breaking news
terminals
-
అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకల్లో ఉగ్రవాద దాడులకు దిగొచ్చనే అంచనాల నేపథ్యంలో భద్రతా అధికారులు దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ జారీచేశారు. విమానాశ్రయాల ద్వారా ఉగ్రవాదులు దేశంలోచొరబడి దాడులు నిర్వహించే ప్రమాదం ఉందనీ, అప్రమత్తంగా ఉండాలంటూ నిఘా సంస్థలు ముందస్తు హెచ్చరికలు చేశాయి. ప్రధానంగా మిలిటెంట్స్ యూనిఫామ్ లో సంచరిస్తూ భద్రతా సిబ్బందిని మభ్యపెట్టి తప్పించుకునే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని భద్రతా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలలో భద్రతకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలంటూసివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఎఎస్) డిసెంబర్ 28 న అలర్ట్ జారీ చేసింది. అలాగే దేశంలో విమానాశ్రయాలభద్రతను పరిశీలించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) కూడా హెచ్చరికలు జారీ చేసింది. యూని ఫాంలో ఉన్న అనుమానితులను, పాస్ ఉన్నా కూడా జాగ్రత్తగా తనిఖీ చేయాలని ఆదేశించింది. సాధారణంగా పోలీసు లేదా సైనిక దుస్తుల్లో ఉన్నవారి పట్ల భద్రతా సిబ్బంది సాఫ్ట్ గా ఉంటారనీ...కానీ పూర్తి తనిఖీలు నిర్వహించాలంటూ అప్రమత్తం చేశారు. అలాగే, పారామిలిటరీ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రయాణికుల ప్రొఫైల్ ను గుర్తించడంలో శిక్షణ పొందిన "స్వీపింగ్ స్క్వాడ్" ఏర్పాటు చేసినట్టు సమాచారం. -
ఈ సారికింతే...
సాక్షి, ముంబై: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ముంబైకర్లను కొంత నిరాశకు గురిచేసింది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల కోసం కొత్త టెర్మినల్స్‌ను నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించడం నగర ప్రజలకు కొంతలో కొంత ఊరటినిచ్చే అంశం. ఈ టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం లోకల్ రైళ్లపై పడుతున్న అదనపు భారం చాలా వరకు తగ్గిపోనుంది. ఫలితంగా కొత్తగా లోకల్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. నగర విస్తరణ, రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మూడు కొత్త టెర్మినల్స్ నిర్మించాలనే ప్రతిపాదనను పశ్చిమ, సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగాలు రైల్వే బోర్డుకు పంపించాయి. ఇందులో పన్వేల్, ఠాకుర్లీ, వసయిరోడ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో రెండు టెర్మినల్స్‌కు మంజూరు లభించే అవకాశముందని సూచన ప్రాయంగా మంత్రి వెల్లడించారు. పనులు పూర్తిచేసుకుని వినియోగంలోకి వస్తే ముంబైలో లోకల్ రైళ్లపై పడుతున్న దూరప్రాంతాల రైళ్ల భారం చాలా వరకు తగ్గిపోనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఐదు టెర్మినల్స్ ఉన్నాయి. జనాభాతో పోలిస్తే ముంబైలో టెర్మినల్స్ సంఖ్య రెట్టింపు ఉండాలి. కాని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబైలో ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), దాదర్, బాంద్రా, లోక్మాన్య తిలక్ (కుర్లా), ముంబై సెంట్రల్ టెర్మినల్స్ మాత్రమే ఉన్నాయి. వీటికి మరో మూడు అదనంగా చేరితే ముంబై వాసుల సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సెంట్రల్ రైల్వే పన్వేల్, ఠాకుర్లిలో, పశ్చిమ రైల్వే వసయిరోడ్లో టెర్మినల్స్ నిర్మించాలనే ప్రతిపాదనను సంబంధిత బోర్డులు పంపించాయి. గత బడ్జెట్లోనే పన్వేల్‌లో టెర్మినస్, కలంబోలి ప్రాంతంలో రైలు బోగీల నిర్వాహణ, మరమ్మత్తుల కోసం కోచింగ్ టెర్మినస్ నిర్మించాలని మంజూరు లభించినా అది అమలుకు నోచుకోలేదు. అవి ఏర్పాటయ్యుంటే నగరంలోని వివిధ టెర్మినల్స్‌పై భారం తగ్గేది. లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచాలంటే కొత్త టెర్మినల్స్ నిర్మాణం జరగాలి. చాలా సందర్భాలలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లను లూప్లైన్లో పెట్టాల్సి వస్తోంది. కొత్త టెర్మినల్స్ ఏర్పాటైతే ఈ సమస్య కొంత మేర కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఆగని మోదీ బండి
నగరవాసుల ఆశలు అడియాసలే.. ఉస్సూరనిపించిన రైల్వేబడ్జెట్ ఊసులేని టర్మినల్స్ రెండో దశకు రూ.8 కోట్లు కొత్త రైళ్ల ప్రతిపాదనే లేదు కొత్తపల్లి, మహబూబ్‌నగర్ మార్గాలకు నిధులు నగరంలోని ప్రధాన స్టేషన్లు, పలు ఎంఎంటీఎస్‌ల్లో వైఫై సౌకర్యం నరేంద్ర మోడీ, సురేష్ ప్రభు రైలు భాగ్యనగరంలో ఆగకుండానే వెళ్లిపోయింది. గురువారం కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ నగరవాసుల ఆశలను అడియాశలు చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు కొన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లకు వైఫై సేవలను అందుబాటులోకి తేవడం, ప్రధాన రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందజేయడం మినహా ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారు. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు ఈ ఏడాది కేవలం రూ.8 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నివారించేందుకు గత బడ్జెట్లో మౌలాలి, వట్టినాగులపల్లిలో భారీ టర్మినళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించినా అందుకు సంబందించి సప్రస్తుత బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై కూడా ఎలాంటి ప్రస్తావ చేయలేదు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్, మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రెండు కొత్త రైలు మార్గాలకు మాత్రం అరకొర నిధులు కేటాయించారు. మొత్తంగా రైల్వే బడ్జెట్ కొద్దిపాటి సదుపాయాలు మినహా ఎలాంటి హామీలు, నిధులు, ప్రాజెక్టులు, ప్రతిపాదనలు లేకుండానే ఏటేటా వచ్చే ఒక తంతులాగా సాగిపోయింది. - సాక్షి,సిటీబ్యూరో అందుబాటులోకి వైఫై సేవలు... నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు, బేగంపేట్, లింగంపల్లి, హైటెక్‌సిటీ, మల్కాజిగిరి, మౌలాలీ, ఉందానగర్, తదితర ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు కొత్తగా వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ప్రయాణికులు తాము బుక్ చేసుకొన్న రైళ్ల రాకపోకలపై ఎస్సెమ్మెస్ ద్వారా మొబైల్ ఫోన్లకు సమాచారం అందించే సదుపాయం కల్పించారు. కౌంటర్ల కొరత కారణంగా జనరల్ బోగీ ప్రయాణికులకు సకాలంలో టిక్కెట్లు దొరక్క రైళ్లు అందుకోలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లతో పాటు, సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్లలో జనరల్ కౌంటర్ల సంఖ్యను పెంచనున్నారు. మరిన్ని ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ యంత్రాలను అందుబాటులోకి తేనున్నారు. మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని లేడీ కంపార్టుమెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లు, మాతృభూమి లేడీస్ స్పెషల్ ట్రైన్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో బోగీల్లో సీసీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి మొబైల్ రీ చార్జింగ్ సదుపాయం అందుబాటులో తేనున్నారు. ‘వంతెన’ దాట వేశారు ఈసారి బడ్జెట్లో రైల్వే వంతెనల నిర్మాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నగరంలో 13 ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నా ఇప్పటి వరకు లక్డికాఫూల్, ఆలుగడ్డ బావి మినహా ఎక్కడా పూర్తి కాలేదు. కొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఈ ఏడాది వాటిని పూర్తి చేసేందుకు ఒక్కపైసా విడుదల చేయలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి బదులు స్టేషన్ పైన ఉన్న ఖాళీ స్థలాన్ని వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. హోటళ్లు, షాపింగ్కాంప్లెక్లు, ప్రయాణికుల వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం పి.కె.శ్రీవాస్తవ పేర్కొన్నారు. క్రమసంఖ్య {పతిపాదన పురోగతి 1) వట్టినాగులపల్లి,మౌలాలీ టర్మినళ్లు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 2 ) కింద్రాబాద్ వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి పూర్తిగా విస్మరించారు. 3) లాలాపేట్ ఆసుపత్రికి సూపర్‌స్పెషాలిటీ హోదా నిధుల ఊసు లేదు. 4) రైల్వే నర్సింగ్ కళాశాల మరిచిపోయారు. 5) ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు మరిచారు. 6) ఎంఎంటీఎస్ రెండో దశ రూ.8 కోట్లు 7) సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైలు మార్గం (113కి.మీ.) రూ.27.44 కోట్లు 8) మనోహరాబాద్-కొత్తపల్లి (150 కి.మీ.)మార్గం రూ.20 కోట్లు 9) సికింద్రాబాద్-అజ్మీర్ దర్గా, హైదరాబాద్-తిరువనంతపురం రైళ్లు {పస్తావన లేదు. 10) సికింద్రాబాద్-షిరిడీ వైపు కొత్త రైళ్లు లేవు 11) హైదరాబాద్-జిల్లా కేంద్రాలకు ఇంటర్సిటీ సర్వీసులు ప్రస్తావన లేదు పత్తా లేని కొత్త రైళ్లు... దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతున్నా అందుకు తగినట్లుగా రైళ్ల సంఖ్య పెరగడం లేదు. న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూర్ వంటి నగరాలతో పాటు, తిరుపతి, షిరిడీ, అజ్మీర్,తదితర ప్రాంతాలకు రైళ్లను పెంచాలని ప్రయాణికులే కాకుండా న గరానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఎంపీలు కూడా అనేక సార్లు ప్రతిపాదించారు. అయితే ఈ సారి బడ్జెట్లో కూడా కొత్త రైళ్ల ఏర్పాటుపై ఎలాంటి ప్రస్తావన లేదు. నగరం నుంచి షిరిడీ వెళ్లే భక్తులకు ప్రస్తుతం మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. కాకినాడ నుంచి నేరుగా షిరిడీ వరకు సాయినగర్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు రోజులే నడుస్తుంది. ఈ రూట్లో హైదరాబాద్ నుంచి మరో రైలు నడపాలనే డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదు. అలాగే ప్రస్తుతం అయ్యప్ప భక్తుల కోసం శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. నగరం నుంచి తిరువనంతపురంకు మరో ఎక్స్‌ప్రెస్ తప్పనిసరి. అయితే ఆయా మార్గాల్లో ఒక్క రైలును కూడా అదనంగా ప్రకటించకపోవడం ప్రయాణికులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కొత్త లైన్లు... సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు నిర్మించతలపెట్టిన 110 కిలోమీటర్ల కొత్త లైన్లకు ఈ బడ్జెట్లో రూ.27.44 కోట్లు కేటాయించారు. అలాగే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గానికి మరో రూ.20 కోట్లు కేటాయించారు. ఈ రెండు మార్గాలు తప్ప మిగతా ఏ రూట్లోనూ కొత్త లైన్లపైన ప్రతిపాదనలు లేవు. నర్సింగ్ కాలేజీ మరిచారు... లాలాగూడలోని దక్షిణమధ్య రైల్వే కేంద్రీయ ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ హోదాకు పెంచడంతో పాటు, నర్సింగ్ కళాశాలను నిర్మించాలనే గత బడ్జెట్ ప్రతిపాదన కూడా ఈ సారి ఆచరణకు నోచుకోలేదు. ఈ రెండు భవనాల కోసం ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం.