నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?
ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్ చాహల్, నటి తానియా ఛటర్జీ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. చాహల్ తనకు వ్యక్తిగతంగా మెసేజులు పంపిస్తున్నాడని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా చాహల్.. ఈమెపై పరువు నష్టం దావా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: కాళ్లకు మెట్టెలతో రష్మిక కఠిన శిక్షణ.. రోజుకు 8 గంటలకు పైనే!)స్వతహాగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ అయిన తానియా ఛటర్జీ.. 'ఫ్లాట్ మేట్స్' అనే ఒక్క సినిమాలో నటించింది. తాజాగా ఈమె మాట్లాడుతూ.. చాహల్ తనకు వ్యక్తిగత మెసేజులు చేసినట్లు స్క్రీన్ షాట్స్ మీడియాకు చూపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు.. చాహల్‌పై విమర్శలు చేశారు. అతడి పీఆర్ టీమ్.. ఈ వీడియోని తీసేయమని కోరారని తానియా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే చాహల్.. ఈమెపై పరువు నష్టం దావా వేశాడు.దీని గురించి స్పందించిన తానియా.. ఈ విషయంలో తనని మాత్రమే ట్రోల్ చేస్తున్నారని, చాహల్‌ని ఎవరూ ఏం అడగట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇంతలా వైరల్ అవుతుందనుకోలేదు. నన్నే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. పరువు పోయింది నాది. కానీ ఇప్పుడు నా మీదే పరువు నష్టం దావా వేశారు. అతడి వ్యక్తిత్వాన్ని నేను తప్పు పట్టాలని అనుకోలేదు. నాకు చాహల్‌పై గౌరవం ఉందని తానియా పేర్కొంది. అయితే ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఈమె చేస్తోందా? అనే సందేహం కలుగుతోంది.చాహల్ విషయానికొస్తే గతంలో నటి, ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది ఆర్జే మహ్వశ్తో చాహల్ జంటగా కనిపించాడు. ఇప్పుడు ఆమె కూడా ఇతడికి దూరమైందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)