breaking news
uddamarri
-
విలేజి టెక్నాలజీ
రాజీగళ్ల భూపాల్..మూడుచింతలపల్లి మండలంలోని పోతారం, కొల్తూర్ గ్రామాల్లో గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా జరుగుతోంది. ఇక్కడికి సమీపంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న ఫార్మా కంపెనీలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసేందుకు మెగా గ్యాస్ కంపెనీ పోతారంలో సబ్‌స్టేషన్ (కంప్రెసర్) ఏర్పాటు చేసింది. తమ గ్రామంలో సబ్‌స్టేషన్ పెట్టిన నేపథ్యంలో.. ఇక్కడి ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరడంతో ఆ ఏర్పాట్లు చేసింది. వినియోగదారులు రూ.6 వేలు చెల్లిస్తే.. వారి ఇంటికి వంటగ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్ ఇస్తారు. దానికి ఒక మీటర్‌ను అమర్చుతారు. ప్రతి నెలా కంపెనీ సిబ్బంది వచ్చి మీటర్ వద్ద స్కాన్ చేసి.. వినియోగించిన గ్యాస్‌కు సంబంధించిన బిల్లు ఇస్తారు. అచ్చు కరెంటు బిల్లు తరహాలో నెలనెలా బిల్లు కట్టేస్తే సరిపోతుంది.సిలిండర్ల కోసం ఇబ్బంది తప్పింది పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేయడం గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంది. గతంలో సిలిండర్ అయిపోతే రెండు, మూడు రోజుల వరకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది. దానికితోడు గ్యాస్ సిలిండర్లు ఇచి్చనప్పుడు డెలివరీ చార్జ్‌లు, సరీ్వస్ చార్జ్‌లు అంటూ అదనంగా డబ్బులు తీసుకునేవారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నిరంతరాయంగా వంట గ్యాస్ సరఫరా అవుతోంది. వాడుకున్న మేర బిల్లు చెల్లిస్తే సరిపోతోంది. – హరిమోహన్‌రెడ్డి, పోతారం మాజీ సర్పంచ్ ఉద్దమర్రి గ్రామంలో స్మార్ట్ కార్డులుమూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రిలోని వాటర్ ఫిల్టర్ కేంద్రం (సామాజిక నీటి శుద్ధి కేంద్రం)లో సిబ్బంది లేకుండానే ప్రజలు నీటిని కొని తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. తాజా మాజీ సర్పంచ్ యాంజాల అనురాధ పట్టభద్రురాలు కావడం, డిజిటల్ విధానంపై అవగాహన ఉండటంతో.. స్మార్ట్‌కార్డు విధానం ఏర్పాటుకు నిర్ణయించారు. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ వాటర్ ఫిల్టర్ నిర్వాహకులకు ముందుగా రూ.50 చెల్లిస్తే ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్‌తోపాటు యాక్టివేట్ చేసిన స్మార్ట్ కార్డును వినియోగదారులకు ఇస్తారు. తర్వాత వినియోగదారులు నగదు ఇచ్చి స్మార్ట్ కార్డును రీచార్జ్ చేసుకోవచ్చు. వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న మిషన్ సెన్సర్ వద్ద స్మార్ట్ కార్డును స్కాన్ చేస్తే కార్డులో నుంచి రూ.5 కట్ అయి.. వారు నాజిల్ దగ్గర పెట్టిన వాటర్ క్యాన్ నిండుతుంది. ఇలా స్మార్ట్‌కార్డు వినియోగించిన ప్రతిసారీ రూ.5 చొప్పున కట్ అయి.. వాటర్ బాటిల్ నిండుతుంది. ఫిల్టర్ వాటర్ కేంద్రం 24 గంటలూ ఆన్‌లో ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా వెళ్లి నీళ్లు తెచ్చుకోవచ్చు.కావాల్సినప్పుడల్లా తెచ్చుకుంటున్నాం.. స్మార్ట్ కార్డ్‌తో మంచి ప్రయోజనం ఉంది. రోజూ నీళ్లు తెచ్చుకోవాలంటే చేతిలో డబ్బులు, చిల్లర ఉండకపోవచ్చు. నెల మొదటి వారంలో డబ్బు ఉన్నపుడు రీచార్జి చేయించుకుంటే చాలు. ఈ కేంద్రం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. అవసరమైనప్పుడల్లా నీటిని తెచ్చుకుంటున్నాం. –జూపల్లి పద్మ, ఉద్దమర్రి -
విద్యుదాఘాతంతో ఎనిమిది గేదెల మృతి
⇒ ఒక ఆవూ.. రెండు నక్కల మృత్యువాత ⇒ కరెంట్ తీగ తెగిపడడంతో ప్రమాదం ⇒ శామీర్‌పేట్ మండలం ఉద్దమర్రి శివారులో ఘటన శామీర్‌పేట్: విద్యుత్ తీగ తెగిపడటంతో కరెంట్‌షాక్‌కు గురై ఎనిమిది గేదెలు, ఒక ఆవుతో పాటు రెండు నక్కలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన శామీర్‌పేట్ మండలం ఉద్దమర్రి గ్రామ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దమర్రి గ్రామానికి చెందిన ఒట్టెల ఆంజనేయులు వ్యవసాయంతో పాటు పాడి గేదెలు పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆయన సోమవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న బావి వద్ద కట్టేసిన జీవాలను నీరుతాగేందుకు తీసుకెళ్తున్నాడు. బావి సమీపంలో(నల్లగొండ జిల్లా బండకాడిపల్లె రెవెన్యూ పరిధి)లో ఓ విద్యుత్ స్తంభం నుంచి ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగ తెగిపడింది. దీంతో ఆంజనేయులుకు చెందిన గేదెలు కిందపడిన విద్యుత్ తీగపైనుంచి నడుచుకుంటూ వెళ్లాయి. అప్పటికే తీగకు కరెంట్ సరఫరా ఉండడంతో గేదెలు విద్యుదాఘాతానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో 8 గేదెలతోపాటు ఒక ఆవు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. దీంతోపాటు అప్పటికే రెండు నక్కలు కూడా విద్యుదాఘాతానికి గురై చనిపోయాయి. ఆంజనేయులు విషయం గమనించి తన కుటుంబీకులతో పాటు విద్యుత్ అధికారులకు సమాచారం అందించి కరెంట్సరఫరాను నిలిపివేయించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మూగజీవాలు మృత్యువాత పడ్డాయని, తాను రూ. 10 లక్షలు నష్టపోయానని లబోదిబోమన్నాడు. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి తనకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరాడు.