breaking news
Solar Cities
-
సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి
సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది.దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. TG REDCO ద్వారా రూ 10.53 కోట్లతో 514 ఇండ్లతో , పాటు 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది.ప్రతి ఇంటికి 3 KW స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 KW సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు. మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 1,500 KW ఉన్నది. మట్టి గోడలతో ఉన్న 34 ఇండ్ల కుటుంబాలు కూడా సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే, ఇండ్ల పైన సౌర విద్యుత్ పరికరాలు బిగించనున్నట్లు TG REDCO ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మేనేజర్ కె. మనోహర్ రెడ్డి తెలిపారు.కొండారెడ్డిపల్లి గ్రామం సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 10.53 కోట్లు . అందులో రూ.7.96 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు కేటాయించారు. సౌర విద్యుత్ కు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.3.56 కోట్లు , M/s Premier Energies కంపెనీ నుండి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల నుండి రూ 4.092 కోట్లు భరించారు. మరో రూ 2.59 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేశారు.ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.(ప్రతి KW కు 120 యూనిట్స్ అవుతుంది) ఇండ్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను , ఇంటి వినియోగానికి పోగా,మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేశారు. గ్రిడ్ కు పంపే విద్యుత్ యూనిట్ కు రూ 5.25 చొప్పున చెల్లించుటకు లబ్దిదారులతో విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకున్నది. సెప్టెంబర్ నెలలో విద్యుత్ గ్రిడ్ కు గ్రామం మొత్తం నుండి సుమారు ఒక లక్ష యూనిట్స్ విద్యుత్ ఎగుమతి అయింది. తద్వారా రూ 5 లక్షలు ఆదాయాన్ని గ్రామస్తులు ఒక నెలలోనే ఆర్జించారు. -
తెలుగు రాష్ట్రాల్లో సోలార్ సిటీస్
♦ విజయవాడ, మహబూబ్‌నగర్ ఎంపిక ♦ 50 సోలార్ సిటీస్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ : అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ఇరుచోట్ల సోలార్ సిటీస్ అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఏపీలోని విజయవాడను ‘పైలట్ సోలార్ సిటీ’గా అభివృద్ధి చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ను సోలార్ సిటీగా అభివృద్ధి చేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ సమాచారం ప్రకారం.. 50 సోలార్ సిటీల అభివృద్ధి నమూనా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో న్యూఢిల్లీ, ఆగ్రా, చండీగఢ్, గుర్గావ్, అమృత్సర్, న్యూ టౌన్ (కోల్‌కతా), కొచ్చి, భోపాల్ తదితర పట్టణాలు ఉన్నాయి. ఈ 50 సోలార్ సిటీస్ ప్రతిపాదనల్లో 46 పట్టణాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారయ్యింది. వీటిలో విజయవాడ, నాగ్‌పూర్, సూరత్, థానే, ఇంపాల్, ఔరంగాబాద్, గుర్గావ్, సిమ్లా, మైసూర్ తదితర పట్టణాలు ఉన్నాయి. అలాగే మంత్రిత్వ శాఖ మహబూబ్‌నగర్, తిరువనంతపురం, జైపూర్, ఇండోర్, లెహ్ పట్టణాల అభివృద్ధికి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.