breaking news
Sudarsana Yagam
-
గజ్వేల్‌లో సుదర్శనయాగం
పాల్గొన్న భగీరథ పథకం వైస్ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ దంపతులు గజ్వేల్ రూరల్: మిషన్ భగీరథ పథకం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం గజ్వేల్ పట్టణంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సుదర్శన యాగాన్ని నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మణ్ గార్డెన్స్‌లో ఉదయం 8నుంచి 10:30 వరకు సుమారు రెండున్నర గంటలపాటు ఐదుగురు రుత్వికులు యాగాన్ని నిర్వహించారు.మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి దంపతులు ప్రారంభం నుంచి పాల్గొనగా పూర్ణాహుతికి ముందు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ‘మిషన్ భగీరథ’ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిలు మాట్లాడుతూ... తెలంగాణ ఆడబిడ్డ నెత్తిన బిందె పెట్టుకొని రోడ్డెక్క కూడదనే ఉద్దేశంతో చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ప్రాజెక్టు పనులు గజ్వేల్ నియోజకవర్గంలో పూర్తయి ఇంటింటికి నీళ్లు రానున్న నేపథ్యంలో అంతా శుభం జరగాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం కళకళలాడాలని నాడు సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహించినట్టుగానే, ఇప్పుడు అంతా శుభం జరగాలనే కాంక్షతో సుదర్శనయాగం చేపట్టడం జరిగిందన్నారు. ప్రధాని పర్యటనలో పాల్గొనాల్సి ఉన్నందున సీఎం కేసీఆర్ ఈ యాగానికి రాలేకపోయారని తెలిపారు. ఈ యాగ ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ నరసింహన్‌లకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ దంపతులతోపాటు జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, వాటర్‌గ్రిడ్ ఈఈ రాజయ్య, నగర పంచాయతీ వైస్ చైర్మన్ దుంబాల అరుణ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్‌లో కేసీఆర్ సుదర్శన యాగం?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరో యాగం తలపెట్టారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు సెప్టెంబర్ 7న గజ్వేల్‌లో సుదర్శన యాగం చేయాలని సీఎం అనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తెలియజేశారని సమాచారం. ఆ రోజు ఉదయం పూట యాగం నిర్వహించి, మధ్యాహ్నం ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా నియోజకవర్గానికి తాగునీటిని అందించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమాచారం అధికారికంగా తెలియకున్నా.. పార్టీ వర్గాల్లో మాత్రం యాగంపై చర్చ జరుగుతోంది.