breaking news
udayan das
-
‘ఆకాంక్షను నేనే చంపాను’
కోల్ కతా: ఆకాంక్ష శర్మను తానే చంపానని మూడు హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఉదయన్ దాస్ ఒప్పుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లోని బాంకురా జిల్లా కోర్టు ముందు నేరాన్ని అంగీకరించాడు. తనతో పాటు సహజీవనం చేసిన ఆకాంక్షను భోపాల్ లో హత్య చేసినట్టు కోర్టుకు తెలిపాడు. నేరాన్ని అంగీకరించిన ఉదయన్ బెయిల్ అభ్యర్థన పెట్టుకునేందుకు నిరాకరించాడు. కోర్టులో విచారణ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయన్ అమాయకుడని, అతడికి ఏమీ సంబంధం లేదని అతడి తరపు న్యాయవాది ఆరుప్ కుమార్ నంది నిరూపించే ప్రయత్నం చేశారు. ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుందని వాదించారు. మధ్యలో జోక్యం చేసుకున్న ఉదయన్ నేరం అంగీకరించాడు. తన యావదాస్తిని ఆకాంక్ష పేరుతో ఏర్పాటు చేసే ట్రస్టుకు రాసిస్తానని చెప్పాడు. భోపాల్ లోని ఇల్లు, తన తల్లి ఆభరణాలు, తండ్రి ఫిక్సిడ్ డిపాజిట్లు కూడా ట్రస్టుకు ఇచ్చేస్తానని పేర్కొన్నాడు. ఈ ట్రస్టుకు బాంకురా పోలీసులను ట్రస్టీలుగా పెట్టాలని అభ్యర్థించాడు. మరణశిక్షను తప్పించుకునేందుకే ఉదయన్ ఈ నాటకం ఆడుతున్నాడని ఆకాంక్ష కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆకాంక్షతో పాటు సొంత తల్లిదండ్రులు కూడా ఉదయన్ హతమార్చాడు. -
హాలీవుడ్ క్రైం సినిమా చూసి..
తన తల్లిదండ్రులతో పాటు సహజీవనం చేస్తున్న భాగస్వామి ఆకాంక్షా శర్మను కూడా చంపేసి, కాంక్రీటు సమాధి చేసిన ఉదయన్ దాస్.. అదంతా ఎందుకు, ఎలా చేశాడో ఇన్నాళ్లకు బయటపడింది. చిన్నతనంలో అతడిని తోటి పిల్లలు తరచు ఏడిపిస్తుండేవారట. దానివల్లే అతడు సైకోగా మారి ఉంటాడని పోలీసులు అంటున్నారు. 'డెవిల్స్ నాట్' అనే అమెరికన్ క్రైం సినిమా చూసిన తర్వాత.. దాంతో స్ఫూర్తి పొంది, అందులో చూపించినట్లుగానే హత్యలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఉదయన్‌ను బంకురా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య బంకురా పట్పటణానికి తీసుకొచ్చారు. చిన్నతనంలో కూడా ఇతడికి మంచి చెప్పుకోదగ్గ స్నేహితులంటూ ఎవరూ లేరు. నల్లగా ఉంటాడని అతడిని అందరూ ఏడిపించేవాళ్లు. దాంతో వాళ్లమీద పగ తీర్చుకోవాలని అనుకుంటూ.. చివరకు ఒక ఫ్రెండుకు సంబంధించిన ఆర్కూట్ అకౌంటును హ్యాక్ చేశాడు. అతడికి ఉన్నవాళ్లంతా వర్చువల్ స్నేహితులేనని, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కలిసినవాళ్లనే స్నేహితులుగా భావించేవాడు. అతడికి వేర్వేరు పేర్లతో మొత్తం 110 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. ఉదయన్ వద్ద మొత్తం 2500 హాలీవుడ్ సినిమాల కలెక్షన్ ఉంది. వాటిలో ఒకటైన డెవిల్స్ నాట్లో చూపించినట్లే ఆకాంక్షను చంపి, కాంక్రీటుసమాధి కట్టేశాడు. తాను ఐఐటీలో చదివినట్లు అతడు చెప్పాడు గానీ, నిజానికి చదువుల్లో బాగా వెనకబడి, కాలేజిలో కూడా పరీక్షలు ఫెయిలవ్వడంతో అతడిని బయటకు పంపేశారు. ఆకాంక్ష రాసినట్లుగా ఉన్న నాలుగు ఉత్తరాలను ఉదయన్ తన ఇంటి గోడలలో దాచిపెట్టగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత కథనాలు చదవండి.. ‘ఆన్లైన్’ ప్రేయసిని అతి దారుణంగా.. ప్రేయసిని చంపినట్టే, తల్లిదండ్రులను కూడా..