breaking news
SRCC
-
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. యువత, విద్యార్థుల సమస్యలపై మాట్లాడాల్సిన వేదికపై.. ప్రశ్నించే యువతను ‘దిమాగీ నక్సల్స్’ అంటూ ముద్ర వేయడం ఏమిటంటూ సీజేపీ తీవ్రంగా మండిపడింది. విద్య, ఉద్యోగాలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రధాని మాట్లాడాల్సిందిపోయి.. విమర్శకులను టార్గెట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శించారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో ఒకటైన SRCCలో యువతను ‘దిమాగీ నక్సల్స్’గా పేర్కొనడం ప్రధానమంత్రి చేయగలిగే అత్యంత అవమానకరమైన పని అంటూ విమర్శించారు. ప్రధాని యువతకు ఆశలు కల్పించాలి.. ప్రశ్నలు అడుగుతున్నందుకు వారిని నిందించకూడదు అని దాస్ వ్యాఖ్యానించారు. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. SRCCలోనే ఉపాధ్యాయులు మెడికల్, చైల్డ్కేర్ లీవ్ వంటి అంశాలపై ఆందోళన చేయాల్సి వస్తోందని.. కళాశాలలో మౌలిక వసతుల పరిస్థితి, విద్యార్థులపై పెరుగుతున్న పోటీ ఒత్తిడి వంటి అంశాలను ప్రధాని ప్రస్తావించాల్సిందని విమర్శించారు.మరోవైపు.. ఆశుతోష్ రంకా కూడా ప్రధాని ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. SRCC శతాబ్ది వేడుకల వంటి వేదికపై విద్య, ఉపాధి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే 20 ఏళ్లలో భారత్ ప్రపంచంలో తన స్థానాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలన్న అంశాలపై ప్రధాని మాట్లాడాల్సిందని అన్నారు. కానీ అందుకు బదులుగా ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలకు దిగారని ఆరోపించారు.Wow. Going to one of India’s premier colleges and once again branding a young, questioning generation as “Dimagi Naxals” has got to be among the most shameful things a Prime Minister can do. And on Teacher’s Day.He could have spoken about why SRCC’s own teachers have had to… https://t.co/U8EMRtikcu— Saurav Das (@SauravDassss) September 5, 2026అసలు మోదీ ఏం అన్నారు?SRCC శతాబ్ది వేడుకల్లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను ప్రస్తావించిన ‘దిమాగీ నక్సల్స్’ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. తాను ‘దిమాగీ నక్సల్’ అంటూ చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఆ భావజాలానికి మద్దతిస్తున్నవారు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారని మోదీ అన్నారు. తన వ్యాఖ్యలను విమర్శిస్తున్నవారి తీరును ఉద్దేశిస్తూ.. ప్రజలు కూడా వారి అసలు రంగును గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సీజేపీ విమర్శలకు కారణమయ్యాయి. అయితే మోదీ ప్రసంగంలోని ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా హాట్టాపిక్గా మారాయి. విద్యార్థుల సమస్యలపై చర్చ జరగాల్సిన SRCC వేదిక.. మోదీ-విమర్శకుల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారడం చర్చనీయాంశంగా మారింది. -
'ఎస్ఆర్సీసీ'లో తమిళనాడు విద్యార్థుల ప్రభంజనం!
న్యూఢిల్లీః దేశ రాజధాని నగంరంలో విద్యావిధానంలోనే తనకంటూ ప్రత్యేగ గుర్తింపు తెచ్చుకొని, స్థానిక విద్యాలయాలకు దీటుగా ప్రత్యేక గౌరవాన్ని పొందుతున్న ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఇప్పుడు తమిళనాడు విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. భారతదేశంలోనే కామర్స్ విద్యకు నెలవుగా ప్రఖ్యాతి పొందిన ఎస్ఆర్సీసీ.. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో భాగంగా బీకాం హిస్టరీ, ఎకనామిక్స్ లను విద్యార్థులకు అందిస్తోంది . అటువంటి పేరు ప్రఖ్యాతులు పొందిన ఢిల్లీ యూనివర్శిటీ సారధ్యంలోని ఎస్ఆర్సీసీ కళాశాలలో సీటు పొందాలంటే కటాఫ్ మార్కులు 98 శాతం దాటాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఒక్క తమిళనాడుకు చెందిన విద్యార్థులే 75 నుంచి, 80 శాతం సీట్లను కైవసం చేసుకొని కళాశాల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరతీశారు. ఇప్పటివరకూ భర్తీ చేసిన సీట్లలో మరి కొందరు కేరళకు చెందినవారు ఉన్నట్లుగా సిబ్బంది చెప్తున్నారు. స్థానిక విద్యాలయాలకే తలమానికంగా నిలుస్తున్న ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో తమిళనాడు విద్యార్థుల హవా కొనసాగింది. ఈ విద్యాసంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్లు ఇచ్చేందుకు కళాశాల నిర్వహించిన మొదటి రెండురోజుల డ్రైవ్ లో తమిళనాడుతోపాటు అత్యధికంగా కేరళ విద్యార్థులు కూడ ఎన్ రోల్ చేసుకున్నారు. కామర్స్ ఎడ్యుకేషన్ అంటే దేశంలోనే మొదటిగా గుర్తుకొచ్చే శ్రారామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో సీటు సంపాదించడం ఎంతో కష్టం. అటువంటిది ఇప్పుడు 75 నుంచి 80 శాతం సీట్లు కేవలం తమిళనాడు విద్యార్థులే కైవసం చేసుకోవడం కళాశాల సిబ్బందినే ఆశ్చర్యపరుస్తోంది. తమ సర్వీసులో ఇటువంటి అనుభవం ఎప్పుడూ జరగలేదని సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటివరకూ ఇచ్చిన అడ్మిషన్లలో 80 శాతం వరకూ తమిళనాడునుంచి వచ్చినవారే ఉన్నారని, మిగిలినవారిలో కొందరు కేరళ బోర్డుకు చెందిన విద్యార్థులు కూడ ఉన్నారని ఎస్ఆర్సీసీ కళాశాల అడ్మిషన్ ఇన్ ఛార్జ్ అనిల్ కుమార్ తెలిపారు. ఢిల్లీ యూనివర్శీటీ స్టేట్ బోర్డ్స్ నుంచి వచ్చే విద్యార్థుల మార్కుల విషయంలో ఎటువంటి నిబంధనలు విధించలేదన్నారు. ఇప్పటివరకూ 339 మంది విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, ఫీజు చెల్లించటంకోసం యూనివర్శిటీకి కూడ పంపించినట్లు అనిల్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా బికాం హిస్టరీలో అడ్మిషన్లకోసం తమిళనాడునుంచి అత్యధికశాతం విద్యార్థులు వచ్చారని, కేవలం ఒకే రాష్ట్రంనుంచి ఇంతమంది విద్యార్థులు అడ్మిషన్లకు పోటీపడటం కళాశాల చరిత్రలోనే చూడలేదని ఎస్ఆర్సీసీ కాలేజీ అధికారులు కొందరు చెప్తున్నారు. అయితే ఈయేడు ఇప్పటివరకూ తాము అడ్మిషన్లు ఇచ్చినవారిలో అత్యధిక మార్కులున్న విద్యార్థిని కేరళ బోర్డుకు చెందిన ఎలిజబెత్ థామస్ అని తెలిపారు. అడ్మిషన్లకు మరో రోజు మాత్రమే గడువు ఉందని, ఒకవేళ పూర్తిశాతం సీట్లు భర్తీకాని పక్షంలో రెండో లిస్టును తయారు చేయడం గాని, లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందినవారికి అవకాశం ఇవ్వడంగాని జరుగుతుందని కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం తమిళనాడు బోర్డు అత్యధికశాతం మార్కులను స్కోర్ చేసిందని, అందుకే ఎస్ఆర్సీసీలో ఇప్పుడు అధికశాతం తమిళనాడు విద్యార్థులకు అడ్మిషన్లు లభించాయని కళాశాల ఫ్యాకల్టీ మెంబర్ ఒకరు తెలిపారు. తమిళనాడు బోర్డులో 99 శాతం మార్కులు దాటినవారే అధికంగా ఉన్నారని, అటువంటప్పుడు కాంపిటేషన్ లో వారు ముందుండటం సహజమేనన్నారు. దీన్నిబట్టి చూస్తే విద్యాభ్యాసానికి ఢిల్లీ సరైన ప్రాంతం అని మరోసారి రుజువైందని తెలిపారు.


