breaking news
ugadi puraskaram
-
సింహపురితో దశాబ్దాల అనుబంధం
నెల్లూరు(బృందావనం): నెల్లూరుతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, నెల్లూరీయుల అభిమానం మరువలేనని బహుభాషా నటుడు సుమన్ అన్నారు. విళంబి నామ ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకుని సింహపురి సంస్కృతి సమాఖ్య అధ్యక్షుడు సమ్మోహనసామ్రాట్ రాంజీ ఆధ్వర్యంలో పురమందిరంలో ఆదివారం సుమన్‌ను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమినాడు నెల్లూరులో ఉగాది పురస్కారాన్ని అందుకోవడం తన జీవితంలో ఎన్నడూ మరువలేనన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీఈ విషయానికి సంబంధించి ఎవరు ఎటువంటి హామీ ఇచ్చినా వారిని ప్రశ్నించా ల్సిందేనన్నారు. ప్రధానంగా ఈ విషయంలో చలన చిత్రహీరోలు పెదవి విప్పాలంటూ అభిమానులు నిలదీయాలని సుమన్ సూచిం చారు. తానుఎనిమిది భాషలతోపాటు ఆంగ్ల చిత్రం లో నటించానన్నారు. మరో పదేళ్ల పాటు సినీపరిశ్రమలో కొనసాగి 50 ఏళ్లు పూర్తి చేయాలన్న కాంక్ష ఉందన్నారు. తాను వెంకటేశ్వరస్వామి, అన్నమయ్య, సత్యనారాయణస్వామి పాత్రల్లో నటిండం తనకు దక్కిన భాగ్యమన్నారు. నెల్లూరులో తొలి ఔట్‌డోర్ షూటింగ్లో పాల్గొన్నానని సుమన్ గుర్తు చేశారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ ఆచార్య వీరయ్య మాట్లాడుతూ కళలకు సింహపురి కాణాచిగా కీర్తించారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీటవేస్తూ రాంజీ వివిధ రంగాలకు చెందిన వారికి ఉగాది పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ ఢిల్లీరావు, నుడా డైరెక్టర్ షేక్ ఖాజావలి, నగర డీఎస్పీ మురళీకృష్ణ, సెట్నెల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, జొన్నవాడ ఆలయ చైర్మన్ పి.సుబ్రహ్మణ్యంనాయుడు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. పలువురికి ఉగాది పురస్కారాలు ప్రదానం ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖు లు సురభిగాయత్రి, కల్పన, కందుకూరు చెంగయ్య ఆచారి, నలుబోలు బలరామయ్యనాయుడు, మాల్యాద్రి, సత్యనారాయణ తదితరులతోపాటు బ్రహ్మకుమారీ నెల్లూరు నిర్వాహకులు ప్రసన్న తదితరులను సుమన్ శాలువలు, పుష్పగుచ్చాలు, పూలమాలలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. రంగనాథుడి సేవలో నటుడు సుమన్ సుమన్ ఆదివారం రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, సభ్యులు సాదరంగా స్వాగతించారు. ఆయన వెంట నగర డీఎస్పీ మురళీకృష్ణ, అభిమానులు ఉన్నారు. -
'ప్రభుత్వ విధానాలతో విసిగిపోయా'
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయి.. అవార్డులను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రముఖ రచయిత, నటుడు ఎం. భూపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్ర సర్కారు అందజేసిన ఉగాది పురస్కారం -2015 వెనక్కి ఇచ్చేశారు. రవీంద్రభారతి ప్రాంగణంలోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ అమృత చేతికి ఉగాది పురస్కారాన్ని, రూ. 10 వేల నగదును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని, విద్యార్థులు ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిన్నరకే బూటకపు ఎన్కౌంటర్లకు ప్రభుత్వం తెరలేపిందన్నారు. శ్రుతిని హింసించి చంపడం బాధాకరమన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉగాది నాడు తనకిచ్చిన ఉగాది పురస్కారాన్ని వెనక్కు ఇచ్చేశానని చెప్పారు. బుద్ధి తక్కువై నాడు అవార్డు తీసుకున్నానని వాపోయారు. త్వరలోనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా తిరిగి ఇచ్చేయనున్నట్లు చెప్పారు. బతుకమ్మ, ఆధ్యాత్మిక కార్యక్రమాలే అభివృద్ధి కాదని.. రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులను కూడా పాలకులు పట్టించుకోవాలని అన్నారు.