breaking news
typist
-
ఆయనది అవినీతి దారి
► టైపిస్టుగా చేరి సూపరింటెండెంట్‌గా ఎదిగి ►ఇదీ వెల్లాల ఆలయాల ఈఓ భాగోతం ప్రొద్దుటూరు టౌన్ : దేవుని సొమ్ము ఒక్క రూపాయి తిన్నా అరగాయించుకోలేరని పెద్దలు చెబుతుంటారు. ఈ కోవలోకే వచ్చా డు వెల్లాల సంజీవరాస్వామి దేవాలయాల ఈఓగా పని చేసి సస్పెండైన మేకల రామాం జనేయులు. టైపిస్టుగా చేరి సూపరింటెండెం ట్ స్థాయికి ఎదిగిన ఆయన డిప్యుటేషన్ పే రుతో జిల్లాలోని పలు ఆలయాలకు ఈఓగా పని చేశారు. ఎక్కడ పని చేసినా అధికార పార్టీనేతలతో చేతులు కలపడం, ఆలయ భూములను అక్రమ పద్ధతుల్లో లీజులకు ఇవ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మిట్టా పాపయ్య సత్రం... ప్రొద్దుటూరు పట్టణం శివాలయం వీధిలో దాదాపు దాదాపు 50 సెంట్ల మిట్టాపాపయ్య సత్రానికి చెందిన స్థలాన్ని వాణిజ్య అవసరాల కోసం కొన్నేళ్ల కిందట అప్పటి ఈఓగా ఉన్న మేకల రామాంజనేయులు లీజుకు ఇ చ్చారు. ఈ స్థలంలో నందిని క్లాత్ మార్కెట్ పేరుతో నిర్మాణం పనులు మొదలెట్టారు. మూడు అంతస్తులు నిర్మాణం పూర్తయింది. దీనిపై మిట్టా పాపయ్య వంశీకులు కోర్టును ఆశ్రయించారు. దేవాలయ భూములను ఏవి ధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారని కో ర్టు ప్రశ్నించి అనుమతులను రద్దు చేసింది. వ స్త్ర దుకాణదారుల నుంచి లీజు హక్కులు పొంది న వారు భారీ మొత్తంలో అడ్వాన్స్ లు వసూలు చేశారు. అనుమతులు రద్దు కావడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో వ్యా పారులు తీవ్రంగా నష్టపోయారు. జీఓ ఎం ఎస్ నంబర్ 866 ఏపీ ఎండోమెంట్ యాక్టుకు విరుద్ధంగా నారాయణ రంగయ్య సత్రానికి చెందిన వ్యవసాయ భూమిని లీజుకు ఇవ్వడంపై కూడా కోర్టు మొట్టికాయ వేసింది. రాయచోటిలో... రాయచోటి వీరభద్రస్వామి ఆలయ ఈఓగా పని చేసిన సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. కర్ణాటక భక్తులు ఇచ్చిన డబ్బును ఆలయ అకౌంట్లో జమ చేయకుండా స్వాహా చేశాడని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుంచి తిరిగి ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ప్రొద్దుటూరులోని అగస్తే్యశ్వరస్వామి, చాపాడు మండలంలో ఉన్న అల్లాడుపల్లె ఆలయాలు, నారాయణ చౌల్ట్రీ, మిట్టాపాపాయ్య సత్రం స్థలాలకు సంబంధించి ఈఓగా పని చేసిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వెల్లాలలో... వెల్లాల సంజీవయరాయస్వామి దేవాలయా ల ఈఓగా పని చేస్తున్న సమయంలో శని వారాలు మాత్రమే గుడికి వచ్చేవాడు. భక్తులు అన్నదానానికి ఇచ్చే డబ్బును అకౌంట్లో రా సేవాడు కాదని, ఇక్కడ పని చేస్తున్న కొందరు అర్చకులతో సత్సంబంధాలు పెట్టుకొని అవినీతికి పాల్పడేవారన్నా ఆరోపణలు లేక పోలేదు. హైదరాబాదులో నివాసం ఉండటంతో ఎక్కువ సమయం అక్కడే గడిపేవాడని అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అలాగే గుడికి సంబంధించిన సర్వే నెంబర్ 177లో 5.13 ఎకరాల స్థలంలో దేవాదాయ కమిషనర్ అనుమతులు లేకున్నా అక్కడ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో తన వాటాగా కొంత శాతం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా అవినీతి ఈఓపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అతని బాగోతం బయటపడుతుందని ఆశాఖలోని అధికారులే అంటున్నారు. -
'టైపిస్టు పెద్దాయనకు పోలీసుల పహారా'
లక్నో: రోజువారి పనులకోసం ఆ పెద్దాయన సిద్ధమవుతున్నాడు. చేతిలోకి తన టైప్ రైటర్ తీసుకుని బయలుదేరడానికి ముందు తుడుస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక్కసారిగా పోలీసులు వచ్చారు. వారు ఎందుకొచ్చారో అర్ధంకాని ఆ పెద్దమనిషికి గుండెలో గుబులు. ఇంతలో పోలీసుల నుంచి ఒక మాట' పదండి పెద్దాయన మీకు తోడుగా వస్తాం.. మిమ్మల్ని దిగబెట్టి అక్కడే ఉంటాం' అని.. ఈ మాటలు విని అతడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తాను ఇచ్చిన ఫిర్యాదు గుర్తుచేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దాదాపు 35 ఏళ్లుగా లక్నో జనరల్ పోస్టాపీసు ముందు కూర్చుని తన పాత టైప్ రైటర్ సాయంతో బతుకీడుస్తున్న కిషన్ కుమార్ (65) అనే పెద్దాయనపై ఓ ఎస్సై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయన టైప్ రైటర్‌ను కూడా ఆ ఎస్సై ధ్వంసం చేశాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసి చివరికి ఆ ఎస్సై ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. అయితే, కిషన్ కుమార్‌కు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని పోలీసులను ఎస్కార్ట్‌గా పంపిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సోమవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కిషన్ కుమార్‌కు ఫోన్ కాల్ వచ్చింది. 'నువ్వు చేసింది మంచి పని కాదు.. నీ పనిచెప్తా' అంటూ ఫోన్ చేసిన వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఫోన్ కాల్ తిరిగి చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ వచ్చింది ఇంటర్నెట్ ద్వారా. దీంతో పోలీసుల కిషన్ కుమార్‌కు భద్రత కల్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
'టైపిస్టు పెద్దాయనకు పోలీసుల పహారా'