breaking news
Terminator Genisys
-
త్వరలో టర్మినేటర్ 6
హాలీవుడ్లోనే కాదు, ప్రపంచ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని సినిమా సీరీస్ టర్మినేటర్. హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్ స్క్వాజ్నెగ్గర్ హీరోగా తెరకెక్కిన ఈ సీరీస్లో ఇప్పటికే 5 భాగాలు విడుదలయ్యాయి. అయితే చివరగా రిలీజ్ అయిన టర్నినేటర్ జెనిసిస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో ఈ సీరీస్లో మరో సినిమా వస్తుందో, లేదో అన్న అనుమానం కలిగింది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టర్నినేటర్ సీరీస్లో మరో సినిమా ఉంటుందంటూ ప్రకంటించాడు హీరో ఆర్నాల్డ్. 2015లో రిలీజ్ అయిన టర్మినేటర్ జెనిసిస్కు రిలీజ్ అయిన తొలి రోజు నుంచే నెగెటివ్ రివ్యూస్ రావటంతో కలెక్షన్ల విషయంలోనూ వెనకబడింది. నార్త్ అమెరికాలో 100 మిలియన్ డాలర్లు కూడా వసూళు చేయలేకపోయిన టర్మినేటర్ 5, చైనాలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో మరోసారి టర్మినేటర్గా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు ఆర్నాల్డ్. -
'నగ్నదృశ్యాలు ఇబ్బందికరం'
లండన్: నగ్నంగా నటించడం ఇబ్బందికరమేనని హాలివుడ్ యాక్షన్ స్టార్ ఆర్నార్డ్ ష్వార్జ్ నెగ్గర్ అంగీకరించాడు. తాజా చిత్రం 'టెర్మినేటర్ జెనిసిస్' కోసం అతడు దస్తులు త్యజించాడు. అయితే ఈ దృశ్యాల్లో నటించేందుకు ఇబ్బంది పడినా తమాషా ఉంటుందని 67 ఏళ్ల ష్వార్జ్ నెగ్గర్ పేర్కొన్నాడు. 'నగ్న దృశ్యాలు ఇబ్బందికరం. కానీ మా సినిమాలో ఈ సన్నివేశం తమాషాగా ఉంటుంది. సరదా సంవాదం, మాటలతో హాస్యభరితంగా ఈ సీన్ ఉంటుంద'ని ష్వార్జ్ నెగ్గర్ తెలిపాడు.