breaking news
Step up
-
ఇండియన్ టెకీలకు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఒకవైపు దేశీయ ఐటీ కంపెనీలు దేశీయ టెకీలకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంటే.. దిగ్గజ కంపెనీలకు భారతీయ టెకీలకు తీపికబురు అందించాయి. తాజా నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, ఒరాకిల్, ఫేస్బుక్, గూగుల్ ఇండియా లాంటి టెక్మేజర్లు భారతీయ సాఫ్ట్ వేర్లను నియమించుకోనున్నాయి. తద్వారా భారతీయ సమాచార సాంకేతిక (ఐటి) సర్వీసు ప్రొవైడర్లతో టాలెంట్ వార్‌కు దిగాయని ఓ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా ఆధారిత సంస్థలు తమ సొంత మార్కెట్లో అభద్రత పెరుగుతున్నప్పటికీ, ప్రపంచ ప్రత్యర్థుతో పోటీ కారణంగా ఇండియన్ ఐటీ నిపుణులను ఎంచుకుంటున్నాయట. ఇందులో భాగంగానే ఫేస్బుక్ , లింక్డ్ ఇన్, తదితర కంపెనీలు కొన్ని గత నాలుగు నెలలలో భారత్ లో తమ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు చేసినట్టు సమాచారం. భారతదేశంలో ప్రపంచ అంతర్గత కేంద్రాలు (జిఐసిలు) భారత టెకీల ఉద్యోగాల కల్పనలో పెద్ద పాత్ర పోషిస్తాయని బైన్ & కంపెనీ ఇటీవల ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. భారతీయ జిఐసిలు తదుపరి మూడు నుండి ఐదు సంవత్సరాల్లో ప్రపంచ సి-స్థాయి అధికారుల ఫార్చ్యూన్ 1,000 కంపెనీల్లో చోటు సంపాదించుకుంటాయని అగ్రశ్రేణి పెట్టుబడి ప్రాధాన్యతల మరింత చురుకైన పాత్రను పోషిస్తాయని నివేదించింది. అలాగే ఈ సంస్థల్లో ఎక్కువ సీనియర్ నాయకులు, ప్రత్యేకంగా సీఈవో లకు దిగువస్థాయి ఉద్యోగులు బారత్వెలుపలి ఈ జీఐసీలను నిర్వహించనున్నారని ఈ నివేదిక తెలిపింది. డిజిటల్ టెక్నాలజీలో భారతదేశం ప్రయోగాత్మక ప్రదేశంగా ఉందని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ,పరిశోధనా సంస్థ జినోవ , మేనేజ్మెంట్ మేనేజర్,ఆనంద్ సుబ్రమణ్యం చెప్పారు. ఈ సంస్థల భారతీయ డెలివరీ కేంద్రాలు ప్రపంచ వనరులతో సమానంగా ఉన్నాయని, వారు పోటీని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలకు చెందిన భారత్ కేంద్రాలు తమ పేరెంట్ సంస్థ ల కొత్త సామర్థ్యాలను ఏర్పరుచుకునేందుకు, సముచితమైన సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో సమర్థతను పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయని కోరుతున్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇ-కామర్స్, డిజిటల్ టెక్నాలజీ, రిటైల్, సప్లయ్ ఛైన్ సాంకేతిక పరిజ్ఞానాలు, కోర్ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో నెట్ వర్కింగ్, వర్చ్యువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంటైనర్సిజేషన్, విశ్లేషణలు, బిగ్ డేటా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో నియామకాలను చేపట్టినట్టు లాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ జేమ్స్ బ్రాండ్ట్ తెలిపారు. భారత్ లో వెయ్యిమంది ఉద్యోగులతో ఉన్న సంస్థ తమ ఐటీ మరియు విశ్లేషణ సామర్థ్యాలను , వృద్ధి వ్యూహాన్ని పెంచుకోనున్నట్టు తెలిపింది. టార్గెట్ , లోవ్స్ వంటి ఇతర అమెరికా ఆధారిత సంస్థలు మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా విశ్లేషణ, నెట్వర్కింగ్ వంటి రంగాల్లో భారతదేశంలో ఇంజనీర్లను నియమించుకుంటాయి. భారతదేశంలో 2,500 మంది ఉద్యోగులను కలిగి ఉన్న టార్గెట్ ఇండియా టెక్నాలజీ, మార్కెటింగ్, సరఫరా చెయిన్, యానిమేషన్ వంటి నిపుణులను నియమించుకోనుంది. జావా మరియు ఓపెన్ సోర్స్ సామర్థ్యాలతో, మెషిన్ లెర్నింగ్, న్యూరో-లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో నైపుణ్యం కలిగినవారిని తాము ఎంపిక చేయనున్నట్టు టార్గెట్ ఇండియాలో హెచ్ఆర్ హెడ్ షాలిని నటరాజ్ తెలిపారు టెక్నాలజీకి అదనంగా, కంప్యూటర్లో రూపొందించబడిన యిమేజరీ అండ్ యానిమేషన్లో భారతదేశం ప్రతిభను కలిగి ఉందనీ, తమ మార్కెటింగ్ బృందం సీజీఐ సామర్ధ్యాలను విస్తరించ నుందన్నారు. కాగా అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1 బీ వీసాల కొత్తనిబంధనల నేపథ్యంలో దేశీయ ఐటి దిగ్గజాలు అమెరికా టెకీల నియామకాలపై దృష్టి సారించాయి. దేశీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
మెగా లైట్నింగ్
షేక్ చేసే రాకింగ్ మ్యూజిక్.. దద్దరిల్లే హైవాట్స్ సౌండ్.. ఎనర్జిటిక్ బీట్స్‌కు మనసు పారేసుకోని కుర్రాళ్లెవరుంటారు. క్లబ్ అయినా.. పబ్ అయినా.. వేదిక వేరేదైనా.. మస్తీ బీట్ వినిపిస్తే చాలు.. అక్కడ వాలిపోతారు. వారి హ్యాపీనెస్‌ను టాప్అప్ చేస్తూ.. మస్తీకి మరింత టచప్ ఇస్తూ.. ఫ్లోర్ అదిరేలా స్టెప్పులేయించి.. మెరిపించి.. మైమరిపించడానికి నగరానికి వస్తున్నారు ఫేమస్ సంగీత ద్వయం ‘మిడివాల్ పండిడ్జ్’. తమ లేటెస్ట్ ఆల్బమ్ ‘లైట్’ లాంచ్ టూర్లో భాగంగా దేశంలోని మెట్రో నగరాల్లో ప్రదర్శనలిస్తున్నారు. హైదరాబాద్ యూత్ పల్స్‌ను క్యాచ్ చేసి.. మెగా బీట్స్‌ను ఇంజక్ట్ చేసేందుకు ఫిక్సయ్యారు. ఈ రాకింగ్ ద్వయం అందించే జానీవాకర్ ‘స్టెప్అప్’ శనివారం సిటీని ఊపేయడానికి సిద్ధంగా ఉంది. ఎవరీ పండిడ్జ్! ఢిల్లీకి చెందిన మ్యుజీషియన్స్ గౌరవ్ రైనా, తపన్ రాజ్ కలసి ఏర్పాటు చేసిన ఫ్యూజన్ గ్రూపే ‘మిడివాల్ పండిడ్జ్’. ఉత్తర భారత దేశ సంప్రదాయ సంగీతానికి పాశ్చాత్య హంగులద్ది కంపోజ్ చేస్తున్న వీరి ఆల్బమ్స్‌కు దేశవ్యాప్తంగా మాంచి క్రేజ్. ధోల్, తంబి, సరోద్, సంతూర్, ఢోలక్, తబలా, తంబురా, సితార్, సారంగి వంటి భారతీయ సంప్రదాయ వాయిద్యాలు వీరి పాటల్లో ఎక్కువగా వినిపిస్తాయి. అదే సమయంలో వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎఫెక్టివ్‌గా ఉపయోగించి నేటి తరాన్ని ఆకట్టుకోవడంలో వీరు సిద్ధహస్తులు. ఇప్పటి వరకు వీరు రిలీజ్ చేసిన ‘మిడివాల్ పండిడ్జ్, లెట్స్ ఎంజాయ్, మిడివాల్ టైమ్స్, మిడివాల్ పండిడ్జ్ రీమిక్స్, హలో హలో’ ఆల్బమ్స్ విశేష ఆదరణ పొందాయి. సిటీలో ఇవ్వనున్న ప్రదర్శనలో స్టెప్అప్ చాలెంజ్ విన్నర్ విరాజ్ మోహన్‌తో కలిసి సంగీత లహరిని అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫెంటాస్టిక్ లైవ్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి..! వేదిక: ఎయిర్ కేఫ్ లాంజ్, సాయివాసవి టవర్స్, 6వ అంతస్తు, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్ సమయం: ఈ నెల 18 రాత్రి 9 గంటలకు