breaking news
Srivari acquired service ticket
-
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను మంగళవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందాక ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు, వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో ఆగస్టు నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు, తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 69,870 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమరి్పంచారు. దర్శన టికెట్లు లేని వారికి స్వామివారి దర్శనం 24 గంటల సమయం పడుతోంది. -
లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్ (కంప్యూటర్ ర్యాండమ్)లో కేటాయించే పద్ధతిని శనివారం తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు ప్రారంభించారు. 2010 నుంచి ఇప్పటివరకు ఇదే లక్కీడిప్ పద్ధతిలో తోమాల, అర్చన, అభిషేకం, మేల్‌ఛాట్ వస్త్రం వంటి అరుదైన ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తున్నారు. తాజాగా నిత్యసేవలైన సుప్రభాతం (100 టికెట్లు), కల్యాణోత్సవం (80), వారపు సేవలైన విశేషపూజ (సోమవారం- 125), సహస్ర కలశాభిషేకం (మంగళవారం-25), తిరుప్పావడసేవ (గురువారం-25), నిజపాద దర్శనం ( శుక్రవారం-100) టికెట్లు కేటాయించారు. టికెట్లను పారదర్శకంగా కేటాయించడంతోపాటు గంటల తరబడి క్యూలో నిలబడకుండా ఉండేందుకు లక్కీడిప్ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జేఈవో శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో వేణుగోపాల్ చెప్పారు.