breaking news
South Indian dishes
-
వాట్ యాన్ ఐడియా! ఇడ్లీ ఏటీఎం మిషన్...హాయిగా లాగించేయి గురు!
ఏటీఎం మెషిన్లో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ చేయడం వరకు మనకు తెలుసు ఔనా!. ఇక నుంచి టిఫిన్స్‌కి సంబంధించిన ఏటీఎంలు కూడా రానున్నాయండి. ఔను! ప్రస్తుతం ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు బెంగళూరుకి చెందిన యువ స్టార్ట్ అప్పర్లు. వివరాల్లోకెళ్తే...ఇక నుంచి మహా నగరాల్లోకి ఇడ్లీ ఆటోమేటిడ్ మేకింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త రోబోటిక్ మిషన్‌ని బెంగళూరుకి చెందిన ఎంట్రప్రెన్యూర్స్ శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ రూపొందించారు. మన ఏటీఎం మిషన్‌లానే 24x7 సేవలందిస్తుంది. చాలా ఫ్రెష్‌గా వేడివేడి ఇడ్లీలను అందిస్తుంది. ఒక్కషాట్‌లో 72 ఇడ్లీలను కేవలం 12 నిమిషాల్లో అందిస్తుంది. అంతేకాదండోయ్ బయట హోటల్స్ రెస్టారెంట్స్ మాదిరిగా టిఫిన్ తోపాటు చట్నీ, కారప్పొడి, సాంబర్తో సహా అందిస్తోంది. ఐతే మనం ఈ మిషన్ వద్దకు వచ్చి మెనులో మనకు నచ్చిన టిఫిన్‌ని సెలక్ట్ చేసుకుని దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి బిల్ పే చేస్తే...55 సెకండ్లలో మన ఆర్డర్ ప్యాక్ చేసి మన ముందు ఉంటుంది. ఈ ఆలోచన హిరేమత్‌కి 2016లో ఒక రోజు తన కూతురు అనారోగ్యం బారిన పడినప్పుడూ వచ్చినట్లు చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి తన కూతురుకి వేడి వేడి ఇడ్లీ దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. అప్పుడే తనకు ఏ సమయంలోనైనా వేడివేడిగా ఫ్రెష్‌గా లభించాలే ఆహారం అందించాలని నిర్ణయించుకుని ఈ ఆటోమెటిష్ మిషన్‌ని తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మిషన్‌లో ఇడ్లీ, వడ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సౌత్ ఇండియన్స్ వంటకాలకి సంబంధించిన తొలి అల్పాహర ఆటోమెటిక్ మిషన్ అని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఏటీఎం ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌లను విస్తరింప చేయడమే కాకుండా ఈ ఏటీఎంలో జ్యూస్, రైస్, దోశ వంటి వాటిని కూడా అందించే ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు తెలిపాడు. (చదవండి: వృద్ధురాలి కంటి నుంచి ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ తీసిన వైద్యులు) -
దక్షిణాది వంటకాలతో మెక్‌డోనాల్డ్స్
అమరావతి : దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు 'మెక్‌డోనాల్డ్' ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 242గా ఉన్న రెస్టారెంట్ల సంఖ్యను వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెక్‌డోనాల్డ్ ఇండియా బిజినెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ (సౌత్) గెరాల్డ్ డయాస్ తెలిపారు. కేవలం రెస్టారెంట్ల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా ఇక్కడివారి రుచులకు అనుగుణంగా మెనూ తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలవారు స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతారని, వీరి కోసం ప్రత్యేక మెనూ తయారుచేసినట్లు తెలిపారు. విజయవాడలో తొలి మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాకాహారుల కోసం ప్రతీ రెస్టారెంట్లోనూ ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత నెలలో నెల్లూరులో మొదటి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే గుంటూరు, విశాఖపట్నంలో రెస్టారెంట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. విజయవాడలోని రెస్టారెంట్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత విస్తరణపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మెక్‌డోనాల్డ్ ప్రస్తుతం 21 రెస్టారెంట్లను కలిగి ఉంది. మొత్తం ఇండియా వ్యాపారంలో 40 శాతం కేవలం దక్షిణాది రాష్ట్రాల నుంచే సమకూరుతుండటంతో ఈ రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.