breaking news
Chellappa Commission
-
చెల్లప్ప కమిషన్ గడువు ఆర్నెల్లు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజనుల ప్రాముఖ్యతలపై విచారణ చేపడుతున్న చెల్లప్ప కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం ఆర్నెల్లు పొడిగించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జనవరి 31 నాటితో ఈ కమిషన్ గడువు ముగియనుంది. కానీ, విచారణ ప్రక్రియ ఇంకా పూర్తికానందున కాలపరిమితిని మరో ఆర్నెల్లు పొడిగించింది. నిర్దేశిత గడువులోగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
పరువు హత్యపై విచారణ ప్రారంభించిన చెల్లప్ప కమిషన్
నేరుడుగొండలో జరిగిన పరువు హత్యపై విచారణ జరపడానికి చెల్లప్ప కమిషన్ సభ్యులు ఆదివారం నేరుడుగొండ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషన్ సభ్యులు హెచ్ కే నాగు, ఐటీడీఏ పీఓ ఆర్వీ కర్ణన్, ఆదిలాబాద్ ఆర్డీఓ సుధాకర్ రెడ్డిలు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు..తమ కుమార్తె ప్రవర్తన కారణంగా కుటుంబం పరువుపోతోందని భావించిన తల్లిదండ్రులు కన్నకూతుర్నే కడతేర్చారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలకేంద్రంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకుంది. నేరడిగొండకు చెందిన అఖిల(17) అనే యువతి, తహశీల్ధార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేందర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో పరువుపోతుందని భావించిన యువతి తల్లిదండ్రులు గురువారం రాత్రి యువతిని చున్నీతో ఉరివేసి చంపి అనంతరం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులను రిమాండ్కు తరలించారు. చెల్లప్ప కమిషన్ సభ్యులు ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.