breaking news
Union Minister Gehlot
-
కేంద్ర మంత్రి గెహ్లాట్ తో బీసీ నేతల భేటీ
బీసీల సమస్యలు పరిష్కరించాలని వినతి సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం గురువారం ఇక్కడ కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌తో భేటీ అయింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్.కృష్ణయ్య, బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి 15 డిమాండ్లను ఆయన మంత్రి ముందుంచారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్‌ను తొలగించాలని కోరారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాయని, కర్ణాటకలో కూడా ఇదే విధంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బీసీ సంక్షేమ సంఘం కోరింది. ఈమేరకు గురువారం ఒక వినతి పత్రాన్ని సిద్దరామయ్యకు అందజేసింది. ప్రతినిధి బృందంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర నేతలు గుజ్జ కృష్ణ, రుషి అరుణ్, పి.శ్రీనివాసరావు, పి.హనుమంతరావు, పి.వి.మహేశ్, దుర్గయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. -
వికలాంగుల బిల్లు వచ్చే సమావేశాల్లో పెడతాం
వికలాంగుల హక్కుల వేదిక నాయకులతో కేంద్ర మంత్రి గెహ్లాట్ సాక్షి, న్యూఢిల్లీ: వికలాంగుల హక్కుల బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తారాచంద్ గెహ్లాట్ హామీ ఇచ్చినట్లు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక నాయకులు తెలిపారు. వేదిక జాతీయాధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్రావు నాయకత్వంలో ప్రతినిధి బృందం బుధవారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చింది. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు రాజకీయాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు, వికలాంగుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో పాటు వికలాంగుల గుర్తింపు కార్డులు, ఉద్యోగాల భర్తీ అంశాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో అంధుల సంఘం అధ్యక్షుడు పీవీ రావు, మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు.