superwoman
-
మహిళలకు ప్రత్యేక బీమా పాలసీలు
మహిళ ఆరోగ్యం ఒక కుటుంబానికి ఎంతో అవసరం. ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సాఫీగా ముందుకునడుస్తుంది. అయితే మహిళల ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రసూతి సంబంధిత ఖర్చులు, గైనకాలజీ సమస్యలు, రొమ్ము లేదా గర్భాశయ క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలు వంటి ప్రత్యేకమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలకు ఆరోగ్య బీమా ఒక కీలకమైన ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.అందుకే దేశంలోని అనేక బీమా ప్రొవైడర్లు ఇప్పుడు ఈ అవసరాలను తీర్చే మహిళల కోసమే ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పథకాలను అందిస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఉమెన్ స్పెసిఫిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, అవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ ప్లాన్క్యాన్సర్ సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు కూడా కవరేజీ లభించేలా మహిళల కోసం బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. దీని పేరు ’బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ (ఎస్‌డబ్ల్యూటీ) ప్లాన్’. ఇది సంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన బెనిఫిట్స్, ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ మొదలైన వాటితో ఆర్థిక భద్రతను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ స్మార్ట్ ఉమెన్ ప్లాన్ » గర్భధారణ సంబంధిత సమస్యలను కవర్ చేస్తుంది.» క్లిష్టమైన అనారోగ్యాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.టాటా-ఏఐజీ వెల్సూరెన్స్ ఉమెన్ పాలసీ» హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ అందిస్తుంది.» క్యాన్సర్, స్ట్రోక్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలను కవర్ చేస్తుందిస్టార్ వెడ్డింగ్ గిఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి, వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తూ నవ వధూవరుల కోసం రూపొందించిన ప్రత్యేక పాలసీ ఇది.రెలిగేర్ జాయ్ మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి ప్రయోజనాలు, నవజాత శిశువుల సంరక్షణపై దృష్టి పెడుతుందిన్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ» మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్లాన్ వారికి పూర్తి ఆరోగ్య కవరేజీని కల్పిస్తుంది.రిలయన్స్ హెల్త్ పాలసీ» అదనపు వెల్ నెస్ లక్షణాలతో సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.సరైన ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?ఉత్తమ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.కవరేజ్: పాలసీలో మీకు సంబంధించిన ప్రసూతి, క్రిటికల్ ఇల్ నెస్ కవర్ అయ్యేలా చూసుకోండి.ప్రీమియం ఖర్చు: ఖర్చు, ప్రయోజనాల ఆధారంగా విభిన్న ప్లాన్లను పోల్చి చూడండి.వెయిటింగ్ పీరియడ్: ప్రసూతి కవరేజీ, ముందుగా ఉన్న పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్ చెక్ చేయండి.అదనపు ప్రయోజనాలు: వెల్నెస్ కార్యక్రమాలు, నివారణ సంరక్షణ, ఆసుపత్రిలో చేరిక ప్రయోజనాల కోసం చూడండి. -
సుష్మాకు సూపర్ ఉమన్ ట్వీట్ల వర్షం
భారతదేశం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇక్కడకు రావాలని చాలా ప్రయత్నించింది. కానీ టొరంటోలోని భారత రాయబార కార్యాలయం నుంచి వీసా పొందాలంటే ఆమెకు చుక్కలు కనిపించాయి. సాధారణంగా యూట్యూబ్‌లో తనదైన శైలిలో వీడియోలు పెడుతూ అందరినీ తెగ నవ్వించే లిల్లీ సింగ్.. అలియాస్ సూపర్ ఉమన్ ఈసారి ట్విట్టర్ ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదించింది. తన కష్టాలు తీర్చమని, టొరంటో ఎంబసీ విషయం చూడాలని కోరింది. మధ్యలోప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా తన ట్వీట్లలో ట్యాగ్ చేసింది. టొరంటోలోని రాయబార కార్యాలయంలో వీసా పొందడం చాలా కష్టంగా ఉందని, అసలు ఏమాత్రం ప్రొఫెషనల్‌గా లేదని తెలిపింది. తాను వీసా పొందడానికి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లానో, ఎన్ని కష్టాలు పడ్డానో చూడండంటూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అక్కడి ఉద్యోగులు చాలా తలబిరుసుగా ఉన్నారని, కేవలం ఒక్క ప్రశ్న అడిగినందుకు తన మీద పలు సందర్భాల్లో మండిపడ్డారని తెలిపింది. ఆ తర్వాత ఆమెకు వీసా అయితే వచ్చింది. కానీ తాను ఒక ఏడాది పాటు వీసా కావాలని దరఖాస్తు చేస్తే.. కేవలం మూడు నెలలకు మాత్రమే ఇచ్చారని వాపోయింది. అక్కడున్న వారిలో ఒక్క ఉద్యోగి మాత్రం చాలా స్నేహ పూర్వకంగా ఉన్నారని, తాను ఇంటర్నెట్ సెలబ్రిటీ అని తెలిసిన తర్వాత తనతో కలిసి ఒక ఫొటో కూడా తీసుకున్నారని లిల్లీసింగ్ చెప్పింది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఆమెకు సమాధానం అయితే ఇవ్వలేదు గానీ, మొత్తానికి మూడు నెలలకైనా వీసా మాత్రం ఆమె చేతికి వచ్చేసింది కాబట్టి ఎంచక్కా భారతదేశం రావచ్చు. ఇక్కడ అవకాశం ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని సుష్మా స్వరాజ్‌ను కూడా కలవచ్చు. తాను తొలిసారిగా రాసిన ‘హౌ టు బీ ఎ బాస్: ఎ గైడ్ టు కాన్కరింగ్ లైఫ్’ అనే పుస్తకం ప్రమోషన్ కోసం ఆమె ఈ నెలాఖరులో భారతదేశానికి రానుంది. Love india but gotta say that the consulate of india in Toronto is literally the worst place on earth. Such a disappointment. — Lilly | #BawseBook (@IISuperwomanII) 6 April 2017 For travel to India, the consulate makes acquiring a visa the most difficult task. I hope one day @narendramodi can remedy this. It's sad. — Lilly | #BawseBook (@IISuperwomanII) 6 April 2017 .@SushmaSwaraj just a kind note to make you aware that the Consulate of India in Toronto is extremely difficult and unprofessional. -
ట్వింకిల్ ఖన్నా.. నా 'సూపర్ వుమెన్'
ముంబై: బాలీవుడ్ దంపతులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా ఆయన బంగారం అంటూ ట్వింకిల్ కితాబిస్తే.. నా భార్య నాకు సూపర్ వుమెన్ అంటూ అక్షయ్ మెచ్చుకున్నాడు. ట్వింకిల్‌తో ఉన్న ఫొటోను అక్షయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నిన్నటి తరం బాలీవుడ్ తారలు రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాల గారాటపట్టి ట్వింకిల్ సినిమాలకు గుడ్ బై చెప్పి 2001లో అక్షయ్‌ను పెళ్లి చేసుకుంది. అక్షయ్, ట్వింకిల్ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె.