breaking news
tade palligudem
-
అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
సాక్షి,పశ్చిమ గోదావరి : స్టార్ హీరో అల్లు అర్జున్‌పై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? నాకు కేవలం మెగా ఫ్యాన్స్ ఉన్నారని మాత్రమే తెలుసు తప్ప అల్లు అర్జున్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని తెలియదు’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.‘తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారు. తన స్థాయి మరచి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేవలం హీరో చిరంజీవి వల్లే అల్లు అర్జున్ను మెగా అభిమానులు హీరోగా గుర్తించారు’ అని తెలిపారు. ‘అల్లు అర్జున్ తానేదో పుడింగి లాగా ఫీల్ అయి.. ఇష్టం అయితే వస్తా.. లేదంటే లేదు అంటే.. ఇక్కడా బతిమాలాడే వాళ్లు ఎవరూ లేరు. అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే ఎంత.. రాకపోతే ఎంత. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచింది తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించలేని అల్లు అర్జున్.. ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం ఏంటి? అని అల్లు అర్జున్ను మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. -
రూ.120 కోట్లతో ‘ఉపాధి’ పనులు
తాడేపల్లిగూడెం రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఉపాధి పనులకు రూ. 120 కోట్లు కేటాయించినట్లు ఎన్ఆర్ఈజీఎస్ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి తెలిపారు. తద్వారా లక్ష మంది కూలీ లకు పని కల్పించనున్నట్లు చెప్పారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏలూరు, తణుకు క్లస్టర్ పరిధిలోని ఉపాధి సిబ్బందితో ఆయన సమీక్షిం చారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పంచాయతీలు స్థలం కేటాయిస్తే డంపింగ్ యార్డు నిర్మాణాలు చేపడతామని తెలిపారు. పని కోసం పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం అడుగంటడానికి ప్రధాన కారణం చెత్తాచెదారమేనన్నారు. దీన్ని అరికట్టడానికే ప్రభుత్వం ఉపాధి పథకంలో డంపింగ్ యార్డుల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందన్నారు. పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థలాన్ని కేటాయించి తీర్మానం చేసి పంపితే నిర్మాణాలు త్వరితగతిన చేపట్టనున్నట్లు చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఆధార్, ఉపాధి పనుల కల్పన అంశాలపై ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్షించారు. సమావేశంలో తణుకు, ఏలూరు క్లస్టర్ ఏపీడీలు సత్యనారాయణ బాబు, సూర్యనారాయణ రెడ్డి, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 8,500 మరుగుదొడ్లు పూర్తి తాడేపల్లిగూడెం రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాకు 75 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 8,500 దొడ్లు నిర్మాణాలు పూర్తిచేసుకున్నట్లు ఎన్ఆర్ఈజీఎస్ పీడీ ఎన్.రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3,250 ఇచ్చేవారమని, ప్రస్తుతం రూ.10,900 చెల్లిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన దొడ్లు ఏప్రిల్ 30 లోపు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఉపాధి పనులు కావాల్సిన వారు ఆయూ గ్రామాల ఫీల్డ్ అసి స్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు తెలియజేస్తే పేర్లు నమోదు చేసుకుని పనులు కల్పిస్తారని చెప్పారు. ఫిబ్రవరి నెలలో 5వేల మందికి పని కల్పిస్తే, మార్చి 7వ తేదీ నాటికి 30వేల మంది చేరారన్నారు. ఈ నెలాఖరు నాటికి 50 వేల మందికి చేరుతుందన్నారు. జిల్లాలో 5,40,000 మంది ఉపాధి కూలీలు ఉంటే 4,00,000 మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. మిగిలిన 1,40,000 మంది ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. నమోదు చేసుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.