breaking news
term extend
-
సీడీఎస్ జనరల్ చౌహాన్ పదవీ కాలం పొడిగింపు
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని కేంద్రం ప్రభుత్వం ఎనిమిది నెలలు కొనసాగించింది. ఆయన ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, వచ్చే ఏడాది మే 30వ తేదీ దాకా పొడిగించినట్లు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. సీడీఎస్ చీఫ్‌తోపాటు డిపార్టుమెంట్ ఆఫ్ మిలటరీ అఫైర్స్ కార్యదర్శిగా జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని 8 నెలలపాటు పొడిగించడానికి ప్రభుత్వం అంగీరించినట్లు రక్షణ శాఖ తెలియజేసింది. వచ్చే ఏడాది మే 30 లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టంచేసింది. జనరల్ అనిల్ చౌహాన్ 2022 సెప్టెంబర్ 30 నుంచి సీడీఎస్‌గా సేవలందిస్తున్నారు. -
చెల్లప్ప కమిషన్ గడువు ఆర్నెల్లు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజనుల ప్రాముఖ్యతలపై విచారణ చేపడుతున్న చెల్లప్ప కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం ఆర్నెల్లు పొడిగించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జనవరి 31 నాటితో ఈ కమిషన్ గడువు ముగియనుంది. కానీ, విచారణ ప్రక్రియ ఇంకా పూర్తికానందున కాలపరిమితిని మరో ఆర్నెల్లు పొడిగించింది. నిర్దేశిత గడువులోగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
కశ్మీర్ గవర్నర్ పదవీకాలం పొడిగింపు?
శ్రీనగర్ : కశ్మీర్ గవర్నర్ నరీందర్‌నాథ్ వొహ్రా (82) పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం యోచిస్తోందనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చెడిపోవడంతో కశ్మీర్లో మంగళవారం నుంచి గవర్నర్ పాలన మొదలైన సంగతి తెలిసిందే. అయితే వొహ్రా పదవీకాలం జూన్ 27న ముగియనుండగా.. జూలైలో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. దక్షిణ కశ్మీర్ మీదుగా అమర్నాథ్ యాత్ర సాగనుండగా.. అక్కడ ఇప్పటికే ఉగ్రవాద కార్యకాలాపాలు పెరిగిపోవడంతో భద్రతా సమస్యలు తలెత్తాయి. వొహ్రా అనంతరం కొత్త గవర్నర్‌ను నియమిస్తే కశ్మీర్ పాలనా, భద్రతా పరమైన వ్యవహారాలు తెలుసుకొనే సరికే నూతన గవర్నర్‌కు దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వొహ్రా పదవీ కాలం పెంపు తథ్యమని పలువురు భావిస్తున్నారు. 2016లో ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మద్ సయ్యద్ మరణానంతరం కశ్మీర్లో ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. ఆ సమయంలో రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పకుండా వొహ్రా చక్కదిద్దారు. మరోవైపు అమర్నాథ్ క్షేత్ర బోర్డులో వొహ్రా పరిపాలనా అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఆగస్టు 26న యాత్ర ముగియనుంది. -
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పదవీ కాలం పొడగింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం పదవీ కాలాన్ని మరో ఏడాది పొడగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సోమవారం హైదరాబాద్ లో పర్యటించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఆహ్వానం మేరకు కేసీఆర్ పలు ప్రాంతాలను సందర్శించారు.