breaking news
tauraus
-
చంద్రబింబం మార్చి 16 నుండి 22 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) అవసరాలకు డబ్బు అందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకర్షిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవితాశయం నెరవేరే సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధు, మిత్రుల నుంచి మాట సహాయం అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు. పారిశ్రామికరంగం వారికి యోగవంతం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఒక ప్రకటన నిరుద్యోగులకు నిరాశ కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులు ఒత్తిడులకు లోనవుతారు. రాజకీయరంగం వారికి గందరగోళం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు, ఆహ్వానాలు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వాహనయోగం. భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమయం. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ప్రయాణాలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగయత్నాలలో నిరుద్యోగులకు విజయం. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయరంగం వారికి ప్రజాదరణ పెరుగుతుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికరంగం వారికి అనుకోని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఇంటాబయటా అనుకూల పరిస్థితి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించినా పుంజుకుంటాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చే స్తారు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయరంగం వారికి కొత్త పదవులు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. అనుకోని ప్రయాణాలు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. హితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. పదోన్నతులు. రాజకీయరంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. -
చంద్రబింబం డిసెంబర్ 22 నుండి 28 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. పరపతి పెరుగుతుంది. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. సంఘంలో ఎనలేని గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కనిపిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన వస్తులాభాలు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులు, మిత్రులతో అకారణ వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రగతి. వాహనయోగం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. పనుల్లో ఆటంకాలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారు. వారం చివరిలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు సన్మానయోగం. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త మిత్రులు పరిచయమవుతారు. రావలసిన సొమ్ము అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) అవసరాలకు సొమ్ము అందుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటువద్దు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆస్తి విషయాలలో సోదరులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యభంగం. వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు ఊహించని పురస్కారాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. పనుల్లో విజయం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వాహన, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... కార్యక్రమాలు ప్రథమార్థంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. చర, స్థిరాస్తులను సమకూర్చు కుంటారు. విజయాల బాటలో నడుస్తారు. ప్రత్యర్థులు సైతం తోడుగా నిలుస్తారు. అవకాశాలు దగ్గరకు వస్తాయి. ద్వితీయార్థంలో మరింత అనుకూలత. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... సల్మాన్‌ఖాన్ పుట్టినరోజు: డిసెంబర్ 27 -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు