breaking news
upper hand
-
పుతిన్ పైచేయి!
ఉక్రెయిన్‌పై దురాక్రమణ దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికాసహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ వారెంట్లు, సైబర్ దాడులతో శత్రుదేశాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెదరక పుతిన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని నిరూపించారు. సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారు. దాదాపు 13 నిమిషాలపాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో అగ్రభాగం 8 నిమిషాలు పుతినే మాట్లాడాడు. దాంతో ట్రంప్ చివర్లో మమ అనిపించి ప్రసంగాన్ని ముగించారు. ట్రంప్‌తో భేటీ పర్వంలో అడుగడుగునా పుతిన్ తన పైచేయిని ప్రదర్శించడం విశేషం.ఎర్రతివాచీ స్వాగతంలో తొలి గెలుపు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చు కోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలను స్వీకరించిన ట్రంప్ నుంచే స్వయంగా రెడ్‌కార్పెట్ సాదర స్వాగతాన్ని పొంది పుతిన్ తన రష్యాకు అంతర్జాతీయంగా ప్రభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది అమాయక ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారన్న అపవాదు ఉన్న దేశాధ్యక్షునికి అలస్కా ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ స్వాగతంతో ట్రంప్ ముగిస్తే సరిపోయేది. కానీ అత్యంత ఆప్తుడైన మిత్రుడు తరలివస్తే ఎంతగా ప్రేమతో ఆహా్వనం పలుకుతామో అదేతరహాలో పుతిన్‌కు ట్రంప్ ఎర్రతివాచీ పరిచి మరీ సాదరంగా ఆహా్వనించారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా సమహోదా ఉన్న ట్రంప్ స్వయంగా వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకలేదు. కానీ యుద్ధనేరారోపణలు ఎదుర్కొ ంటున్నాసరే స్వయంగా ట్రంప్ వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలకడం ద్వారా అగ్రరాజ్యాధినేతకు తాను ఏమాత్రం తీసిపోనని పుతిన్ బహిరంగంగా నిరూపించారు. ఉక్రెయిన్ మొదలయ్యాక దౌత్యపరంగా, ఆర్థికంగా, ఆంక్షల పరంగా రష్యా ఏకాకిగా తయారైందని పశి్చమదేశాల మీడియా చెబుతున్నదంతా ఒట్టిమాటలేనని, అమెరికా దృష్టిలో పుతిన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రపంచనేత అని రుజువైంది. ట్రంప్‌తో సోదరభావంతో మెలగడం, కరచాలనం, ఒకే కారులో ప్రయాణించడం ద్వారా తానూ ట్రంప్ ఒకేస్థాయి అని పుతిన్ అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.కాల్పుల విరమణ.. గప్‌చుప్ ఉక్రెయిన్‌తో దాడులు ఆపి కాల్పుల విరమణను అమల్లోకి తేవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. అలాంటి కీలక ‘కాల్పుల విరమణ’పదాన్ని మాటవరసకైనా ట్రంప్ ప్రస్తావించకుండా పుతిన్ విజయవంతంగా కట్టడిచేశారు. మేమే ‘ఆ మార్గం’లో ఇంకా పయనించలేదు. అక్కడి దాకా వెళ్లేందుకు ఇంకొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది అని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారుగానీ ‘కాల్పుల విరమణ’అనే పదం పలకడానికి కూడా ఆయన సాహసించలేదు. తద్వారా పుతిన్ తన కనుసన్నల్లో, తాను అనుకున్నదే భేటీలో జరిగేలా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాక్షిక విజయం కూడా సాధించని ట్రంప్ ఈ భేటీలో మా ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాపై మరోదఫా ఆంక్షలు విధిస్తానని రెండ్రోజుల ముందు ట్రంప్ చేసిన భీష్మప్రతిజ్ఞ ఉత్తిదేనని తేలిపోయింది. ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ ముగిసినా సరే ట్రంప్‌లో ఎలాంటి నిరసన, ఆందోళన కనిపించలేదు. పైగా పుతిన్ చేసిన మాస్కో పర్యటన ప్రతిపాదనకు ట్రంప్ సంతోషం వ్యక్తంచేయడం విచిత్రం. పైగా తాము అనుకున్న ఫలితాలు రాకపోయినా ట్రంప్.. పుతిన్‌తో చర్చలు సానుకూలంగా సాగాయని విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం. దీంతో భేటీపై ట్రంప్‌కు ఎలాంటి పట్టు సాధించలేకపోయారని అర్థమవుతోంది. భేటీ జరుగుతున్నాసరే రష్యా దాడులుచేసేలా పుతిన్ ఆదేశాలిచ్చి తన మొండి వైఖరిని మరోసారి చూపించారు. శాంతి చర్చలను వాణిజ్య చర్చలుగా మార్చిన పుతిన్ యుద్ధం ఆపాలన్న డిమాండ్‌తో ముందుకొచి్చన అమెరికాను వాణిజ్యచర్చలకు బలవంతంగా పుతిన్ కూర్చోబెట్టినట్లు ఈ భేటీ తర్వాత ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘‘వాణిజ్యం, డిజిటల్, హై–టెక్, స్పేస్ వంటి రంగాల్లో అమెరికా–రష్యా పెట్టుబడులు, వాణిజ్య సహకారం మరింతగా బలపడనుంది. ఆర్కిటిక్లోనూ సహకారం బాగుంది’’అని సంబంధంలేని విషయాలనూ పుతిన్ చెప్పుకొస్తున్నా ఆయనను అడ్డుకోవాల్సిందిపోయి ట్రంప్ ఆయనకు వంతపాడటం విచిత్రం. పుతిన్‌తోపాటు ట్రంప్ ఆ తర్వాత గొంతు కలుపుతూ.. ‘‘రష్యా వ్యాపార భాగస్వాములు మాతో వాణిజ్యానికి ఉవి్వళ్లూరుతున్నారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా శాంతి చర్చలను పుతిన్ విజయవంతంగా వాణిజ్యచర్చలుగా మార్చేశారు. పదికి పది.. కానీ సున్నా సమావేశం ముగిశాక ఈ భేటీలో పూర్తి సత్ఫలితాలను సాధించామని, 10/10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యానాల్లో పిసరంతైనా నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ఆ పది మార్కులు పుతిన్ దోచేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలో పుతిన్‌ను ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌తో కరచాలనం, రెడ్‌కార్పెట్ స్వాగతం, ట్రంప్ కలిసి మీడియాకు ఫొటోలకు పోజులు, కలిసి కారులో ప్రయాణం, దారి పొడవునా కారులో నవ్వులు, భేటీ సందర్భంగా తమ వాదనను గట్టిగా వినిపించడం, సంయుక్త ప్రకటన వేళ తొలుత మాట్లాడం సహా ప్రతి సందర్భంలోనూ పుతిన్ పైచేయి సాధించారు. సాధారణంగా ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కల్గజేసుకుని, వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్.. ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం గమనార్హం. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ట్రంప్ ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్యవిజయంగా చెప్పొచ్చు. సొంత గడ్డపై జరిగిన భేటీలోనే నోరుమెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే రెండో రౌండ్ భేటీలో ఏపాటి మాట్లాడతారనే అనుమానాలు బలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
PM Narendra Modi: కృత్రిమ మేధలో లీడర్ ఇండియా
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాల్లో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర చెప్పారు. ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్వదేశీ పరిష్కార మార్గాలు కనిపెట్టాలని భారత యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్‌లో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం గతంలోనే ప్రారంభించిన ఏఐ, సెమీ కండక్టర్లు, నేషనల్ క్వాంటమ్ మిషన్ల ద్వారా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉపాధి, విదేశీ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. ఏఐ టెక్నాలజీ అనే నూతన శకంలో మనం ఉన్నామని, ఈ రంగంలో భారత్‌దే పైచేయి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని సూచించారు. యువతకు, ప్రపంచస్థాయి పెట్టుబడిదారులకు ఏఐ టెక్నాలజీ అవధుల్లేని అవకాశాలు అందిస్తోందని పేర్కొన్నారు. కృత్రిమ మేధలో ఇండియానే లీడర్ అవుతుందంటూ గత ఏడాది అమెరికా సెనేట్‌లో తాను తేలి్చచెప్పానని మోదీ గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఏఐ టెక్నాలజీని వాడుకుంటున్నానని, తెలుగు, తమిళంతోపాటు ఎన్నో భాషల్లో తన స్టేట్మెంట్లను ప్రజలతో పంచుకుంటున్నానని ఉద్ఘాటించారు. మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదే సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోందని ప్రధాని మోదీ వెల్లడించారు. రూ.వేల కోట్లతో కొత్తగా ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. పరిశోధన, నూతన ఆవిష్కరణలకు మధ్యంతర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. స్టార్టప్ కంపెనీలకు నిధుల సాయం అందించడానికి ఒక ఉత్తమ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. 2014లో మన దేశంలో కనీసం 100 స్టార్టప్‌లు కూడా లేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.25 లక్షలు దాటిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కంపెనీలతో 12 లక్షల మంది యువత అనుసంధానమై ఉన్నారని వివరించారు. స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో పేటెంట్లు సాధిస్తున్నాయని కొనియాడారు. మనకు 110కుపైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. విద్యాభ్యాసం అంటే ప్రభుత్వం ఉద్యోగం సంపాదించడం అనే ధోరణి గతంలో ఉండేదని, ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడినట్లేనని భావించేవారని గుర్తుచేశారు. అలాంటి ఆలోచనా ధోరణి ఇప్పుడు మారిందని, స్టార్టప్ విప్లవం మొదలైందని అన్నారు. నేటి మన యువత ఉద్యోగాలు కోరుకొనేవారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదుగుతున్నారని ప్రశంసించారు. దేశంలో 45 శాతానికిపైగా స్టార్టప్‌లకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో మూడోఅతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదేనని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌తోపాటు ప్రపంచ మెరుగైన భవిష్యత్తుకు నవీన ఆవిష్కరణల సంస్కృతి చాలా కీలకమని స్పష్టం చేశారు. రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీపై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయాల్లో కొందరిని పదేపదే కొత్తగా ప్రారంభించాల్సి వస్తోందని అన్నారు. ఒక రంగంలో స్టార్టప్ కంపెనీ విఫలమైతే మరో రంగంలో ప్రారంభించవచ్చని చెప్పారు. రాజకీయాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. చాలామంది స్టార్టప్‌లు ప్రారంభిస్తున్నారని, రాజకీయాల్లో స్టార్టప్‌ల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్‌లో పాల్గొన్న వారికి ప్రధాని మోదీ అభివాదం -
US midterm elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రిపబ్లికన్లు 218 సీట్లు, అధికార డెమొక్రాట్లు 211 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్షం మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. బైడెన్ నిర్ణయాలు, చర్యలను ప్రతిపక్షం నిలువరించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభలో రిపబ్లికన్ పార్టీ బలం పుంజుకోవడంతో అధ్యక్షుడి దూకుడుకి అడ్డుకట్ట పడనుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ప్రతినిధుల సభ స్పీకర్‌గా రిపబ్లికన్లు తమ నాయకుడు కెవిన్ మెక్కర్తీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ ఉన్నారు. కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని, రిపబ్లికన్లు వారిని ముందుకు నడిపించబోతున్నారని మెక్‌కర్తీ ట్వీట్ చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన మెక్కర్తీకి ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఉద్ఘాటించారు. రా బోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెనేట్‌పై డెమొక్రాట్ల పట్టు మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని చెప్పారు. ధరలు, జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. జనం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్‌లోని మరో సభ అయిన సెనేట్‌లో అధికార డెమొక్రాట్లు పట్టు నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 100 స్థానాలకు గాను, వారు ఇప్పటిదాకా 50 స్థానాలు దక్కించుకున్నారు. జార్జియా రాష్ట్రం కూడా వారి ఖాతాలో పడనుంది. దీంతో సెనేట్‌లో మెజారిటీ సాధించబోతున్నారు. -
తూర్పులద్దాఖ్‌లో పీఎల్ఏపై ఆర్మీ పైచేయి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత ఆర్మీ చైనా పీఎల్ఏపై పైచేయి సాధించింది. ఒక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే గడిచిన మూడు వారాల్లో కీలకమైన 20 పర్వత ప్రాంతాలను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. భారత్ ఇచ్చిన షాక్‌తో దిమ్మెర పోయిన చైనా ఆర్మీ అరుణాచల్‌ప్రదేశ్‌తో గల సరిహద్దుల్లో మోహరింపులు పెంచి, కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో భారత్, చైనా కమాండర్ స్థాయి ఆరో విడత చర్చలు సోమవారం జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో భారత బృందంలో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి కూడా పాలు పంచుకునే అవకాశముంది. ఈ చర్చలు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖకు చైనావైపున్న మోల్దోలో జరగనున్నాయి. లద్దాఖ్ గగనతలంపై రఫేల్ యుద్ధ విమానాలు పహారా కాస్తున్నాయి.‘ఆగస్టు 29 మొదలు సెప్టెంబర్ రెండో వారం వరకు భారత సైన్యం 20 ప్రధాన పర్వత ప్రాంతాలను ఆక్రమించింది. ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న వాటిలో మగార్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజంగ్ లా, మొఖ్‌పరితోపాటు ఫింగర్ 4కు సమీపంలోని పర్వతప్రాంతం ఉన్నాయి’ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ‘ఇంతకుముందు ఈ ప్రాంతాల్లో చైనా ఆర్మీ పీఎల్ఏ ఆధిపత్యం ఉండేది. తాజా పరిణామంతో మన బలగాలు ఈ ప్రాంతంలో శత్రువుపై పైచేయి సాధించినట్లయింది’అని ఆ వర్గాలు తెలిపాయి. భారత భూభాగం వైపున పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణం వైపు ఉన్న ఈ పర్వత భాగాలను ఆక్రమించుకునే క్రమంలో చైనా ఆర్మీ ప్రతిఘటించిందనీ, ఈ సందర్భంగా మూడు పర్యాయాలు గాల్లోకి కాల్పులు కూడా జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ కదలికలతో ఇప్పటికే ఉన్న బలగాలకు తోడు మరో 3,000 బలగాలను చైనా అదనంగా రెజంగ్ లా, రెచెన్ లా పర్వత ప్రాంతాలకు సమీపంలోకి రప్పించిందని తెలిపాయి. దీంతోపాటు మోల్డో సైనిక స్థావరంలోకి అదనపు బలగాలను తరలించిందని వివరించాయి. అరుణాచల్ సరిహద్దుల్లో చైనా కుట్ర తూర్పు లద్దాఖ్ అనంతరం చైనా దృష్టి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై పడింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలతో అప్పర్ సుబన్‌సిరిలోని అసపిలా, లాంగ్జు, బిసా, మఝా ప్రాంతాల్లోకి పీఎల్ఏ మోహరింపులు పెరిగాయి. దీంతోపాటు ఎల్ఏసీకి సమీపంలోని బిసాలో ఒక రోడ్డును కూడా నిర్మించింది. భారత సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆరు సమస్యాత్మక ప్రాంతాలు, 4 సున్నిత ప్రాంతాల్లో గస్తీని పెంచింది. ఎలాంటి దురాక్రమణనైనా తిప్పికొట్టేందుకు సర్వం సన్నద్ధమైంది. -
పైచేయి సాధనకే అరుణ డ్రామాలు
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి వనపర్తిటౌన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అధిపత్య, వర్గపోరులో తనది పైచేయిగా సాధించాలనే తాపత్రయంలో భాగంగానే అరుణమ్మ దీక్షల పేరిట డ్రామాలు చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో సకల జనులు పోరులో ఉంటే సొంత ఎజెండాతో దొంగలా తప్పించుకు తిరిగారని శనివారం పట్టణంలో నిరంజ¯Œæరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు వ్యతిరేకంగా వెకిలి మాటలు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటులో భాగంగా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు గద్వాలపై ఎందుకు మాట్లాడలేదని అన్నారు. గద్వాల జిల్లాకు కనీసం 12మండలాల మద్దతు లేదని, అరుణమ్మ పాదయాత్ర చేస్తే అలంపూర్‌కు చెందిన సురవరంను ఎమ్మెల్యేగా చేసిన వనపర్తిలో ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. మంచి వ్యక్తిఅయిన ఎమ్మెల్యే సంపత్‌ను వెంటబెట్టుకొని పాటలు, ఫ్లెక్సీలు పెట్టుకుంటుందని, వెట్టి చేసే కాడా అందరూ కావాలనే అరుణమ్మ కీర్తి మాత్రం తనొక్కతే వీరవనిత పాటలు వేసుకోవడం దారుణమని, ఎమ్మెల్యే సంపత్‌కు గౌరవం ఇవ్వారా అని ప్రశ్నించారు. అరుణమ్మను నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. గద్వాల, అలంపూర్ ప్రజలు వనపర్తి జిల్లా కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గౌని బుచ్చారెడ్డి, లక్ష్మారెడ్డి, గట్టుయాదవ్, బి. లక్ష్మయ్య, సర్దార్‌ఖాన్, భీమ్‌రెడ్డి, రాజేశ్వరమ్మ, వాకిటి శ్రీధర్, సతీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.