకి దిగనున్నారు. చదవండి: Kohli-Ishan Kishan Viral Video: కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్ R Ashwin Record In Test Cricket: తండ్రీ కొడుకులిద్దరిని ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా -
అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌గా అరుణ్
బెంగళూరు: ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన కర్ణాటక మాజీ క్రికెటర్ జె.అరుణ్ కుమార్‌కు మంచి అవకాశం లభించింది. అమెరికా క్రికెట్ జట్టుకు అతను హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి అమెరికాకు వన్డే హోదా లభించింది. భవిష్యత్‌లో అమెరికాకు టెస్టు హోదా అందించడమే తన సుదీర్ఘ లక్ష్యమని 45 ఏళ్ల అరుణ్ కుమార్ వ్యాఖ్యానించాడు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి... తనకు వీసా మంజూరు కాగానే అమెరికాకు వెళ్తానని అరుణ్ అన్నాడు. అరుణ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే కర్ణాటక జట్టు 2013–14; 2014–15 సీజన్లలో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇరానీ కప్ టైటిల్స్ నెగ్గి అరుదైన ‘ట్రిపుల్’ ఘనత సాధించింది. -
యూఎస్‌లో రెండు టీ 20లు..
ముంబై: అమెరికాలో క్రికెట్ పై ఆదరణను మరింత పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిద్ధమైంది. యూఎస్‌లో రెండు అంతర్జాతీయ టీ 20లు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసినట్టు బీసీసీఐ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రావార్డ్ రీజినల్ పార్క్‌లో వెస్టిండీస్-భారత్ క్రికెట్ జట్ల మధ్య రెండు టీ 20లను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో క్రికెట్‌కు ప్రజాదరణ మెండుగా ఉండటంతో అక్కడ మ్యాచ్‌లు జరపడానికి నిశ్చయించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. యూఎస్ లో టీ 20 చాంపియన్ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు నిర్వహించే ప్రకటనను వెల్లడించడం చాలా సంతోషంగా ఉందని అనురాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'అమెరికాలో ఉన్న క్రికెట్ అభిమానులకు అక్కడే మ్యాచ్‌లను స్వయంగా వీక్షించే అవకాశం రావడం నిజంగా గొప్ప అవకాశం. యూఎస్‌లో మరిన్ని వార్షిక క్రికెట్ ఈవెంట్స్ జరగడానికి ఈ రెండు మ్యాచ్ ల సిరీస్ కచ్చితంగా దోహదం చేస్తుంది' అని అనురాగ్ తెలిపారు. మరోవైపు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే మాట్లాడుతూ.. ప్రపంచంలో అభిమానులకు ఈ గేమ్‌ను మరింత చేరువగా చేర్చడమే తమ ఉద్దేశమన్నారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తరువాత యూఎస్‌లో క్రికెట్ మ్యాచ్‌లను జరపడానికి సిద్దమైనట్లు షిర్కే పేర్కొన్నారు.