breaking news
sp.j. Satyanarayana
-
పోలింగ్ రోజు ఆరంచెల బందోబస్తు
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ చెప్పారు. తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రూరల్ జిల్లా పరిధిలో మొత్తం పది మున్సిపాలిటీల్లో 556 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. 90కి పైగా అత్యంత సమస్యాత్మక, 195 సమస్యాత్మక పోలింగ్స్టేషన్లను గుర్తించామని తెలిపారు. ఆయాప్రాంతాల్లో ఆరంచెల విధానాల్లో బందోబస్తు కొనసాగుతుందన్నారు. నిఘానీడలో ఎన్నికలు కొనసాగుతాయన్నారు. స్థానిక పోలీసులతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల గస్తీ, వీడియోగ్రఫీ, మైకుల ద్వారా నిషేదాజ్ఞల ప్రచారం తదితర ఎన్నికలకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎక్కడా ఎన్నికల ఘర్షణలు జరిగిన సందర్భాలు లేవన్నారు. సాధారణ ఎన్నికలు ముగిసేవరకూ మొత్తం 21 కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాలో విధులు నిర్వహిస్తాయన్నారు. పలు ధఫాలుగా ఆయా కంపెనీలు జిల్లాకు చేరుకుంటాయన్నారు. పల్నాడు ప్రాంతంలో అదనంగా కేంద్ర బలగాలను మోహరింప జేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.ఇప్పటివరకూ జిల్లాలో పోలీసులు, ఎన్నికల పరిశీలకులు 15 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పోలింగ్ స్టేషన్లవద్ద అల్లర్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయటంలో వెనుకాడేదిలేదని హెచ్చరించారు. -
మున్సిపల్ ఎన్నికలకు 3 వేల మంది సిబ్బంది
రేపల్లెరూరల్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. రేపల్లె సర్కిల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1000 మంది సివిల్, 1000 మంది స్పెషల్పోలీస్లతో పాటు 1000 మంది హోంగార్డులతో భద్రత కల్పిస్తామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 చెక్‌పోస్టుల్లో కోటి 45 లక్షల రూపాయలు, 31 కిలోల వెండి సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,023 మంది రౌడీషీటర్లలో ఇప్పటివరకు 803 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండవర్ చేశామన్నారు. ఎన్నికల్లో అల్లర్లు చేసే అవకాశం ఉన్నవారిని 15 వేల మంది (ట్రబుల్ మంగర్స్)ని గుర్తించి 11 వేల మందిని మండల మెజిస్ట్రేట్ సమక్షంలో బైండవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అతిక్రమించిన 39 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. 11 వాహనాలను ఎన్నికల నియమావళి అతిక్రమించినందున సీజ్ చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,485 లిక్కర్ బాటిల్స్‌ను, 180 లీటర్ల సారా సీజ్ చేసి 59 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల బందోబస్తుపై సీఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో బాపట్ల, గుంటూరు డీఎస్పీలు జోసఫ్ రాజ్‌కుమార్, సత్యనారాయణ, రేపల్లె టౌన్, రూరల్ సీఐలు యు.నాగరాజు, పెంచల రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.