పరువు హత్యపై విచారణ ప్రారంభించిన చెల్లప్ప కమిషన్ | Chellappa Commission has started investigation into honor killing | Sakshi
Sakshi News home page

పరువు హత్యపై విచారణ ప్రారంభించిన చెల్లప్ప కమిషన్

Jun 26 2016 3:24 PM | Updated on Aug 17 2018 2:53 PM

నేరుడుగొండలో జరిగిన పరువు హత్యపై విచారణ జరపడానికి చెల్లప్ప కమిషన్ సభ్యులు ఆదివారం నేరుడుగొండ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.

నేరుడుగొండలో జరిగిన పరువు హత్యపై విచారణ జరపడానికి చెల్లప్ప కమిషన్ సభ్యులు ఆదివారం నేరుడుగొండ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషన్ సభ్యులు హెచ్ కే నాగు, ఐటీడీఏ పీఓ ఆర్వీ కర్ణన్, ఆదిలాబాద్ ఆర్డీఓ సుధాకర్ రెడ్డిలు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

 

వివరాలు..తమ కుమార్తె ప్రవర్తన కారణంగా కుటుంబం పరువుపోతోందని భావించిన తల్లిదండ్రులు కన్నకూతుర్నే కడతేర్చారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలకేంద్రంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకుంది. నేరడిగొండకు చెందిన అఖిల(17) అనే యువతి, తహశీల్ధార్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేందర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

 

కులాలు వేరుకావడంతో పరువుపోతుందని భావించిన యువతి తల్లిదండ్రులు గురువారం రాత్రి యువతిని చున్నీతో ఉరివేసి చంపి అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులను రిమాండ్‌కు తరలించారు. చెల్లప్ప కమిషన్ సభ్యులు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement