‘అవతార్’ విమానం
ప్రపంచ దేశాలన్నీ శత్రువులపై దాడి చేసేందుకు చిన్న చిన్న డ్రోన్లపై ఆధారపడుతుంటే.. ఇందుకు భిన్నంగా రష్యా మాత్రం భవిష్యత్లో అతి పెద్ద సూపర్సోనిక్ విమానం తయారు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. యుద్ధ ట్యాంకులు, సైనికులను యుద్ధ ప్రాంతాలకు చేరవేసేందుకు వీలుగా ‘పీఏకే టీఏ’ అనే విమానాన్ని రూపొందించాలని యోచిస్తోంది. దీన్ని వోల్గా నెపర్ కంపెనీకి చెందిన ఓ మేనేజర్ రూపొందించారు. గంటకు 2 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ విమానం ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా 7 గంటల్లో చేరవేసే సామర్థ్యముంటుందని అంచనా. ఇది 200 టన్నుల బరువు మోయగలదట.. విమర్శకులు మాత్రం ఈ ప్రాజెక్టు అసాధ్యమంటున్నారు. మరి రష్యా అనుకున్నది నిజమైతే 2024లో మనం కూడా దీన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు.