చెల్లప్ప కమిషన్‌ గడువు ఆర్నెల్లు పొడిగింపు | Chellappa Commission Term Extended For Six Months | Sakshi
Sakshi News home page

Feb 1 2019 2:52 AM | Updated on Feb 1 2019 2:52 AM

Chellappa Commission Term Extended For Six Months - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజనుల ప్రాముఖ్యతలపై విచారణ చేపడుతున్న చెల్లప్ప కమిషన్‌ కాలపరిమితిని ప్రభుత్వం ఆర్నెల్లు పొడిగించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జనవరి 31 నాటితో ఈ కమిషన్‌ గడువు ముగియనుంది. కానీ, విచారణ ప్రక్రియ ఇంకా పూర్తికానందున కాలపరిమితిని మరో ఆర్నెల్లు పొడిగించింది. నిర్దేశిత గడువులోగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement