తెలుగు రాష్ట్రాల్లో సోలార్ సిటీస్ | Telugu states in the Solar Cities | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో సోలార్ సిటీస్

Aug 24 2015 2:14 AM | Updated on Sep 3 2017 8:00 AM

తెలుగు రాష్ట్రాల్లో సోలార్ సిటీస్

తెలుగు రాష్ట్రాల్లో సోలార్ సిటీస్

అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ఇరుచోట్ల సోలార్ సిటీస్ అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఏపీలోని విజయవాడను ‘పైలట్

♦ విజయవాడ, మహబూబ్‌నగర్ ఎంపిక
♦ 50 సోలార్ సిటీస్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
 
 న్యూఢిల్లీ :  అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ఇరుచోట్ల సోలార్ సిటీస్ అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఏపీలోని విజయవాడను ‘పైలట్ సోలార్ సిటీ’గా అభివృద్ధి చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ను సోలార్ సిటీగా అభివృద్ధి చేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. 50 సోలార్ సిటీల అభివృద్ధి నమూనా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

ఇందులో న్యూఢిల్లీ, ఆగ్రా, చండీగఢ్, గుర్గావ్, అమృత్‌సర్, న్యూ టౌన్ (కోల్‌కతా), కొచ్చి, భోపాల్ తదితర పట్టణాలు ఉన్నాయి. ఈ 50 సోలార్ సిటీస్ ప్రతిపాదనల్లో 46 పట్టణాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారయ్యింది. వీటిలో విజయవాడ, నాగ్‌పూర్, సూరత్, థానే, ఇంపాల్, ఔరంగాబాద్, గుర్గావ్, సిమ్లా, మైసూర్ తదితర పట్టణాలు ఉన్నాయి. అలాగే మంత్రిత్వ శాఖ మహబూబ్‌నగర్, తిరువనంతపురం, జైపూర్, ఇండోర్, లెహ్ పట్టణాల అభివృద్ధికి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

Advertisement
Advertisement