breaking news
Summer Surprise
-
జియో నుంచి ధన్ ధనాధన్ ఆఫర్ ఇదే!
ట్రాయ్ ఆదేశాల మేరకు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను ఉపసంహరించుకోవడంతో రిలయన్స్ జియో ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. రూ. 309తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా లిమిట్‌తో 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 84 రోజులు అంటే నెలకు 28 రోజుల చొప్పున 3 నెలలు అన్నమాట. ఇందులో దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. అదే రోజుకు 2 జీబీ డేటా కావాలనుకుంటే అదే 84 రోజులకు రూ. 509తో రీచార్జి చేసుకోవాలి. ఈ రెండు ప్లాన్లు జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే పరిమితం. నాన్ ప్రైమ్ యూజర్లయితే రోజుకు 1 జీబీ డేటా చొప్పున 84 రోజులకు రూ. 408 పడుతుంది. 2 జీబీ కావాలంటే వాళ్లు రూ. 608 చెల్లించాలి. ఇంతకుముందున్న సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ స్థానంలో ఈ ధన్ ధనాధన్ ఆఫర్ వచ్చినట్లు జియో ప్రకటించింది. సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ తమ రెగ్యులేటరీ పరిధిలోకి రాదని, అందువల్ల దాన్ని వెంటనే ఆపాలని ట్రాయ్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీలోగా రూ. 303తో రీచార్జి చేసుకుంటే మూడు నెలలకు పైగా ప్రయోజనాలు ఉండేలా సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను రూపొందించారు. జియో ప్రైమ్ మెంబర్షిప్ కావాలంటే ఒక్కసారి రూ. 99 ఫీజు కట్టాల్సి ఉంటుందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేష్ అంబానీ ఫిబ్రవరిలో ప్రకటించారు. ఏడాది పాటు పలు రకాల డేటా ప్యాక్‌లను ఎంచుకునే అవకాశం ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న సభ్యులకు ఉంటుంది. -
జియో నుంచి మరిన్ని అద్భుత ఆఫర్లు!
న్యూఢిల్లీ : ఇప్పటికే ఉచిత ఆఫర్లతో టెలికాం సెక్టార్ ను హోరెత్తించిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మరిన్ని అద్భుత ఆఫర్లు ఇవ్వడానికి సిద్దమవుతుందట. త్వరలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్లు ప్రకటించనుందని కంపెనీ తన వెబ్ సైట్లో వెల్లడించింది. కొత్త కస్టమర్లకు ఆల్ట్రా-అఫోర్డబుల్ డేటా టారిఫ్స్ తో పాటు, జియో ప్రైమ్ మెంబర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ''త్వరలోనే మేము మా టారిఫ్ ప్యాక్స్ ను అప్ డేట్ చేస్తాం. మరిన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతాం'' అని ముంబాయికి చెందిన ఈ కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ఇస్తున్న పోటీని తగ్గకుండా ఇవ్వడానికి, కొత్త సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి కొత్త టారిఫ్ స్కీమ్ ను తాము లాంచ్ చేస్తామని జియో అధికార ప్రతినిధి కూడా పేర్కొన్నారు. జియో ఇటీవల తీసుకొచ్చిన సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ దెబ్బకొట్టడంతో ఈ ప్రభావం యూజర్ల మీద పడకుండా ఉండేందుకు ఈ ప్లాన్స్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ గడువు 15 రోజుల పొడిగింపుతో పాటు రూ.303 ప్యాక్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలలు ఉచిత సేవలను అందించనున్నట్టు పేర్కొంటూ జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను తీసుకొచ్చింది. కానీ ఆ ఆఫర్ ను వెంటనే విత్ డ్రా చేసుకోమని జియోను ట్రాయ్ ఆదేశించింది. జియో ఆఫర్ల వెల్లువతో ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీలో ఇతర ఆపరేటర్లు చుక్కలు చూస్తున్నారు. సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ చెక్ పెట్టడంతో వారు కొంత ఉపశమనం చెందారు. కానీ వారికి మరింత ఝలకిస్తూ మళ్లీ టారిఫ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేయబోతున్నట్టు ప్రకటించింది.