breaking news
TS minister KTR
-
తెలంగాణ దెబ్బకు చంద్రబాబు మకాం మార్చిండు
- టీడీపీలో ఉన్న నేతలంతా ఉనికి కోసమే విమర్శలు - మంత్రి కె. తారకరామారావు ఎద్దేవా సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు, చిన్నబాబు తట్టా బుట్టా సర్దుకుని అమరావతికి మకాం మార్చిండని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి నగర పంచాయతీ అభివృద్ధికి రూ.50కోట్లు ప్రకటించారు. అనంతరం పెద్దపల్లి, మంథని, రామగుండంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో మిగిలిపోయిన చోటామోటా టీడీపీ నేతలంతా ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్న కేటీఆర్..భవిష్యత్ టీఆర్ఎస్దేనని, టీడీపీలో మిగిలిపోయినవారు ఆ పార్టీని విడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ ఆనాడే చెప్పాని, ఆ పార్టీ నాయకులు చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు జలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే కాంగ్రెస్ నాయకులు చచ్చిపోయిన వారి సంతకాలతో కోరున్టు ఆశ్రయించారని ఆరోపించారు. రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు 65ఏళ్లలో వదిలిన దరిద్రాన్ని, గబ్బును కడిగేందుకే మూడేళ్లు సరిపోయిందన్నారు. 'తెలంగాణ అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఒక్కరోజులో అభివృద్ధి చేసేందుకు ఏమైనా అద్భుతదీపాన్ని ఇచ్చాయా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగకుండా పనిచేసుంటే తెలంగాణకు ఈ రోజు ఈ గతి పట్టి ఉండేది కాదని జానారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీగా అవతరించిదని చెప్పారు. కాంగ్రెస్ అంటే గతం, టీఆర్ఎస్ అంటే భవిష్యత్ అన్నారు. కేటీఆర్ పర్యటనలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, రామగుండం మున్సిపల్ చైర్మన్ కొంకటి లక్ష్మీనారాయణ, నగర పంచాయతీ చైర్మన్ ఎలువాక రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘అమెరికా ఉపాధ్యక్షుడు’ మైక్ పేన్స్తో కేటీఆర్..
హైదరాబాద్: ఇకపై ఆయనను కలవాలుసుకోవాలంటే కొద్దిగా కష్టపడాల్సిందే. అవును. అమెరికా ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనంలో కీలక పాత్రధారి, ట్రంప్ సహచరుడు, అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్ అపాయింట్మెంట్ అంత తేలికైనా వ్యవహారమేమీ కాదు. ఈ తరుణంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు(కేటీఆర్).. మైక్ పేన్స్ తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి కేటీఆర్ ఈ ఏడాది మే చివరి వారంలో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన.. మే 25-25 తేదీల్లో ఇండియానా గవర్నర్ మైక్ పేన్స్ ను కలుసుకున్నారు(అప్పటికే పేన్స్ రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారయ్యారు) ఇండియానా రాష్ట్ర రాజధాని ఇండియానా పోలీస్, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాలను అనుసంధానం చేసే ’సిస్టర్ సిటీస్ కమ్యూనిటీ’లో భాగంగా కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. నాటి సమావేశానికి సంబంధించిన ఫొటోలను కేటీఆర్ బుధవారం తన ట్విట్టర్ అకౌంట్లో రీపోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు, ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ’ప్రపంచమంతా కొన్ని గంటలుగా ఉత్సుకతతో ఊగిపోతోంది. అమెరికాలో ట్రంఫ్ థండర్.. ఇండియాలో మోదీ సంచలన నిర్ణయం.. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. మున్ముందు కూడా ఇలాంటి స్వీట్ షాక్ లు తప్పక చవిచూడాల్సిఉంటుంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, ఆయన సహచరుడు మైక్ పేన్స్ విజయంతో అమెరికా, భారత్ ల బంధం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. The world has become so much more exciting in last several hours. Trump's triumph & Modi's surprise move!! More excitement ahead I am sure.. — KTR (@KTRTRS) 9 November 2016 Many congratulations VicePresident elect @mike_pence Glad to have met you earlier this year. Hope USA & India relations grow more stronger pic.twitter.com/R0KYN072Px — KTR (@KTRTRS) 9 November 2016