breaking news
ummareddi Venkateshwara
-
బాబుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై ఈ ఐదు నెలల్లోనే ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ధర్నాలు విజయవంతమవడమే ఇందుకు నిదర్శనమని తెలి పారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల నిరసన వెల్లువెత్తిందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు చేసి ప్రభుత్వంపై నిరసనను తెలియజేశారని వివరించారు. రుణాల మాఫీ జరగకపోవడంవల్ల నష్టపోతున్న రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, మరమగ్గాల వారు, పింఛన్ల తొలగింపునకు గురైన నిరుపేదలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీల్లో, ధర్నాల్లో పాల్గొన్నారని వివరించారు. మొత్తం 663 మండలాల్లో ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నాలు జరి గాయని, ఆ తరువాత అధికారులకు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారని తెలిపారు. బుధవారంనాటి ధర్నాలు ఒక హెచ్చరిక మాత్రమేనని చెప్పారు. నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇది వంచన, ప్రజాద్రోహం కాదా! అనంతపురం జిల్లాలో 2012లో పాదయాత్ర చేసినప్పుడు రుణాలు, వడ్డీలు చెల్లించవద్దని రైతులు, మహిళలకు బాబు చెప్పారని.. అధికారంలోకి వచ్చాక కాలం వెళ్లబుచ్చుతున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పేద అరుపులు అరవడం వంచన, ద్రోహం కాదా అని ప్రశ్నించారు. -
బాబు నైజాన్ని ఎండగడదాం
వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వక్తలు ఆయన సీఎంగా ఉంటే సీమకు ఎప్పుడూ అన్యాయమే : పెద్దిరెడ్డి ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్నాడు : భూమన ఇబ్బంది సృష్టించే వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టండి : చెవిరెడ్డి చంద్రబాబు మోసపూరిత వైఖరిని ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం బుధవారం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరుపతి తుడా: చంద్రబాబు నిజస్వరూపం, నైజం, మోసపూరిత వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. చిన్నతనం నుంచే వెన్నుపోటు నైజాన్ని ఒంటబట్టించుకున్న బాబును ప్రజలు మరోసారి అసహ్యించుకుంటున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం బుధవారం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిందని తెలిసి, నిధులు లేవని చెబుతూనే చంద్రబాబు ఎన్నికల్లో సాధ్యం కాని హామీలను ఇవ్వడం అతని నమ్మక ద్రోహ వైఖరికి నిదర్శనమన్నారు. రైతులు, మహిళలను మోసం చేయకూడదనే జగన్ రుణమాఫీపై నిజమైన హామీలు ఇచ్చారన్నారు. జగన్ ఒక్క అబద్ధం చెప్పున్నా అధికారం వైఎస్ఆర్సీపీదే అన్నారు. బాబు దుర్బుద్ధితో హామీలు గుప్పించి అధికారం చేపట్టారన్నారు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా బాబు వెనుకపడ్డ రాయలసీమకు అన్యాయం చేశారన్నారు. ఇప్పుడూ అదే పంథాలో వ్యవహరించడం అన్యాయమన్నారు. పార్టీ రాష్ట్ర ఎస్సీ, రైతు విభాగాల అధ్యక్షులు వేమూరు నాగార్జున, నాగిరెడ్డి, సామాన్యకిరణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైఎస్ఆర్సీపీ వైపున్నారని కక్షకట్టిన చంద్రబాబు వారికి చేరాల్సిన నిధులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కులాలు ఐక్యంగా ఉంటే టీడీపీకి ఇబ్బందని భావించి కులాలను చీల్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కడుపు, నమ్మకంపై కొట్టారని, బాబుకు ఈ పాపం ఊరికేపోదని హెచ్చరించారు. నియోజకవర్గ కన్వీనర్లు జంగాలపల్లి శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్, ఆదిమూలం మాట్లాడుతూ టీడీపీ నేతలు కబ్జాకోరులుగా అవతరిస్తున్నారన్నారు. హామీల అమలుకు పోరా టం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే.రోజా, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి గాంధీ, వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకులు దామినేటి కేశవులు, గాయత్రీదేవి, యుగంధర్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, హరి, రాజు, ఖాద్రీ, గుణశేఖర్‌నాయుడు, ఆదికేశవులరెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మండల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారికి ఏ కష్టమొచ్చినా నాయకత్వం ముందుం టుందని అతిథులు చెప్పడంతో కార్యకర్తల్లో మనోధైర్యం రెట్టింపైంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్యకర్తల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు చెప్పారు. రైతులను మోసం చేస్తే పుట్టగతులుండవు రైతులను మోసగించిన చంద్రబాబుకు పుట్టగతులుండవు. అధికార వాంఛతో చంద్రబాబు రైతులకు, ఆడపడుచులకు రుణమాఫీ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆశచూపి మోసగించి, నీతి మాలిన రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు. నేను మారిపోయానని సభల్లో చెప్పుకున్న బాబు కుక్కతోక వంకరలా అధికారం వచ్చేసరికి తన బుద్ధి, నైజం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబులా జగనన్న ఒక్క అబద్ధం చెప్పుంటే అధికారం మనదే. మంచి మనసున్న వ్యక్తి సీఎంగా ఉంటే రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుందో అందుకు వైఎస్ఆర్ పాలనే నిదర్శనం. -రోజా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే బాబు మెడలు వంచాలి ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం బాబు మెడలు వంచేం దుకు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి. ప్రజా పోరాటాలతో తప్ప ఇది సాధ్యం కాదు. ఇందుకు ప్రజలను కలుపుకుని నాయకులు ఉద్యమాలకు సిద్ధం కావాలి. -కే.నారాయణస్వామి, పార్టీ జిల్లా అధ్యక్షుడు న్యాయస్థానం ముందు నిలబెడతాం కార్యకర్తల జోలికి వస్తే ఎంతటి వారైనా చూస్తూ ఊరుకునేది లేదు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికార నేతలైనా, అధికారులైనా, పోలీసులైనా సరే.. అలాంటి వారిని న్యాయస్థానం ముందు నిలబెడతాం. నిత్యం కార్యకర్తలకు అండగా ఉంటాం. - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే, చంద్రగిరి దళితులను దగా చేస్తున్న టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీడీపీ ప్రభుత్వం దళితుల హక్కులను సైతం కాలరాస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీలకు రావాల్సిన వాటాలో తీవ్ర అన్యాయం జరిగింది. దళితుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం సబ్‌ప్లాన్ కోసం నిధులు వెచ్చించింది. ఈ నిధులు 40 శాతం దళితులున్న ప్రాంతాల్లో ఖర్చు చేయాలన్న నిర్ణయంతో అలాగే నిలిచిపోయాయి. వీటిని టీడీపీ కార్యకర్తల పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనంతపురంలో దళితుల్ని ఐదుగురిని నరికి చంపిన ఘనత టీడీపీదే. ఎవరైనా ఎదిరిస్తే వారిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. గుంటూరులో టీడీపీ నేతలు సరస్వతి భూములను ఆక్రమిస్తుంటే అడ్డుపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. - నాగార్జున, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బాబు అంటేనే మోసం బాబు అంటేనే మోసం. మోసం చేయడంలో ఆయనకు పీహెచ్డీ ఇవ్వాలి. నేను మారుతాను మారుతాను.. అని చెప్పడంతో ప్రజలు ఇకనైనా మారుతాడేమోనని ఓట్లేస్తే, నా బుద్ధింతే నేను మారను అని తన నైజాన్ని ప్రదర్శించారు. -అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే, పలమనేరు ధర్నాను విజయవంతం చేద్దాం బాబు నిజ స్వరూపాన్ని బయటపెడదాం. రుణ మాఫీ, ప్రజల సమస్యలపై జగనన్న పిలుపునిచ్చిన మేరకు నవంబర్ 5న చేపట్టే ధర్నాను విజయవంతం చేద్దాం. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలి. -జంగా కృష్ణమూర్తి, పార్టీ జిల్లా పరిశీలకులు ప్రయివేటీకరణను వ్యతిరేకిద్దాం బాబు 420, మోసగాడని ఆయన కుటుంబ సభ్యులను అడిగితే చెబుతారు. గతం లో ప్రభుత్వ సంస్థలను మూయించిన బాబు ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు, ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసేందుకు కుట్ర పన్నారు. ప్రయివేటీకరణను వ్యతిరేకించేందుకు సిద్ధం కావాలి. - గౌతంరెడ్డి, గోపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు కేసులకు, బెదిరింపులకు భయపడం ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి బాబు భజన బృందాలు, ప్రచార మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. లక్ష కోట్లకు పైగా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు ఇస్తానని చెప్పిన బాబు, అత్తింటిని మోసం చేసినట్టే అన్నివర్గాల ప్రజలను మోసం చేశారు. రైతులను మోసం చేసిన వ్యక్తులెవ్వరూ బాగుపడింది లేదని బాబు గుర్తుంచుకోవాలి. అనతి కాలంలోనే టీడీపీలా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న పార్టీ మరొకటి లేదు. అధికారంలో ఉన్నామని అడ్డదిడ్డమైన కేసు లు, బెదిరింపులకు దిగితే సహించేది లేదు. -భూమన కరుణాకరరెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీమ కరువు బాబుకు కనిపించలేదా? గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవాలి. కార్యకర్తలకు అండగా ఉండి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయా లి. సీమ కరువుతో అల్లాడుతుంటే బాబుకు కనిపించక పోవడం దుర్మార్గమైన విషయం. -రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం మోసగాడు కాబట్టే.. రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, చంద్రబాబు వెన్నుపోటుదారుడు, మోసగాడు కాబట్టే రాష్ట్రం అప్పుడు అనావృష్టి ఇప్పుడు అతివృష్టితో అల్లాడుతోంది. ఏరుదాటాక తెప్ప తగలెయ్యడం బా బు నైజమని ప్రజలు మరోసారి రుచి చూశారు. అన్నీ గమనిస్తున్నారు. టీడీపీకి తగి న సమయంలో బుద్ధి చెప్పేం దుకు సిద్ధంగా ఉన్నారు. -డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి (మదనపల్లె ఎమ్మెల్యే), డాక్టర్ సునీల్‌కుమార్ (పూతలపట్టు ఎమ్మెల్యే)