Tax increase
-
అందమైన ఈ యూరప్ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్!
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక నగరాల్లో ఒకటి. కనువిందు చేసే నీటి కాలువలు, చారిత్రక భవనాలు, మ్యూజియంలు, సాంస్కృతిక వైవిధ్యంతో ఏటా కోట్లాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్న ఈ నగరం ఇప్పుడు ‘ఓవర్ టూరిజం’ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల సంఖ్యను నియంత్రించడంతో పాటు నగర నిర్వహణకు అదనపు నిధులు సమకూర్చుకునేందుకు ఆమ్స్టర్డామ్ సిటీ ప్రభుత్వం పర్యాటక పన్నును భారీగా పెంచే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.12.5 శాతం నుంచి 20 శాతానికి..ప్రస్తుతం ఆమ్‌స్టర్‌డామ్‌లో హోటళ్లు, హాస్టళ్లు, ఇతర వసతి కేంద్రాల్లో బస చేసే పర్యాటకులపై గది అద్దెపై 12.5 శాతం పర్యాటక పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే క్రూయిజ్ నౌకల ద్వారా ఒక రోజు పర్యటనకు వచ్చే వారిపై ఒక్కొక్కరికి 15 యూరోలు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1650 పన్ను విధిస్తున్నారు.కొత్త సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం 2027 నుంచి ఈ పన్నును 16 శాతానికి పెంచి, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక శాతం చొప్పున పెంచుతూ 2030 నాటికి 20 శాతానికి చేర్చనుంది. ఇది అమలైతే ప్రపంచంలోనే అత్యధిక పర్యాటక పన్నులు విధించే నగరాల్లో ఆమ్స్టర్డామ్ ఒకటిగా నిలవనుంది.నగరంపై పెరుగుతున్న ఒత్తిడే కారణంపర్యాటకం నగర ఆర్థిక వ్యవస్థకు కీలక ఆదాయ వనరు అయినప్పటికీ, అదే సమయంలో జనసమ్మర్థ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు, స్థానికుల జీవన ప్రమాణాలపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోందని సిటీ ప్రభుత్వం పేర్కొంది. అందుకే నగర నిర్వహణ, పరిశుభ్రత, భద్రత, చట్ట అమలు, మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చుల్లో పర్యాటకులు కూడా తగిన వాటా భరించాలని భావిస్తోంది. పన్ను పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.క్రూయిజ్ టెర్మినల్‌కు కూడా గుడ్‌బై?పన్ను పెంపుతో పాటు మరికొన్ని కఠిన నిర్ణయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సముద్ర క్రూయిజ్ నౌకల ద్వారా వచ్చే పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు నగరంలోని ప్రధాన క్రూయిజ్ టెర్మినల్‌ను మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జాతీయ ప్రభుత్వం, ప్రాంతీయ అధికారులతో చర్చల అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనుంది.అదనంగా, కాలువలపై బోటు టూర్లు, అద్దె పడవలు వంటి వినోద కార్యకలాపాలపై కూడా అధిక రుసుములు విధించే అవకాశాలు ఉన్నాయి. నగర కేంద్రంలోని కొన్ని భవనాలను కొనుగోలు చేసి, వాటి వినియోగాన్ని మార్చడం ద్వారా అధిక పర్యాటక ఒత్తిడిని తగ్గించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నారు.రెడ్ లైట్ ప్రాంతానికి ప్రత్యామ్నాయంప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్పై ఒత్తిడిని తగ్గించేందుకు నగర దక్షిణ ప్రాంతంలో ప్రత్యేక “ఎరోటిక్ సెంటర్” ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సెక్స్ వర్కర్లకు మరింత భద్రత కల్పించడం, నేర కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడం, నగర కేంద్రంలో రద్దీని నియంత్రించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.పర్యాటకులను ఆహ్వానిస్తూనే నియంత్రణగత కొన్నేళ్లుగా ఆమ్స్టర్డామ్ ‘టూరిజం ఇన్ బ్యాలెన్స్’ విధానాన్ని అమలు చేస్తోంది. పర్యాటకులను పూర్తిగా నిరోధించడం కాకుండా, నగర సామర్థ్యానికి మించి పెరుగుతున్న సందర్శకుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలు, యునెస్కో వారసత్వ హోదా పొందిన కాలువల వలయం, సైకిల్ సంస్కృతి కారణంగా ఆమ్స్టర్డామ్ ఇప్పటికీ ఐరోపాలో అత్యధికులు సందర్శించాలనుకునే పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇకపై అక్కడికి వెళ్లే పర్యాటకులు మరింత ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సి రావచ్చు. -
Kenya: భారతీయులకు అలర్ట్
న్యూఢిల్లీ: భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ కెన్యాలో ఉంటున్న భారతీయులకు అలర్ట్జారీ చేసింది. పన్నుల పెంపును నిరసిస్తూ అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.‘‘ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. పరిస్థితి సద్దుమణిగే వరకు.. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దు’’ అని కెన్యాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఎక్స్ ద్వారా సూచించింది. మరింత సమాచారం కోసం స్థానిక వార్త ఛానెల్స్‌ను, అలాగే.. దౌత్య సంబంధిత వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించింది.ADVISORY FOR INDIAN NATIONALS IN KENYA In view of the prevailing tense situation, all Indians in Kenya are advised to exercise utmost caution, restrict non-essential movement and avoid the areas affected by the protests and violence till the situation clears up.— India in Kenya (@IndiainKenya) June 25, 2024ఇదిలా ఉంటే.. కెన్యాలో పన్నుల పెంపు చట్టానికి ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సరిగ్గా అదే సమయంలోనే పార్లమెంట్ భవనం బయట నిరసనలు కొనసాగాయి. ‘‘కెన్యా ఇంకా వలస పాలనలోనే మగ్గిపోతోందని.. తమ దేశాన్ని తాము రక్షించుకుని తీరతామని’’ నినాదాలు చేస్తూ వేల మంది యువత ఒక్కసారిగా చట్టసభలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, 20 మంది దాకా గాయపడ్డారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ఇచ్చింది. అయితే ఈ సంఖ్యే ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.ఆందోళనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి, కెన్యా ఉద్యమకారిణి అవుమా ఒబామా కూడా ఉన్నారు. టియర్‌గ్యాస్ దాడిలో ఆమె సైతం అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. ఏమిటీ బిల్లు..కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం మనీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని చట్టసభ్యుల్ని కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఈ ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చి.. దేశమంతటా విస్తరించాయి. -
సహజ వాయువుపై పన్ను పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహజవాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ముడి చమురు పై 5 శాతం మేర, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుంది. డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా 4 రూపాయలు, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై 1 శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తుంది.(చదవండి: పెళ్లైన 20 రోజులకే భర్తను చంపిన భార్య) కోవిడ్ కారణంగా పన్నులపై ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆదాయం కోల్పోయినందున సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 2020 నెలకు 4480 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉన్నా కేవలం 1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా, నాడు నేడు, టెలి మెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజ వాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
లాటరీపై 28 శాతం పన్ను
న్యూఢిల్లీ: లాటరీలపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన 38వ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. లాటరీ పన్ను పెంపు 2020 మార్చి నుంచి అమల్లోకి వస్తుందని రెవిన్యూ సెక్రటరీ పాండే తెలిపారు. అల్లిన బ్యాగులపై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఇండస్ట్రియల్ పార్క్‌లు వచ్చేందుకు ఇండస్ట్రియల్ ప్లాట్స్ మీద పన్ను మినహాయించామని చెప్పారు. గతంలో జరిగిన 37 కౌన్సిల్ సమావేశాల్లో జీఎస్స్టీ రేట్లపై అందరూ కలసి ఒకే నిర్ణయం తీసుకోగా, ఈ భేటీలో మొదటిసారి ఓటింగ్ ప్రక్రియను అమలు చేశారు. -
ఇంటిపై రుణాలుంటే...పన్ను భారం పెరుగుతుంది!
ఈ సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో... ఇంటి ఆదాయంలో ఏర్పడ్డ నష్టానికి సర్దుబాటు విషయంలో ఆంక్షలు విధించారు. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇంటి మీద నష్టాన్ని పూర్తిగా సర్దుబాటు చేయరు. రూ.2,00,000 దాటినా సరే... రూ.2,00,000 వరకే సర్దుబాటు చేసి మిగిలిన మొత్తాన్ని తర్వాతి సంవత్సరానికి బదిలీ చేస్తారు. ఇలా చేయడం వలన 2017–18 పన్ను భారం పెరుగుతుంది. అదెలాగో ఒక ఉదాహరణ రూపంలో చూద్దాం.. 31.3.2018కి సంబంధించిన వివరాలు జీతం మీద ఆదాయం రూ.10,00,000 ఇంటి మీద అప్పు రూ.50,00,000. ఈ అప్పు మీద 10 శాతం రూ.5,00,000. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం మీ ఆదాయం, పన్ను భారం జీతం రూ.10,00,000 సర్దుబాటు/నష్టం రూ.5,00,000 నికర ఆదాయం రూ.5,00,000 పన్ను భారం రూ.20,000 కొత్త ప్రతిపాదనల ప్రకారం వడ్డీ సర్దుబాటుని కేవలం రూ.2,00,000లకే పరిమితం చేస్తారు. దీనివల్ల పన్ను భారం పెరుగుతుంది. జీతం రూ.10,00,000 ఇంటి మీద నష్టం రూ.5,00,000 కానీ పరిమితి వలన రూ.2,00,000 నికర ఆదాయం రూ.8,00,000 పన్ను భారం రూ.80,000 కొత్త ప్రతిపాదనల వల్ల పన్ను భారం పెరిగింది. సర్దుబాటు కాని నష్టం తర్వాత సంవత్సరానికి బదిలీ చేస్తారు. దీన్నే క్యారీ–ఫార్వర్డ్ అంటారు. ఈ ఉదాహరణలో రూ.3,00,000 వచ్చే ఆర్థిక సంవత్సరానికి సర్దుబాటు చేస్తారు. ఆ సర్దుబాటు కూడా కేవలం ఇంటి మీద ఆదాయం ఉంటేనే సర్దుబాటు చేస్తారు. లేదంటే బదిలీ చేస్తారు. ఇలా 8 సంవత్సరాల వరకు వెళతారు. ఇలాంటప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ వారికి అసలు ఏ మాత్రం సర్దుబాటు కాదు. అద్దెకిచ్చిన వారికి సర్దుబాటు కావచ్చు. ఇంటి మీద నష్టాన్ని, సర్దుబాటును వాయిదా వేయడం వలన అసెసీకి నష్టం. రెండు లక్షల వడ్డీ లోపు వారికి ఎటువంటి నష్టం లేదు. కానీ పెద్ద పెద్ద రుణాలు తీసుకొని ఇల్లు కొనడం వలన ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు తగ్గిపోయాయి. పన్ను భారానికి విద్యా సుంకం కలపాలి.


