Stanford business school
-
జీవిత సాఫల్యానికి 'మూడు పాఠాలు'
రిషి సునాక్: నేను ప్రాథమికంగా సంఖ్యల మనిషిని. గణితం, గణాంకాలు, కోడింగ్ ఉపయోగించి ఫైనాన్స్ రంగంలో పెట్టుబడి వ్యూహాలు రూపొందించే నిపుణుడిని. అది మా మామగారు ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తితో నా అనుబంధం బలపడటానికి సహాయపడింది. ‘‘మేం దేవునిపై విశ్వాసం ఉంచాం. డేటాను ఒక చోటికి చేర్చడమే మిగిలిన వారందరి కర్తవ్యం’’ అన్నదే ఆయన నమ్మే మంత్రం. నాదీ అదే బాట. డేటా, దాని విశ్లేషణ పట్ల నాకు అపారమైన గౌరవం. స్టాన్ఫోర్డ్ విడిచిపెట్టాక, నేను నిర్వహించిన ప్రతి పాత్రలోనూ అది నన్ను విజయుడిని చేసింది. డేటా, దాని ననుసరించి తీసుకునే డెసిషన్లు నాకు చాలా ఉపకరించాయి.1. అంతరాత్మ చెప్పినట్లు కూడా నడుచుకోండి!నేను ఇక్కడ నేర్చుకున్న టెక్నిక్కులు, పదిహేనేళ్ళ తర్వాత, ఎస్.ఐ.ఆర్. మోడళ్ళను అర్థం చేసుకోవడంలో సాయపడ్డాయి. ఎస్ అంటే సస్కెప్టిబుల్. వ్యాధికి ఇంకా లోనుకానివారు. దాని బారినపడటానికి అవకాశం ఉన్నవారు. ఐ అంటే ఇన్ఫెకు‡్ష్యవస్. వ్యాధి బారినపడి, దాన్ని ఇతరులకు వ్యాపింపజేసే స్థితిలో ఉన్నవారు. ఆర్ అంటే రికవర్డ్/రిమూవ్డ్. వ్యాధి నుంచి కోలుకుని, శాశ్వత రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నవారు. వారు మరోసారి వ్యాధికి లోనయ్యే అవకాశం లేదు. వ్యాధితో మరణించినవారు కూడా ఇదే వర్గంలోకి వస్తారు. మహమ్మారులు ప్రబలినపుడు జనాభాను ఈ మూడు వర్గాలుగా విభజించి వ్యాధి వ్యాప్తికి ఉన్న అవకాశంపై లెక్కలు కడుతూంటారు. కోవిడ్ కారణంగా నెలల తరబడి లాక్డౌన్లతో బాధపడ్డాక, 2021లో ఒమిక్రాన్ అంటూ కోవిడ్‌లో కొత్త రకం మొదలైంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఆ వైరస్, బ్రిటన్‌లో విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. నేను అపుడు బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో, అమెరికా పర్యటనలో ఉన్నాను. ఆందోళన కనబరుస్తూ, హఠాత్తుగా వచ్చిన ఫోన్ కాల్‌తో, పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని బ్రిటన్‌కు వెళ్లిపోయాను. మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలంటూ ఒత్తిడి వస్తోంది. డేటా పట్ల సరైన అవగాహన ఉన్నవాడిని కనుక సరిపోయింది. లేకపోతే, నేనూ అదే రకమైన అభిప్రాయాన్ని బలపరచేవాడినేమో. దక్షిణాఫ్రికాలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరాన్ని డేటా సూచించింది. అది నాలో ప్రశ్నలను రేపింది. ‘కానీ’ ఏమైనా అయితే అనే సందేహమూ తొలుస్తోంది. డేటా సరైన పరిష్కారాన్ని సూచిస్తుందని నమ్మేవాడినే కానీ, నేను ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే, డేటా అన్ని వైపుల పరిస్థితిని చూపలేదని ఆషా(అక్షత) నేను గ్రహించేటట్లు చేసింది. లాక్డౌన్ విధిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయి. నాడు 2021 డిసెంబర్లో ఎటూ తేల్చుకోలేని స్థితి. అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే 50 శాతం మంచిదనిపిస్తుంది. వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం 50 శాతం మంచిదనిపిస్తుంది. కేవలం డేటా విశ్లేషణపైనే ఆధారపడి నిర్ణయాలు తీసుకునే పక్షంలో ఆ పని ఎవరైనా చేయగలరు. నాయకుని బల్ల దాకా రానక్కరలేదు. కనుక, డేటాతోపాటు అంతఃకరణపైన కూడా ఆధారపడాలి. అంతరాత్మ ప్రబోధాన్ని కూడా వినాలి. రెండింటిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అక్షతా మూర్తి: రెండవ పాఠం ఆదర్శవాదంతో కనే పెద్ద పెద్ద కలలకు, ఆచరణవాదంతో వేసే చిన్న చిన్న అడుగులకు సంబంధించినది. దీన్ని నేను రిషి నుంచి నేర్చుకున్నాను. నేను ధనికులకు–పేదలకు మధ్య అగాధం ఎక్కువగా ఉన్న దేశంలో పెరిగాను. నా తల్లితండ్రులు విస్తృతమైన మార్పు తీసుకురావాలనే స్ఫూర్తిని అందించారు. స్టాన్‌ఫోర్డ్‌లో విధిగా రాయవలసిన మొదటి వ్యాసంలో విద్య, ప్రభావం, సేవల గురించే ఎక్కువ చెప్పాను. మిగిలినవాటన్నింటికన్నా ఆదర్శమే సర్వోత్తమమైనదనే అభిప్రాయం ఉండేది. దానికోసం ఏం చేయదలచుకున్నావు అనే ప్రశ్న రిషి నుంచి ఎదురైంది. వాస్తవికతతో ముడిపెట్టని ఆదర్శాల వల్ల ప్రయోజనం శూన్యమని రిషి అభిప్రాయం. బాహ్య ప్రపంచంలో దైనందిన జీవితంలో స్పష్టంగా కనిపించే చిన్ని అడుగుల ద్వారానే పెద్ద స్థాయిలో రూపాంతరీకరణ సాధ్యమవుతుందని రిషి నుంచి నేర్చుకున్నాను. ఆదర్శాలను వల్లిస్తే సరిపోదు. ఆ దిశగా చిన్న అడుగులైనా వేయడం ప్రారంభించామా లేదా అన్నదే ముఖ్యం.2. ఆచరణాత్మక దృక్పథమూ అవసరమే!జీవితాలను మార్చాలన్నా, సామాజిక చేతనను పెంచాలన్నా చదువు ద్వారానే సాధ్యమని మా ఇద్దరి అభిప్రాయం. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్నపుడు, ‘లెసన్స్ ఎట్ 10’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అది బ్రిటన్ నలుచెరగులా యువతను విద్యావంతులను చేసి, వారిలో స్ఫూర్తిని నింపేందుకు చేపట్టిన కార్యక్రమం. రిషి, నేను కలసి ‘రిచ్మండ్ ప్రాజెక్టు’ను కూడా ప్రారంభించాం. గణితాన్ని చూసి బెదిరిపోకుండా యువతలో ధైర్యం నింపడం, వారిలోని సంఖ్యా పరిజ్ఞాన పాటవాలకు మెరుగులు దిద్దడం, ఫైనాన్షియల్ అక్షరాస్యతను పెంపొందించడం ఆ కార్యక్రమం లక్ష్యం. ఆచరణాత్మక దృక్పథం నేను ఒకప్పుడు అమాయంగా భావించినట్లుగా, అది ఆదర్శవాదానికి వ్యతిరేకమైనది కాదు. అది ఆదర్శానికి తోటి భాగస్వామి లాంటిది. పెద్ద పెద్ద కలలను సాకారం చేసుకునేందుకు ఆ రెండూ అవసరమే. రిషి సునాక్: ఫలితం గురించి ఎక్కువగా ఆందోళన చెందకపోవడం మేం నేర్చుకున్న ముఖ్యమైన మూడవ పాఠం. ఈ భావనను సంస్కృతంలో ‘ధర్మం’గా పిలుస్తారు. మనం చేసే పనుల నుంచి ఫలితాలను ఆశించకుండా మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం. నాయకత్వం వహిస్తున్నప్పుడు విజయాలు, వైఫల్యాలు రెండింటినీ చవి చూడవలసి వస్తుంది. ఆ మాటకొస్తే, మనం ఏ రంగంలో ఉన్నా దూషణ భూషణలను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్లిప్తంగా ఎవరి పని వారు చేసుకుపోవాలని నేను చెప్పడం లేదు. విమర్శల పట్ల భయంతో కాక, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాననే భావనతో ఏ పనైనా చేయాలి. 3. విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి!ఆషా నేనూ కలసి గడ్డు కాలాన్ని ఎదుర్కోవడంలో ఈ విద్యుక్త ధర్మ భావన ఎంతో సహాయపడింది. కన్సర్వేటివ్ పార్టీ నాయకునిగా, ప్రధాన మంత్రిగా తిరిగి పరిణమించే ప్రయత్నంలో 2022 వేసవిలో నేను విఫలమయ్యాను. ఎంతో శ్రమపడ్డ తర్వాత కూడా ఫలితం అనుకూలంగా రాకపోవడం బాధ పెట్టింది. కానీ, తర్వాత, అదీ మంచికే అనిపించింది. ఒక సాధారణ పార్లమెంట్ సభ్యునిగా చేయవలసిన పనులపై మరింత దృష్టి పెట్టగలిగాను. ఒక భర్తగా, తండ్రిగా కుటుంబానికి మనుపటికన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగాను. ఆరు వారాలు గడిచాక, నాకన్నా, ముందు ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేశారు. పౌండ్ విలువ వేగంగా పతనమవడం ప్రారంభించింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకుంది. పరిస్థితులను చక్కదిద్దడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ, క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడే దేశానికి సహాయపడటం ధర్మమని ఆషా గుర్తు చేసింది. రెండు రోజుల తర్వాత, ప్రధాని నయ్యాను. ప్రజాహిత రంగంలోనే కాదు ఎక్కడైనా సరే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించేందుకు ముందుకు రావాలి. అంతకుముందున్న పరిస్థితులను లెక్కలోకి తీసుకోకూడదు. అహంకారానికి తావు ఇవ్వకూడదు. జీవితాన్ని సఫలం చేసుకునేందుకు అదొక్కటే మార్గం. మనం సాధ్యమని భావిస్తున్న దానికన్నా ఎక్కువగా సాధించడానికి అది తోడ్పడుతుంది. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కాపురముండిన మొదటి స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్లం మేమే. కానీ, ఒక ముఖ్యమైన సమయంలో, ఒక ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తించిన చివరివాళ్ళం మేమే కాకూడదని మా ఇద్దరి కోరిక. -
మనషు దోచుకున్నాడు
గీతం యూనివర్శిటీ క్యాంపస్ సందడిగా ఉంది. బీటెక్ క్లాసు అప్పుడే అయిపోయింది. విద్యార్థులంతా బయటికొచ్చారు. ఓ కుర్రాడు మాత్రం బస్సెక్కిఅనకాపల్లిలో దిగాడు. తిన్నగా తండ్రి నడుపుతున్న మిఠాయి దుకాణానికెళ్లాడు. తండ్రిని ఇంటికి పంపి వ్యాపారం చూసుకున్నాడు. మర్నాడే విమానంలో అమెరికాకు బయల్దేరాడు. సిలికాన్ వ్యాలీలో స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన బిజినెస్ మీట్‌కు హాజరయ్యాడు. ప్రమాదాల నుంచి అంధుల్ని అప్రమత్తం చేసేందుకు తాను రూపొందించిన షూను పరిచయం చేశాడు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ముగిసింది. అంతా నిశ్శబ్దం. అందరి ముఖాల్లో ఆశ్చర్యం. అభినందనల వర్షం. అమెరికాలోని నోబెల్ గ్రహీతలు, 120 ప్రముఖ వ్యాపార సంస్థల సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టుల ప్రశంసలందుకున్న ఆ కుర్రాడు విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన ఇంకూలు కృష్ణ సాయి. అనకాపల్లిలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన 21 ఏళ్ల ఈ యువ మేధావి అమెరికా వరకూ సాగించిన విజయ ప్రస్థానానికి అక్షర రూపమిది. విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా అంధులకు చేతికర్ర తప్ప మరే సౌకర్యం లేదు. కాళ్లకడ్డంగా కాలసర్పం ఉన్నా తెలుసుకోలేరు. బండరాయి దొర్లుకొస్తున్నా తప్పుకోలేరు. తోడుంటే తప్ప రోడ్డు దాటలేరు. వాళ్ల కోసం ఏదైనా చేయాలి... కానీ ఎలా?... విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) చదువుతున్న కృష్ణ సాయి నిరంతరం మధనపడేవాడు. అప్పుడే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చన్న సిద్ధాంతాన్ని పరిశీలించాడు. దాన్ని అభివృద్ధి చేసి అంధుల కోసం ప్రత్యేకంగా షూ తయారు చేయాలి. అది ధరిస్తే ఎదురుగా ఏదైనా ఉంటే తెలుసుకోగలగాలి... ఇదే లక్ష్యంతో కృష్ణసాయి పరిశోధన ప్రారంభమైంది. అది కార్యరూపం దాల్చేందుకు రెండేళ్లు పట్టింది. అడ్డొస్తే అప్రమత్తం చేసే ‘టపార్చ్’ మార్కెట్లో దొరికే యాక్షన్ షూకి సెన్సర్ అమర్చాడు. షూ అడుగు భాగంలో కాస్త వెడల్పుగా ఉండే సోల్ ఏర్పాటు చేశాడు. దాన్లో చిప్‌ను, అల్యూమినియంతో తయారైన స్టిక్‌ను అమర్చాడు. అంధులు షూ ధరించి నడిచేటప్పుడు ఎదురుగా ఏదైనా వస్తువు ఉంటే వెంటనే సెన్సర్ పసిగడుతుంది. ఆ సమాచారాన్ని షూ అడుగు భాగంలో అమర్చిన చిప్‌కు తెలియజేస్తుంది. చిప్ మోటార్ ద్వారా యాక్టివేట్ అయిన అల్యూమినియం స్టిక్ లోపలి నుంచి కాలిని సున్నితంగా తట్టి అప్రమత్తం చేస్తుంది. రెండు సెంటీమీటర్ల నుంచి 4 మీటర్ల వరకూ ఏ వస్తువున్నా హెచ్చరిస్తుంది. షూను డిజైన్ చేసేటప్పుడు అనకాపల్లికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గున్నేశ్వర్ సాయి, విశాఖలోని అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉష దాట్ల సలహాలు, సూచనలు తీసుకున్నాడు. ఎలక్ట్రానిక్స్, కోడింగ్‌కు గీతం ల్యాబ్ టెక్నీషియన్ స్వరూప్ సహకరించారు. షూ ప్రాజెక్టుకు ‘టపార్చ్’ అని పేరు పెట్టాడు. ఆంగ్లంలో Tap అంటే తట్టడం... Arch అంటే వంపు. కాలి పాదాన్ని పక్కనుంచి చూస్తే ఒంపులా కనిపిస్తుంది. ఆ భాగంలో తట్టి అప్రమత్తం చేస్తుంది కాబట్టి రెండు పదాలను కలిపి ‘టపార్చ్’ అని నామకరణం చేశాడు. స్టాండింగ్ ఒవేషన్ ఖరగ్‌పూర్ ఐఐటీ జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రోడక్ట్ డిజైనింగ్ పోటీలకు తొలిసారిగా షూ ప్రాజెక్టును పంపించాడు. పోటీలకు దేశవ్యాప్తంగా అందిన 200కు పైగా ప్రాజెక్టుల్లో టాప్ 5 డిజైనర్‌గా కృష్ణ సాయి ఎంపికయ్యాడు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రొటేసియా అంతర్జాతీయ సదస్సుకు రోటరాక్ట్ సభ్యుడి హోదాలో హాజరయ్యాడు. ‘నేను ప్రదర్శించిన షూ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం మరచిపోలేని అనుభవం’ అన్నాడు కృష్ణసాయి. టాప్ టెన్‌లో ఒకడు భారత సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఫిక్కీ, ఇండో-అమెరికన్ సైన్స్ టెక్నాలజీ ఫోరం, స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్, ఐసీ-2 ఇనిస్టిట్యూట్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్ (ఐఐజీపీ)ను నిర్వహించారు. దీనికి భారతదేశ వ్యాప్తంగా 2500 ప్రాజెక్టులు అందాయి. వాటిలో అత్యుత్తమంగా నిలిచిన 50 ప్రాజెక్టుల్లో కృష్ణసాయి షూ ప్రాజెక్టు కూడా ఉండటంతో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ గోవాలో నిర్వహించిన వారం రోజుల శిక్షణకు ఎంపికయ్యాడు. ఫిక్కీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో టాప్ 10లోనూ స్థానం దక్కించుకున్నాడు. ఈ విజయంతో వాషింగ్టన్‌లోని కాస్మోస్ క్లబ్ సదస్సుకు, కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో సెప్టెంబర్ 8న స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించే బిజినెస్ మీట్‌కు ఆహ్వానం అందుకున్నాడు. యువ మేధావికి నోబెల్ గ్రహీతల అభినందన ఫిక్కీ ఎంపిక చేసి పంపిన టాప్ టెన్ భారతీయ ప్రతినిధుల బృందంలో 21 ఏళ్ల కృష్ణసాయిని చూసి వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ముచ్చటపడ్డారు. అమెరికాలోని నోబెల్ బహుమతి గ్రహీతల ముందు ప్రదర్శించిన షూ ప్రాజెక్టుకు ప్రశంసలు దక్కాయి. ఆఖరుగా సిలికాన్ వ్యాలీలో బిజినెస్ మీట్‌కు హాజరయ్యాడు. అంధుల కోసం షూ తయారు చేయడం అమెరికన్ వ్యాపారవేత్తలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు కృష్ణసాయికికొన్ని వ్యాపార మెళకువలు నేర్పారు. అంధుల షూ తయారీకి కంపెనీ ఏర్పాటు చేస్తే సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నాన్న కల నెరవేరుస్తా ‘‘అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది కదా... నీ కల సాకారమైనట్టేనా?’’ అని కృష్ణసాయిని ప్రశ్నిస్తే ‘‘ఇదంతా నా తండ్రి నాగేశ్వరరావు ఘనతే. ఆయన చదివింది ఆరో తరగతి. కానీ నన్ను అష్టకష్టాలు పడుతూ చదివించారు. నన్ను ఉన్నత స్థాయిలో చూడాలన్న ఆయన కల నెరవేరుస్తా. అంధులకు రూ.1500 నుంచి రూ.1800 మధ్యలో షూ తయారు చేసి అందిస్తా. అదే నా లక్ష్యం’’ అన్నాడు. అల్ఫ్రెడ్ లార్డ్ వైట్ హెడ్ చెప్పినట్టు ‘గొప్ప స్వాప్నికుల కలలెప్పుడూ నిజం మాత్రమే కావు. అవి నిజాన్ని అధిగమిస్తాయి’. - ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు) సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ‘గీతం’ ప్రోత్సాహకం ‘కృష్ణసాయి లాంటి విద్యార్థి మా విశ్వవిద్యాలయంలో చదువుకోవడం గర్వకారణం. అతని ప్రతిభకు గుర్తింపుగా మా చైర్మన్ ఎం.వి.వి.ఎస్.మూర్తి రూ.1.4 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు’.. అని గీతం విశ్వవిద్యాలయం పీఆర్వో, అసిస్టెంట్ ప్రొఫెసర్ నండూరి నరసింహం చెప్పారు. -
ఫోర్బ్స్ మిదాస్ లిస్ట్‌లో 11 మంది భారత-అమెరికన్లు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ వంద ఉత్తమ వెంచర్ ఇన్వెస్టర్ల వార్షిక జాబితాలో 11 మంది భారత-అమెరికన్లకు చోటు దక్కింది. వీరంతా స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టి, ఆ తర్వాత తమ వాటాలను భారీ లాభాలకు అమ్మేశారని ఫోర్బ్స్ వివరించింది. మిదాస్ లిస్ట్ పేరుతో ఈ జాబితాను మ్యాగజైన్ రూపొందించింది. ముఖ్యాంశాలు... ఈ జాబితాలో సిక్వియా క్యాపిటల్ భాగస్వామి జిమ్ గోయెట్జ్ అగ్రస్థానంలో నిలిచారు. క్లౌడ్ ఆధారిత ఆర్థిక సేవలు, మానవ వనరుల సాఫ్ట్వేర్ సంస్థ, వర్క్‌డేకు కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భారత-అమెరికన్ అనీల్ భూస్రీ 17వ స్థానంలో నిలిచారు. ట్విట్టర్, మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ టంబ్లర్, పర్సనలైజ్డ్ మ్యాగజైన్ ఫ్లిప్బోర్డ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్సైట్ వెంచర్ పార్ట్నర్స్ ఎండీ దేవన్ పరేఖ్ 22వ స్థానాన్ని సాధించారు. ఇంకా ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర భారత-అమెరికన్లు.. ప్రమోద్ హాకే(27వ స్థానం), నవీన్ చద్దా(30), నీరజ్ అగర్వాల్(37), సమీర్ గాంధీ(41), అషీమ్ చందన(55), వెంకీ గణేశన్(57), వినోద్ ఖోస్లా(63), సలీల్ దేశ్‌పాండే(67), గౌరవ్ గార్గ్(86).


