సుల్తాన్ హాకీ కప్‌లో భారత్ శుభారంభం
జొహర్ సుల్తాన్ కప్ అండర్-21 హాకీ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. జొహర్ బహ్రు (మలేసియా)లో ఆదివారం జరిగిన తొలి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో భారత్ 2-1తో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. భారత్‌కు మూడు పాయింట్లు దక్కాయి.
మ్యాచ్ ఆరంభమయ్యాక 18వ నిమిషంలో రమణ్‌దీప్ చేసి గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఆట ప్రథమార్ధంలో ఇంగ్లండ్ గోల్ చేయలేకపోయింది. విరామం తర్వాత 50వ నిమిషంలో తల్వీందర్ సింగ్ గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యం 2-0కు పెరిగింది. ఎట్టకేలకు 67వ నిమిషంలో ఇంగ్లండ్ ఓ గోల్ నమోదు చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి.