breaking news
travel abroad
-
వామ్మో.. మామూలు ఖర్చు కాదు!
తిరిగే కాలు, తిట్టే నోరు ఉరికే ఉండవని సామెత. కొంతమంది తెగ తిరుగుతుంటారు. నిరంతరం ప్రయాణిస్తుంటారు. కొత్త ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రపంచ యాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడం లేదు.15 లక్షల కోట్లు!ప్రపంచ యాత్రలు చేసేవాడు ప్రజ్ఞావంతుడౌతాడని పెద్దలు చెబుతుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారు మనవాళ్లు. విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు భారీగానే ఖర్చుపెడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2009-10లో విదేశీ ప్రయాణాలకు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) వెచ్చించారు. ఈ వ్యయం 2024-25 నాటికి దాదాపు వెయ్యి రెట్లు (975%) శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ లెక్కన చూసుకుంటే సగటు వార్షిక వృద్ధి రేటు 58.2 శాతంగా ఉంది.జర్నీలకే ఎక్కువ!గతంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రయాణాల కోసం కూడా అధికంగా వెచ్చిస్తున్నారు. ఈక్విటీ నుంచి రియల్ ఎస్టేట్ (Real Estate) వరకు ప్రతిదానికీ డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే విదేశీ ప్రయాణాలకు కూడా ఎక్కువ మొత్తంలో వ్యయం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే విదేశాల్లో చదువు కంటే కూడా జర్నీలు చేయడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయం గత 15 ఏళ్లలో 1000 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.ఎక్కడికి వెళ్తున్నారు?తుర్కియే, ఫ్రాన్స్, మారిషస్, అమెరికా, బ్రెజిల్, చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలను భారతీయులు చుట్టి వస్తున్నారు. 2009 సంవత్సరంలో 1.1 కోట్ల మంది ఇండియన్స్ విదేశాలు వెళ్లారు. కోవిడ్-19 (Covid-19) మహమ్మారికి ముందు ఈ సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో ఈ సంఖ్య బాగా తగ్గింది. కానీ, కరోనా ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో, 2022లో విదేశాలకు ప్రయాణించిన (travel abroad) భారతీయుల సంఖ్య మళ్లీ 2 కోట్లు దాటింది.చదువుకెంత ఖర్చు?భారతీయులు మెరుగైన జీవితాన్ని గడపడానికి విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని టీఓఐ నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య, మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఉపాధికి భరోసాయిచ్చే నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం 2024-25లో మనవాళ్లు చేసిన వ్యయం 9.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 2009-10లో ఈ వ్యయం 549 మిలియన్ డాలర్లు. ఏడాదికి 21 శాతం పెరుగుదల నమోదయింది. చదవండి: ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా? -
అమెరికా వేటాడుతోంది.. బీ కేర్‌ఫుల్!
మాస్కో: అమెరికాకు వెళ్లే యోచనలో ఉన్న రష్యా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా నిఘా విభాగాలు ఇతర దేశాల నుంచి వలస వచ్చే వారిపై నిఘా ఉంచిందని, ముఖ్యంగా రష్యా వాసులపైనే ప్రధానంగా వారి వేట మొదలైందని పేర్కొంది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ అధికారులు ఓ ప్రటకన విడుదల చేశారు. అమెరికాకు వలసవచ్చిన వారిని ఏవో కారణాలు చూపించి వారి అధికారులు అరెస్ట్ చేసి భయబ్రాంతులకు లోను చేస్తున్నారని రష్యా అభిప్రాయపడింది. మూడో ప్రపంచ దేశాల్లో సైతం అమెరికా విజ్ఞప్తి మేరకు అమాయకులను అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో హింసించే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. 'ఓ వైపు అమెరికాతో రష్యా సత్సంబంధాలు మెరుగు పరుచుకుంటుండగా మరోవైపు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు రష్యన్లపై వేట కొనసాగిస్తున్నారు. అందుకే విదేశీ యాత్రలు, పర్యటనలు, ఉపాధి కోసం వలస వెళ్లే రష్యా వాసులు ఆచితూచి వ్యవహరించాలి. గతేడాది నుంచి విదేశాల్లో 10 మందికి పైగా అరెస్ట్ చేశారు. గతంలో ఆయుధాల వ్యాపారి అంటూ విక్టోర్ బౌట్ అనే వ్యక్తిని థాయ్‌లాండ్‌లో అరెస్ట్ చేయగా అమెరికాకు తరలించారు. రష్యా వ్యాపారి అనే కారణంగా అతడిని అరెస్ట్ చేసి విచారణ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ' రష్యా విదేశాంగశాఖ పలు విషయాలను వెల్లడించింది. రష్యాకు వెళ్లే తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా ట్రావెల్ అడ్వైజరీ డిపార్ట్మెంట్ ఈ ఏడాది జనవరి 10న హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదం లాంటి సమస్యల్లో చిక్కుకుని ఆపదలు కొని తెచ్చుకుంటారని, ఇతరత్రా వేధింపులకు గురయ్యే అవకాశాలు రష్యాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొనడం రష్యాను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తమ పౌరులు విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలు జాగ్రత్తగా ఉండాలని రష్యా విదేశాంగశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
విదేశీ ఉద్యోగాల పేరిట దగా
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో ఉద్యోగులు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో డబ్బు దండుకొని.. నిరుద్యోగులను నిండా ముంచుతున్న ఓ అక్రమ మ్యాన్‌పవర్ కన్సెల్టెన్సీ గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ర ట్టుచేశారు. డీసీపీ బి.లింబారెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రగడ్డకు చెందిన సయ్యద్ జఫార్ మొయినుద్దీన్ టోలిచౌకిలోని డీలక్స్ కాలనీలో ‘ట్రావెల్ అబ్రాడ్’ పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. ఇతగాడు ట్రావెల్స్ ముసుగులో ఎలాంటి అనుమతులు లేకుండా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే మాన్పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఈ తరహా కన్సల్టెన్సీలు నిర్వహించాలంటే భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. దుబాయ్‌లో సూపర్వైజర్, ప్లంబర్, మెకానిక్, కుక్, హెల్పర్, లేబర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని చెప్తూ నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష జీతం వస్తుందని వల వేసేవాడు. ఆసక్తి చూపిన వారి నుంచి పాస్‌పోర్ట్‌తో పాటు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసే వాడు. కొన్నాళ్లు మ«భ్యపెట్టి చివరకు వీసా రిజెక్ట్ అయిందని మోసం చేసేవాడు. నిజామాబాద్ జిల్లాలో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న జఫార్ అక్కడ దాదాపు 70 నుంచి 80 మందిని మోసం చేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, వి.కిషోర్, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి శుక్రవారం దాడి చేసి నిందితుడిని అరెస్టు చేశారు. డాక్యుమెంట్లు, స్టాంపులు తదితరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం గోల్కొండ పోలీసులకు అప్పగించారు.