breaking news
Tirumala srivari
-
రేపు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల మార్చి కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 18 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబరు 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్ తీసుకోవాలి.21న ఇతర సేవా టికెట్ల విడుదల\⇒ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.⇒ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 23న అంగప్రదక్షిణం టోకెన్లు⇒ మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా⇒ శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్లైన్ కోటాను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా⇒ వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల⇒ మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలో గదుల కోటా విడుదల⇒ తిరుమల, తిరుపతిలో మార్చి నెల గదుల కోటాను డిసెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.⇒ డిసెంబరు 27న మార్చి నెల శ్రీవారి సేవ కోటా విడుదల చేస్తారు.⇒ https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. -
వైభవంగా శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు
-
శ్రీవారికి బంగారు శఠగోపం కానుక
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారికి గురువారం బంగారు శఠగోపం కానుకగా అందింది. తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ. 18 లక్షల ఖర్చుతో బంగారు శఠగోపాన్ని తయారు చేయించారు. దీన్ని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ద్వారా ఆలయంలో అందజేశారు. -
శ్రీవారి హుండీలో చోరీ
నిందితుడి పట్టివేత తిరుమల/తిరుపతి లీగల్ : తిరుమల శ్రీవారి హుండీలో గురువారం ఓ యువకుడు చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరా ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన రూ.13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన రఘు(20) శ్రీవారి దర్శనార్థం ఉచిత క్యూలైన్ ద్వారా గురువారం వేకువజామున 4 గంటలకు ఆలయంలోకి వెళ్లాడు. స్వామిని దర్శించుకుని హుండీ వద్దకు వచ్చాడు. హుండీలో కానుకలు సమర్పిస్తున్నట్టు నటించి చేతికందిన నగదు నోట్లను తీసుకుని జోబులో పెట్టుకున్నాడు. ఎవరూ చుడలేదన్నట్టు ముందుకు సాగాడు. సీసీ కెమెరాల ద్వారా రఘు దొంగతనాన్ని విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వెంటనే సమాచారాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చేరవేసారు. అతడిని అదుపులోకి తీసుకుని తిరుమల క్రైం పోలీసులకు అప్పగించారు. తిరుమల సీసీఎస్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.


